హక్కులను అణచివేస్తున్న సర్కార్‌  | TSRTC Strike: Bhatti Vikramarka Mallu Fires On CM KCR | Sakshi
Sakshi News home page

హక్కులను అణచివేస్తున్న సర్కార్‌ 

Published Sun, Nov 10 2019 3:43 AM | Last Updated on Sun, Nov 10 2019 3:43 AM

TSRTC Strike: Bhatti Vikramarka Mallu Fires On CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజల భావ వ్యక్తీకరణను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అణచివేస్తోందని, రాష్ట్రం లో ప్రజలకు కనీస హక్కులు లేకుండా చేస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఆర్టీసీ జేఏసీ పిలుపునిచి్చన ‘చలో ట్యాంక్‌బండ్‌’కార్యక్రమంపై చర్చించేందుకు శనివారం గాంధీ భవన్‌లో ముఖ్య నేతలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ చిన్న ఉద్యమం చేపట్టినా కాంగ్రెస్‌ నేతల ఇళ్లను పోలీసులు దిగ్బంధనం చేస్తున్నారని, నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారని, జిల్లాల్లోని నేతలను పోలీస్‌ స్టేషన్లకు తరలిస్తున్నారని, ఇది ప్రజల హక్కులను కాలరాయడమేనని అన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలను పూర్తిగా అణచివేసే విధంగా ఉన్న ప్రభుత్వ చర్యలను సహించేది లేదని అన్నారు. ‘చలో ట్యాంక్‌బండ్‌’సందర్భంగా చేసిన అరెస్టులు, లాఠీ చార్జీలను తీవ్రంగా ఖండించారు. గాయపడ్డ వారికి ప్రభుత్వమే పూర్తి స్థాయిలో చికిత్సలు చేయించాలని డిమాండ్‌ చేశారు. కాగా, భవిష్యత్‌ కార్యక్రమాన్ని రూపొందించేందుకు ఆదివారం మరోసారి సమావేశం కావాలని కాంగ్రెస్‌ నేతలు నిర్ణయించారు. ఈ సమావేశంలో సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి,టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్‌ కుమార్, వంశీ చందర్‌ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్, మాజీ ఎంపీ వీహెచ్‌ తదితరులు పాల్గొన్నారు. 

బీజేపీ ఎన్నికల అస్త్రం సమసిపోయింది: జెట్టి
అయోధ్య వివాదాస్పద భూమి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో బీజేపీకి ఎన్నికల అస్త్రం సమసిపోయిందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెట్టి కుసుమకుమార్‌ అన్నారు.ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అయోధ్య పేరు చెప్పి ఓట్లు దండుకునేందుకు యతి్నంచేదని, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో బీజేపీకి కీలక ఎన్నికల అస్త్రం చేజారినట్టయిందని ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కోర్టు తీర్పును కాంగ్రెస్‌ పార్టీ గౌరవిస్తుందని, ప్రజలంతా సమన్వయంతో ముందుకెళ్లాలని ఆ ప్రకటనలో ఆయన కోరారు. 

పోలీసుల తీరు దుర్మార్గం: ఆర్‌.కృష్ణయ్య 
సాక్షి, హైదరాబాద్‌: మిలియన్‌ మార్చ్‌లో పాల్గొన్న ఆర్టీసీ కారి్మకులపై పోలీసులు ప్రవర్తించిన తీరు దుర్మార్గంగా ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య విచారం వ్యక్తం చేశారు. ఉద్యమకారులు, ఆర్టీసీ కారి్మకులపై లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగించి రక్తపాతం సృష్టించారని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ నియంతృత్వ, నిరంకుశ వైఖరి మార్చుకోవాలని, పరిస్థితి చేయి దాటిపోక ముందే ఆర్టీసీ కారి్మకులతో చర్చలు జరిపి వారి డిమాండ్లను పరిష్కరించాలని సూచించారు. ఇప్పటికే 22 మంది కారి్మకులు చనిపోయారని, ఇంకా వేలాది మంది తీవ్ర నిరాశా నిస్పృహలతో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు రవాణా వ్యవస్థ లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. 90 శాతం దేశాల్లో ప్రజా రవాణా వ్యవస్థ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తోందని, ఆరీ్టసీని ప్రైవేటీకరణ చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రైవేటీకరణతో విపరీతంగా చార్జీలు పెరుగుతాయని, పేద ప్రజలకు ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో ఉండదన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రతిష్టకు పోకుండా వెంటనే ఆర్టీసీ ఉద్యోగులతో చర్చలు జరిపి, బస్సులు నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement