
సాక్షి, హైదరాబాద్ : ఇంకా అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోకముందే రేవంత్ రెడ్డికి టీపీసీసీ నేతలు ఎల్లడలా మద్దతు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో రేవంత్ నిర్వహించిన ‘ఆత్మీయులతో మాట-ముచ్చట’ సభకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి హాజరయ్యారు.
ఉత్తమ్‌తోపాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా రేవంత్ సభలో పాల్గొనడం గమనార్హం. ‘ఆత్మీయుల ముచ్చట’లో మాట్లాడిన వేం నరేందర్ రెడ్డి.. తాము ఇప్పుడు, ఎప్పుడూ రేవంత్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు.
రేపు అధికారిక చేరిక : ఆత్మీయ ముచ్చట అనంతరం నేరుగా ఢిల్లీకి వెళ్లనున్న రేవంత్‌రెడ్డి.. రేపు(మంగళవారం) రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి అధికారికంగా చేరనున్నారు. ఆయనతోపాటు పలువురు టీడీపీ ముఖ్యులు కూడా కాంగ్రెస్‌లో చేరతారు.
ఆత్మీయ సభకు హాజరైన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment