'నేను మంత్రి పదవి ఆశించడం లేదు' | I didnot expect minister post, says DS | Sakshi
Sakshi News home page

'నేను మంత్రి పదవి ఆశించడం లేదు'

Published Thu, Jul 23 2015 6:05 PM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

'నేను మంత్రి పదవి ఆశించడం లేదు' - Sakshi

'నేను మంత్రి పదవి ఆశించడం లేదు'

హైదరాబాద్ : తాను మంత్రి పదవి ఆశించడం లేదని ఇటీవలే టీఆర్ఎస్ పార్టీలో చేరిన నేత డీ శ్రీనివాస్ అన్నారు. నగరంలోని మీడియాతో ఆయన గురువారం మాట్లాడారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం బాధాకర అంశమని ఆయన అన్నారు. మొదటి నుంచి నేను ఫిరాయింపులకు వ్యతిరేకమేనని డీఎస్ చెప్పారు. యాంటీ డిఫెక్షన్ చట్టమున్నా వ్యవస్థలో చాలా లోపాలున్నాయని, అందుకే వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నా సేవలను ఏ రకంగా ఉపయోగించుకున్నా తనకు ఓకేనని ఆయన అన్నారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడు సమైక్యవాదినే, కానీ ఈ తర్వాతే తాను వేర్పాటువాదిగా మారినట్లు ఈ సందర్భంగా డీఎస్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement