
సాక్షి, హైదరాబాద్: సిగ్గు, లజ్జ ఉంటే ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) టీఆర్‌ఎస్ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్లిపోవాలని బాజిరెడ్డి గోవర్ధన్ సవాల్ విసిరారు. మంగళవారం సచివాలయంలో మాట్లాడుతూ.. డీఎస్ వల్ల టీఆర్‌ఎస్‌కి ఏమాత్రం ప్రయోజనం లేదన్నారు.
డీఎస్‌కు రాజ్యసభ సీటు కోసం ఆరాటం తప్ప మరొకటి లేదని విమర్శించారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే రాజ్యసభ సభ్యుడిగా పదవిని అనుభవించవచ్చని డీఎస్ ఆరాటపడుతున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment