సాక్షి, న్యూఢిల్లీ: డి.శ్రీనివాస్ గతంలో పలుసార్లు ఎన్నికల్లో ఓడినా పదవులు దక్కాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ అన్నారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘డీఎస్ పార్టీని వీడతారని అనుకోవడం లేదు. కాంగ్రెస్‌కు ఆయన విధేయుడుగా ఉన్నారు. పార్టీ కూడా సముచితంగా గౌరవించింది.
ఆయన గతంలో పలుసార్లు ఎన్నికల్లో ఓడినప్పటికీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఈసారి మహిళలకు అవకాశం ఇవ్వాలని పార్టీ భావించింది. అందువల్ల మహిళను ఎంపిక చేశాం. పైగా ఆమెకు ఇవ్వాలని డీఎస్ కూడా ప్రతిపాదించారు’ అని అన్నారు. సీనియర్లు పార్టీని వీడడం అవకాశవాదమేనన్నారు.
డీఎస్ ఓడినా పదవులు దక్కాయి: దిగ్విజయ్
Published Thu, Jul 2 2015 3:02 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement