'ఏం అన్యాయం జరిగిందో చంద్రబాబు చెప్పాలి' | d srinivas questioned babu against section 8 issue | Sakshi
Sakshi News home page

'ఏం అన్యాయం జరిగిందో చంద్రబాబు చెప్పాలి'

Published Wed, Jun 24 2015 6:54 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

'ఏం అన్యాయం జరిగిందో చంద్రబాబు చెప్పాలి' - Sakshi

'ఏం అన్యాయం జరిగిందో చంద్రబాబు చెప్పాలి'

హైదరాబాద్: సెక్షన్ 8 ఎందుకు అమలు చేయాలో ఆంధ్రప్రదేశ్ మంత్రులు చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ ప్రశ్నించారు. హైదరాబాద్ లో సీమాంధ్రులకు ఎలాంటి అన్యాయం జరిగిందో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ నేతలు యత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. అనిశ్చిత పరిస్థితుల నుంచి లబ్ధిపొందేందుకు చంద్రబాబు టీమ్ రాద్ధాంతం చేస్తోందన్నారు. సెక్షన్ 8 అవసరం లేదనడానికి  హైదరాబాద్ పరిస్థితులే నిదర్శనమని డీఎస్ పేర్కొన్నారు.

హైదరాబాద్ అంశాన్ని వివాదాస్పదం చేయాలని చూస్తే ప్రజలు సహించరని చెప్పారు. విభజన ప్రక్రియ ప్రశాంతగా జరిగిందని, విఘాతం కలిగించాలని బాబు చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. సెక్షన్ 8 అమలు చేస్తే ఆమరణ దీక్ష చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ అనడం సరికాదన్నారు. సెక్షన్ 8 అవసరం రాదని మేం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఆనాడే చెప్పామని డీఎస్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement