'ప్రతిపక్షాలవి అవగాహనలేమి వ్యాఖ్యలు'
నిజామాబాద్: మహారాష్ట్ర ఒప్పందంపై ప్రతిపక్షాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయని టీఆర్ఎస్ రాజ్యసభసభ్యుడు డి.శ్రీనివాస్ అన్నారు. నిజామాబాద్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...కాంగ్రెస్ పార్టీ నేతలపై మండిపడ్డారు.
కాంగ్రెస్ హయాంలో ఒప్పందాలు జరిగి ఉంటే బయటపెట్టాలని డీఎస్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టులకు డబ్బులు ఖర్చు పెట్టారు. కానీ, పనులు ఎందుకు పూర్తికాలేదని ప్రశ్నించారు. కోటి ఎకరాలకు సాగునీరు, ప్రతి ఇంటికి కుళాయి నీరు అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని అభినందించారు.