
మాజీ రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్‌ను వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం పరామర్శించారు. డీఎస్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ మాజీ ఎంపీ డి.శ్రీనివాస్‌ను వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం పరామర్శించారు. డీఎస్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఆసక్తి కరమైన చర్చ సాగింది. వైఎస్సార్‌తో ఉన్న పాత అనుభవాలను డీస్ గుర్తు చేశారు. వైఎస్సార్‌పై తెలంగాణ ప్రజల అభిమానం చెక్కు చెదరలేదన్నారు. షర్మిలను బలమైన మహిళగా డీఎస్ పేర్కొన్నారు. షర్మిల కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారన్నారు. వైఎస్ సీఎం అవుతారని 2003లోనే చెప్పానని డీఎస్ గుర్తు చేసుకున్నారు.
చదవండి: కేసీఆర్‌తో కోల్డ్‌వార్.. గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు