హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ టూర్ కవరేజ్ లో గాయపడి అపోలోలో చికిత్స పొందుతున్న మహిళా రిపోర్టర్ ను కలిసి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ కూడా ఆసుపత్రికి వెళ్లారు. చికిత్సకయ్యే ఖర్చును తమ పార్టీనే భరిస్తుందని నేతలు ఆమెకు భరోసా ఇచ్చారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల కుటుంబాలకు రూ. 10లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీని పూర్తిగా ఒకే దఫాలో అమలు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.