Anti Defection Law
-
Anti Defection Law: మేడిపండు ప్రజాస్వామ్యం
భారత రాజ్యాంగంలో పేర్కొన్న పార్లమెంట్, శాసన సభల వ్యవస్థలు, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వంటివి చెప్పే ప్రజాస్వామ్యం మేడిపండు లాంటిదని కొన్ని సంవత్సరాలుగా రుజువవు తూనే ఉంది. నేడు తెలంగాణలో ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఆ కంపును మరింత వ్యాపింప చేసింది. భారత రాజ్యాంగంలో ఒక పార్టీ తరఫున చట్ట సభలకు ఎన్నికై మరొక పార్టీలోకి వెళితే అతని సభ్యత్వం రద్దు అవుతుందని మొదట్లో పేర్కొన లేదు. అందువల్ల కొందరు పార్టీలు మారి కొన్ని ప్రభుత్వాల పతనానికి కారకులయ్యారు. 1952–67 మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కేరళ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు జరిగి ప్రభుత్వాలు మారిపోయాయి. 1967లో లోక్‌సభతో పాటు 16 రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలు జరగగా... ఎనిమిది రాష్ట్రాల్లో కాంగ్రెస్ మెజారిటీ కోల్పోయింది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పెద్ద పార్టీగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసి, తర్వాత పార్టీ ఫిరాయింపులు చేయించి మెజారిటీ పొందింది. 1967–71 మధ్య పార్లమెంట్, శాసనసభకు ఎన్నికైన నాలుగు వేల మంది సభ్యుల్లో 2 వేల మంది పార్టీ ఫిరాయింపులు చేశారు. ఫిరాయింపుల పట్ల ప్రజల్లో అసహ్యం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 1979లో తొలిసారి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రూపొందించింది. 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం 52వ రాజ్యాంగ సవరణ చేసి ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తెచ్చింది. 2003లో వాజ్‌పేయి ప్రభుత్వం 91వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్ లోని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి మరికొన్ని సవరణలు చేసింది. దీని ప్రకారం ఒక పార్టీ తరఫున టికెట్టు పొంది ఎన్నికైన సభ్యుడు ఆ పార్టీకి స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పుడూ, పార్టీ జారీ చేసిన విప్‌కు వ్యతిరేకంగా ఓటింగ్‌కు హాజరు కానప్పుడూ, విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేసినప్పుడూ, స్వతంత్ర సభ్యులుగా ఎన్నికైన సభ్యులు ఏదైనా పార్టీలో చేరినప్పుడూ; నామినేట్ అయిన పార్లమెంట్, శాసనసభ సభ్యులు 6 నెలల్లోపు ఏదైనా పార్టీలో చేరినప్పుడూ సభ్యత్వాలు రద్దు అవుతాయి. ఈ చట్టంలో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీ మొత్తం శాసన సభ్యుల్లో 2/3 వంతుల మంది వేరే పార్టీలో చేరినప్పుడు, లేదా స్వతంత్రంగా పార్టీ పెట్టిన ప్పుడు వారి సభ్యత్వాలు రద్దు కావు. చట్టంలో ఉన్న కంతలు ఉపయోగించుకుని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు తన వ్యతిరేక రాష్ట్ర ప్రభుత్వాలను కూలుస్తున్నాయి. 2016లో అరుణా చల్ప్రదేశ్లో 45 కాంగ్రెస్ సభ్యుల్లో ఆ పార్టీ ముఖ్యమంత్రితో సహా 44 మంది సభ్యులు ‘పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్’లో విలీనమయ్యారు. ఉత్తరాఖండ్‌లోనూ ఇలాగే జరిగింది. తెలంగాణలోనూ 2/3 మంది కాంగ్రెస్ సభ్యులు టీఆర్ఎస్లో చేరారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సభ్యుల చేత రాజీనామా చేయించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ పడగొట్టించి, తన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 23 మంది వైసీపీ శాసనసభ్యులు రాజీనామాలు చేయకుండానే చంద్రబాబు పార్టీలో చేరి కొందరు మంత్రులయ్యారు. కర్ణాటకలో కొందరు కాంగ్రెస్ శాసన సభ్యుల చేత రాజీనామాలు చేయించి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించింది. చట్ట సభల స్పీకర్లు రాజకీయ పార్టీలు కోరినా... గీత దాటిన సభ్యులపై అనర్హత వేటు వేయడంలో పక్షపాతం చూపిస్తున్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారి ఎడల అనర్హత వేటు వేయకుండా పదవీ కాలం ముగిసేవరకు సభ్యునిగా కొనసాగే వైఖరిని తీసుకుని... వ్యతిరేకంగా ఉన్న సభ్యునిపై వెంటనే అనర్హత వేటు వేస్తున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య తాజాగా టీఆర్ఎస్ శాసనసభ సభ్యుల కొనుగోలు వ్యవహారంలో వివాదం సాగుతోంది. పరస్పర ఆరోపణలు జగుస్సాకరంగా సాగుతున్నాయి. ఇదంతా చూస్తుంటే దేశంలో ప్రజాస్వామ్యం ఎంత బాగా పరిఢవిల్లుతోందో అర్థమవుతోంది. ఈ పరిస్థితిని మార్చడానికి ప్రజలు ఉద్యమించాలి. (క్లిక్ చేయండి: కళ్లముందున్న వివక్ష కనబడదా?) - బొల్లిముంత సాంబశివరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,రైతు కూలీ సంఘం (ఏపీ) -
కర్ణాటకం : అదే చివరి అస్త్రం..
బెంగళూర్ : కన్నడ రాజకీయాలు నాటకీయ మలుపులు తిరుగుతూ ఉత్కంఠ రేపుతున్నాయి. బలపరీక్ష వాయిదా వేయాలని కాంగ్రెస్-జేడీఎస్ సభ్యుల వినతిని స్పీకర్ ఆర్ రమేష్ కుమార్ తోసిపుచ్చడంతో రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటును చేపట్టేందుకు సంకీర్ణ నేతలు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్ధితి ఫిరాయింపు నిరోధక చట్టం అమలుకు అనువుగా ఉందని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ దినేష్ గుండూరావు అన్నారు. అనర్హత పిటిషన్‌పై తమ తరపున తమ న్యాయవాది స్పీకర్ ఎదుట పదునైన వాదన వినిపించారని చెప్పారు. రెబెల్ ఎమ్మెల్యేలకు తమకు ద్రోహం తలపెట్టి అనర్హత వేటుకు గురయ్యేందుకు అర్హులయ్యారని అన్నారు. ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ప్రయోగించేందుకు ఇది సరైన ఉదంతమని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు విశ్వాస తీర్మానంపై ఓటింగ్ గండంపై ఆందోళనతో కాంగ్రెస్ నేత, ట్రబుల్ షూటర్‌గా పేరొందిన డీకే శివకుమార్ వేదాంత ధోరణిలో మాట్లాడారు. బీజేపీ తీరును ఎండగడుతూ అందరం ఎప్పటికైనా తనువు చాలించాల్సిందేనని, మహా అయితే కొందరు రాత్రికి మరో రెండు పెగ్గులు అదనంగా తీసుకుంటారని అధికార దాహం తగదనే రీతిలో వ్యాఖ్యానించారు. ఇక విశ్వాస పరీక్షపై ఓటింగ్‌కు సంబంధించి స్పీకర్‌కు తాము ఆదేశాలు ఇవ్వలేమని రెబెల్ ఎమ్మెల్యేల పిటిషన్‌పై సుప్రీం కోర్టు పేర్కొంది. బలపరీక్ష రెండ్రోజుల్లో జరుగుతుందని భావిస్తున్నామని, రేపు పిటిషన్‌పై విచారణను చేపడతామని కోర్టు స్పష్టం చేసింది. -
విలీనం రాజ్యాంగ విరుద్ధమైతే రద్దు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌ను టీఆర్ఎస్లో విలీనం చేసేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసరంగా విచారించాల్సిన అవసరమేమీ లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ విలీనం రాజ్యాంగ విరుద్ధమైతే, దాన్ని రద్దు చేస్తామని, ఆ అధికారం తమకుందని తేల్చి చెప్పింది. ఇలాంటి కేసులను అత్యవసరంగా విచారించనంత మాత్రాన మిన్ను విరిగి మీద పడదని పేర్కొంది. తదుపరి విచారణను జూన్ 11కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్పీకర్‌కు ఆ అధికారం లేదు.. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే శాసనసభమండలిలో విలీనం పూర్తి చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు శానససభలో కూడా అలాగే విలీనం చేసేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. పార్టీలను విలీనం చేసే పరిధి ఎన్నికల సంఘానికి మాత్రమే ఉందని, 10 షెడ్యూల్ కింద ట్రిబ్యునల్‌గా వ్యవహరించే స్పీకర్‌కు ఎలాంటి అధికారం లేదని వాదించారు. విలీనాన్ని తోసిపుచ్చని అదనపు ఏజీ.. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. కాంగ్రెస్ సభ్యుల సభ్యత్వాలేమీ రద్దు కావట్లేదన్నారు. విలీనం చేయడం లేదని మాత్రం చెప్పలేదు. అంత అత్యవసరంగా ఈ వ్యాజ్యంపై విచారణ జరపాల్సిన అవసరమేమీ లేదన్నారు. మేమేమీ రోబోలం కాదు.. ప్రతి కేసును అత్యవసరంగా విచారించడమంటే న్యాయమూర్తులకు సాధ్యం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులేమీ రోబోలు కాదని, వారూ మనుషులేనని, వారికీ విశ్రాంతి అవసరమన్న సంగతి గుర్తించాలని పేర్కొంది. న్యాయపరమైన బాధ్యతలతో పాటు పాలనాపరమైన బాధ్యతలు కూడా న్యాయమూర్తులకు ఉంటాయంది. మరుసటి రోజు విచారణకు వచ్చే కేసులను రాత్రి పొద్దుపోయే వరకు చదువుకోవాల్సి ఉంటుందని తెలిపింది. జూన్ తర్వాత పరిస్థితుల్లో కొంత మార్పులు వచ్చే అవకాశం ఉందని, కొత్త జడ్జీలు వచ్చేందుకు అవకాశాలున్నాయని చెప్పింది. టీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారన్న కారణంతో అనర్హత వేటు వేస్తూ మండలి చైర్మన్ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ యాదవరెడ్డి, భూపతిరెడ్డి, రాములునాయక్‌లు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ మే 8కి వాయిదా పడింది. -
ఫిరాయింపు జాడ్యానికి విరుగుడు
చట్టాలు, సంప్రదాయాలు కాగితాలకు పరిమితమైనప్పుడు, ఎవరికి వారు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నప్పుడు విజ్ఞులైనవారు ఆగ్రహించటంలో వింతేమీ లేదు. రాజ్యసభ చైర్మన్‌గా తన ఏడాది కాలం అనుభవాలను క్రోడీకరించి రచించిన పుస్తకావిష్కరణ సభలో ఆదివారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చట్టసభల తీరుతెన్నుల గురించి చాలా అంశాలు ప్రస్తావించారు. చట్టసభలపై ప్రజల్లో నమ్మకం కలిగించేలా సమగ్ర నియమావళి రూపొందించుకోవాలని సూచించారు. ఆయన రాజ్యసభ చైర్మన్ కాకముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేశారు గనుక సభలో సభ్యుల ప్రవర్తన, సభాపతులు వ్యవహరించాల్సిన తీరు వగైరా అంశాలపై ఆయనకు లోతైన అవగాహన ఉంది. అయితే బీజేపీ పాలకపక్షంగా ఉన్న రాష్ట్రాలు మొదలుకొని అనేకచోట్ల చట్టసభల్లో విలువలు చట్టుబండలవుతున్నాయి. అధికారాన్ని నిలుపు కోవడానికి కావొచ్చు... ప్రతిపక్షాన్ని బలహీనపర్చడానికి కావొచ్చు–పాలకపక్షాలు ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నాయి. ఈ దిగజారుడుతనాన్ని మరింత అధోగతికి తీసుకెళ్లినవారిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అగ్రగణ్యుడు. అంతకు కొన్ని నెలల ముందు పొరుగునున్న తెలంగాణ రాష్ట్రంలో తమ టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్‌ను మంత్రిగా తీసుకున్నప్పుడు అది రాజ్యాంగ ఉల్లంఘన అంటూ ఆవేశపడిపోయిన చంద్రబాబే ఆ తర్వాత అదే పనిని మరింత నిస్సిగ్గుగా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఫిరాయించినవారిలో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టారు. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో అమల్లోకొచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టం నిరర్ధకమవుతున్నదన్న అభి ప్రాయం కలిగాక 2003లో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా దానికి సవరణలు తీసుకొచ్చారు. అయితే చంద్రబాబు వంటి ఘనుల పుణ్యమా అని ఆ సవరణ కూడా నిరుపయోగంగా మారింది. ఇదే సభలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ క్రమశిక్షణ గురించి ప్రస్తావించారు. వెంక య్యనాయుడి క్రమశిక్షణను మెచ్చుకుంటూ, దాన్ని పాటించమని కోరేవారిని ఇప్పుడు నియంత అని ముద్రేస్తున్నారని వాపోయారు. మోదీ క్రమశిక్షణ పాటించమని ఎవరిని కోరుతున్నారో తెలియదుగానీ... తమ మిత్రపక్షంగా ఉన్న సమయంలోనే ఫిరాయింపుదార్లకు టీడీపీ మంత్రి పదవులు కట్టబెట్టిన సంగతి ఆయన గుర్తుంచుకోవాలి. కలిసి ఎన్నికల్లో పోటీచేసి గెలిచి కేంద్రం లోనూ, రాష్ట్రంలోనూ అధికారాన్ని పంచుకున్నప్పుడు మిత్రపక్షంగా ఉన్న పార్టీ ఇష్టానుసారం ప్రవర్తిస్తుంటే తమకు సంబంధమేమిటన్నట్టు ప్రవర్తించటం క్రమశిక్షణ ఎలా అవుతుంది? ఎమ్మెల్యేలు మాత్రమే కాదు... వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎంపీలు కూడా పార్టీ ఫిరా యించారు. 2014లో లోక్‌సభ ప్రారంభ సమావేశాల సమయంలోనే వారిలో ఇద్దరు తెలుగుదేశం వైపు మొగ్గుచూపగా, అనంతరకాలంలో మరో ఇద్దరు అదే బాటపట్టారు. నాలుగున్నరేళ్లు గడిచి, సభ గడువు దాదాపు పూర్తికావస్తున్నా అతీగతీ లేదు. ఒక పార్టీ తరఫున ప్రజాప్రతినిధులుగా గెలిచి మరో పార్టీకి ఫిరాయించి మంత్రులు కావడమేమిటని వెంకయ్యనాయుడు వేసిన ప్రశ్న అర్ధవంతమైనది. ఫిరాయింపుదార్లపై అనర్హత వేటు వేసేందుకు స్పీకర్లకు అధికారం ఇచ్చినట్టే... అటువంటివారితో మంత్రులుగా ప్రమాణం చేయించకూడదన్న నియమం గవర్నర్లకు కూడా ఉంటే ఈ దురాచారానికి కాస్తయినా అడ్డుకట్ట పడుతుంది. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌గా ఉన్న నరసింహన్ మొదట తెలంగాణలో తలసానితో మంత్రిగా ప్రమాణం చేయించినప్పుడు ఆయన ఏ పార్టీ తరఫున గెలిచారో తెలుసుకోవాల్సిన అవసరం లేదా అని బాబు గవర్నర్‌ను ప్రశ్నించారు. కనీసం ఆయన అలా అన్నందుకైనా ఆ తర్వాత కాలంలో ఏపీలో ఫిరాయింపుదార్లకు బాబు పదవులు పంచినప్పుడు నరసింహన్ అడిగి ఉండా ల్సింది. కానీ ఆయన అప్పుడు కూడా మౌనమే పాటించారు. ఇలా కీలక పదవుల్లో ఉన్నవారు తమ కనీస బాధ్యతను మరుస్తున్నారు గనుకే నిర్దిష్టమైన చట్ట నిబంధన ఉండటం అత్యవసరం. పార్టీలు మారినవారిపై మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలన్న వెంకయ్యనాయుడు ప్రతిపాదన కూడా హర్షించదగ్గది. అయితే అది నిబంధన రూపంలో ఉంటే తప్ప మన స్పీకర్లు ఎవరూ తమకు తాముగా ముందుకు రారు. ఫిరాయింపుల చట్టంలోని ప్రధాన లోపమిదే. నిబంధన ఉంటే ఫిరా యింపుల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే ఉండేది కాదు. అది లేకపోవటం వల్ల స్పీకర్‌గా ఉంటున్నవారు పాలకపక్షం ప్రయోజనాలను నెరవేరుస్తూ, అందుకు ప్రతిఫలం పొందుతూ కాల క్షేపం చేస్తున్నారు. స్పీకర్ పదవి ఔన్నత్యాన్ని గుర్తించి, ఆ పదవి ద్వారా పరిపూర్తి చేయాల్సిన కర్త వ్యాలపైనా, బాధ్యతలపైనా సంపూర్ణ అవగాహన కలిగినవారు ఆ పదవిలో ఉంటే వేరు. అలాంటివారు కరువు కావటమే ప్రస్తుత సమస్యకు మూలం. ఒక్క ఫిరాయింపుల విషయంలో మాత్రమే కాదు... సభా నిర్వహణలో సైతం స్పీకర్ల వ్యవహార శైలి పాలకపక్షానికి అనుకూలంగా ఉంటున్నది. సభాధ్యక్ష స్థానంలో ఉండేవారే సక్రమంగా లేన ప్పుడు సభ్యుల ప్రవర్తన అందుకు భిన్నంగా ఉండదు. మొత్తంగా చట్టసభలు భ్రష్టుపడుతున్నాయి. ప్రజల్లో వాటిపట్ల విశ్వసనీయత తగ్గడానికి ఇవన్నీ కారణమవుతున్నాయి. రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో సమగ్రమైన ప్రవర్తనా నియమావళి రూపొందించుకుంటే ఈ విశ్వసనీయత పెంచవచ్చునన్నది వెంకయ్యనాయుడి అభిప్రాయం. కానీ పాలక పార్టీలే ఈ స్థితికి కారణమై, దాని వల్ల లబ్ధి పొందుతున్న దశలో ఏకాభిప్రాయం ఎండమావే అవుతుంది. కనుకనే ఫిరాయింపు చట్టానికి సమగ్రమైన సవరణలు అవసరం. నిర్దిష్టమైన నిబంధనలుంటే దాన్నుంచి తప్పించు తిర గటం అసాధ్యమవుతుంది. ఆ దిశగా ప్రయత్నించినప్పుడే చట్టసభలపైనా, ఎన్నికలపైనా, ప్రభు త్వాలపైనా ప్రజల్లో విశ్వాసం ఏర్పడుతుంది. -
సభాపతుల నిష్క్రియపై కొరడా
విశ్లేషణ పదో షెడ్యూలు కింద దాఖలైన అనర్హతా పిటిషన్ పైన విచారణ జరిపి మూడునెలల వ్యవధిలోనే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజ్యసభ అధ్యక్షుడి హోదాలో మూడు నెలల్లో తీర్పు ఇచ్చారు. చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు బతికి ఉంటే ఫిరాయింపులదార్లను నెత్తిన పెట్టుకునే రాజకీయాలపైన వ్యంగ్య కొరడా ఝళిపించేవారు. ఆ కాలంలో ఇలాంటి వ్యంగ్యాస్త్రాలు విసిరితే పాలకులు సిగ్గు పడేవారు. ఇప్పుడు వాతలు తేలితే మలాములు పెట్టుకుంటారు, లేదా ప్టాస్టిక్ సర్జరీ చేయించుకుంటారు. అంతేకాని సిగ్గుపడరు. ఈనాటి పార్టీ ఫిరాయింపుల గురించి చిలకమర్తి ఎన్ని వాతలు పెట్టేవారో! అనర్హత పిటిషన్ల విషయంలో కావాలని జాప్యం చేసి ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఒక జోక్‌గా మార్చేస్తున్నారని విమర్శిస్తూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇద్దరు సభ్యులను రాజ్యసభలో అనర్హులుగా ప్రకటించి సంచలనం సృష్టించారు. రాజ్యాంగాన్నీ, చట్టాలనూ మనవాళ్లు ప్రహసనాల స్థాయికి దిగజారుస్తున్న మాట నిజం. రాజ్యాంగ అధికరణాలంటే కళాశాలల్లో పంతుళ్లు బోధించే పనికిరాని పాఠాలని ఆ నేతల ఉద్దేశం. విలువలు– ఎథిక్స్ అనేవి పదవీ విరమణ చేసి ఖాళీగా ఉన్నవారు చేసే నీతిబోధలు. ప్రవచనకారులకే పరిమితమైన ప్రభోదాలన్నమాట. అటువంటి ప్రహసనాలలో ఒకటిగా రాజ్యాంగ పదవ షెడ్యూలు ఫిరాయింపు నిరోధక చట్టం చేరిపోయింది. ఆంగ్లంలో మాకరీ అంటారు. ఫిరాయించిన వారు రాజ్యాంగ పదోన్నతులు పొందుతూ పదో షెడ్యూల్ అంటే ఫక్కున నవ్వుతున్నారు. ఎందుకంటే అది కోరలు లేని పులి వలె కాదు కదా, కనీసం కాగితం పులిలా కూడా లేదు. రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్ పెట్టాలన్నా మనసు రావడం లేదు. అలాంటి పదో షెడ్యూల్ మాకరీ కారాదని ఉపరాష్ట్రపతి చెప్పారు. వేరే పార్టీ గుర్తు మీద ఎన్నికైన ఎమ్మెల్యేలనూ, ఎంపీలనూ ప్రలోభపెట్టి రారమ్మని ఆహ్వానిస్తూ మంత్రిత్వంతో సహా అనేక పదవులు ఇవ్వడం ఇవాళ్టి రాజకీయాలలో మామూలైపోయింది. 1980లలోనే కాదు, ఆయారాం గయారాంలు 2017లో కూడా రాజ్యాలు ఏలుతున్నారు. గెలిపించిన పార్టీకి రాజీనామా చేయకుండా మరో పార్టీలో చేరి పదవులు తీసుకుంటూ ఉంటే, ఇస్తూ ఉంటే ఈ ధోరణికి ఏం పేరు పెట్టాలో తెలియదు. ‘మీరిప్పుడు ఏ పార్టీలో ఉన్నారు!’అని ఎంపీలనూ, ఎమ్మెల్యేలను అడిగే హీనస్థితి. వీరి గురించి పదేపదే అడగడానికి మీడియా సిగ్గు పడుతూ ఉంటే, ఫిరాయింపు పదవీధరులు మాత్రం నిస్సిగ్గుగా ‘మేం రాజీనామా చేసినామండీ, మాపని మేం చేశాం. ఆమోదించకపోతే మేమేంచేస్తాం. పదవిలో కొనసాగుతాం!’అంటున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు వారిని గెలిపించిన పార్టీ వదిలి అధికార పక్షం ప్రలోభాలకు లొంగిపోతుంటే పార్టీవ్రత్యం మంటగలసి పోయిందనీ, రాజకీయ వ్యభిచారమనీ కొన్ని పార్టీలు పత్రికల వారి దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఆ పార్టీలు కూడా అధికారంలోకి వస్తే ఆ పనే చేస్తున్నాయి. జనం ఏం చేయలేకపోతున్నారు. అలాంటి వారిపై అనర్హత వేటు వేయండి అని బాధిత పార్టీ నాయకులు పెట్టిన పిటిషన్లు విచారించవలసిన అధికారం సభాధ్యక్షులకు (రాష్ట్ర శాసనసభల్లో స్పీకర్లు, విధాన మండలులలో సభాధ్యక్షుడు, లోక్‌సభలో సభాపతి, రాజ్యసభలో భారత ఉపరాష్ట్రపతి లేదా రాజ్యసభ అధ్యక్షుడు) ఉందని భారత సంవిధానంలో ఆర్టికల్స్ 102(2), 191(2) కింద చేర్చిన పదో షెడ్యూలు వివరిస్తున్నది. ఫిరాయించిన చట్టసభ సభ్యులను అనర్హులను చేసి, ఆయారాం గయారాం సంస్కృతికి అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యంతో రాజ్యాంగ సవరణ చేసి ఫిరాయింపుల నిరోధక చట్టంతో ఈ షెడ్యూలును చేర్చారు. అనేక సవరణలు తెచ్చినా అనర్హత వేటు వేసే అధికారాన్ని సభాపతులకే ఇచ్చారు. కనుక చట్టం ఇంకా బతికే ఉంది. వేటు విషయంలో నిర్ణయాధికారం సభాధ్యక్షులు, సభాపతులమీద ఉందని సెక్షన్ 6 వివరిస్తున్నది. అంతేకాదు ఈ విషయమై సభాపతులు చెప్పిన తీర్పే తుది తీర్పని కూడా స్పష్టం చేసింది. సెక్షన్ 7 ప్రకారం అనర్హతల నిర్ణయానికి సంబంధించి న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. సభాపతి లేదా సభాధ్యక్షుడు నిర్ణయం తీసుకున్న తరువాత అది రాజ్యాంగ సమ్మతంగా ఉందో లేదో సమీక్షించే అధికారం హైకోర్టు, సుప్రీంకోర్టులకు రాజ్యాంగమే ఇచ్చింది. కాబట్టి వెంకయ్యనాయుడు ఇచ్చిన తీర్పుపైన న్యాయ సమీక్షాధికారాన్ని వినియోగించాలని బాధిత ఎంపీలు హైకోర్టులను, సుప్రీంకోర్టును కోరవచ్చు. సభాపతులు, సభాధ్యక్షులు రాజకీయ పార్టీలకు చెందిన వారై ఉండి వారి అధినాయకుల ఆదేశాల మేరకు నడుచుకుంటున్నారు కాని రాజ్యాంగాన్ని పట్టించుకోవడం లేదు. నిజానికి సభాపతి ఎన్నికయ్యే వరకు పార్టీకి చెందినవాడే. ఆ తరువాత పార్టీలకు అతీతంగా గౌరవప్రదంగా వ్యవహరించాలని రాజ్యాంగం ఆశిస్తున్నది. గవర్నర్లు, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతికి కూడా ఇదే వర్తిస్తుంది. పార్టీ ఫిరాయించిన ఒక ఎంపీ (లేదా ఎమ్మెల్యే) పైన అనర్హత పిటిషన్ వేస్తే, నాలుగేళ్లదాకా తేల్చకుండా కాలహరణం చేయడం పదో షెడ్యూలు ఊహించని రాజ్యాంగ వ్యతిరేక రాజకీయ వ్యూహం. ఎన్నికలు రావడానికి కొద్దిరోజుల ముందు అనర్హుడంటూ ‘న్యాయ’నిర్ణయం చేస్తారు. ఈ నిష్క్రియాత్వం తగదనీ, రాజ్యాంగ బాధ్యతను సభాపతులు న్యాయమూర్తుల వలె నిర్వహించాలనీ న్యాయస్థానాలు చెప్పాయి. రాజకీయ నాయకులు హోదాలో పార్టీ పక్షపాతంతో వ్యవహరించరాదని సర్వోన్నత న్యాయస్థానం, ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తులు చాలాసార్లు తమ తీర్పుల్లో ఆక్రోశించారు కూడా. నిజానికి ఇలాంటి పిటిషన్ల గురించి సత్వరం వినకపోతే ఫిరాయింపు వ్యతిరేక చట్టం లక్ష్యాలు నీరుగారతాయనీ, ప్రజాస్వామ్యంలో జనం తీర్పు చెల్లకుండా పోతుందనీ చట్టసభల నిర్వాహకులను సుప్రీంకోర్టు అనేకసార్లు హెచ్చరించింది. ఒక్కొక్కసారి పంతుళ్ల పాఠాల వలెనే కొన్ని కోర్టు తీర్పులు కూడా అమలు కాని ఆదేశాల వలెనే మిగిలిపోతాయి. కోర్టు ధిక్కార నేరానికి శిక్ష వేసే అధికారం ఉంది కనుక కొన్ని విషయలాలలో భయపడతారు. ఆదేశాల రూపంలో కాక, నీతిబోధలు, సలహాలు సిఫార్సులు చేస్తే వాటిని పాటించాలన్న ఒత్తిడి ఉండదు. రాజ్యాంగం పదో షెడ్యూలు కింద దాఖలైన అనర్హతా పిటిషన్ పైన విచారణ జరిపి మూడునెలల వ్యవధిలోనే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజ్యసభ అధ్యక్షుడి హోదాలో మూడు నెలల్లో తీర్పు ఇచ్చారు. దీని నుంచి దేశంలోని సభాపతులంతా నేర్చుకోవాలి. శరద్ యాదవ్, అలీ అన్వర్‌లను ఆయన అనర్హులుగా ప్రకటించారు. సెప్టెంబర్ 2న జేడీయూ నేత ఆర్సీపీ సింగ్ పిటిషన్ వేశారు. సింగ్ పిటిషన్‌కు జవాబు ఇవ్వాలని శరద్ యాదవ్‌ను 11న ఉపరాష్ట్రపతి ఆదేశించారు. జవాబు ఇవ్వడానికి ఒక నెల గడువు కావాలని 15, 18 తేదీలలో యాదవ్ కోరారు. వారంరోజుల గడువు (25 వరకు) ఇచ్చారు, 22వ తేదీన యాదవ్ జవాబు అందింది. అక్టోబర్ 7– యాదవ్ జవాబును ఆర్సీపీ సింగ్‌కు పంపారు, 11న యాదవ్ తను హాజరై వివరిస్తానని అడిగారు. 13న సింగ్ జవాబు అందింది. అనర్హుడిగా ప్రకటించాలని ఆయన వాదించారు. 18న యాదవ్ కోరినట్టు అక్టోబర్ 30న వ్యక్తగతంగా హాజరు కావాలని లేఖ రాశారు. 23న గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి కనుక 8 వారాల గడువు కావాలని కోరారు. ఇందుకు నిరాకరిస్తూ నవంబర్ 8న హాజరు కావాలని యాదవ్‌కు ఉపరాష్ట్రపతి 24న లేఖ రాశారు. తనతో పాటు న్యాయవాదులు కపిల్ సిబల్, దేవదత్త కామత్‌లను కూడా అనుమతించాలని నవంబర్ 4న యాదవ్ కోరారు. 7న మరో నలుగురు అడ్వకేట్లు తమ తరఫున వాదించేందుకు అనుమతించాలని మరో పిటిషన్ వేశారు. రెండు పిటిషన్లను ఉపరాష్ట్రపతి తిరస్కరించారు. 8న శరద్ యాదవ్ వ్యక్తిగతంగా హాజరైనారు. డిసెంబర్ 4న శరద్ యాదవ్ అనర్హుడిగా తీర్పు ప్రకటించారు. మరొక ఎంపీని కూడా ఈ విధంగానే అనర్హుడిగా ప్రకటించారు. అధికార పార్టీకీ, ప్రభుత్వానికీ అనుకూలం కనుకనే ఈ నిర్ణయం ఇంత త్వరగా తీసుకున్నారని, మూడేనెలల్లో నిర్ణయించడం తమ దారి తొక్కని పార్టీలను తొక్కేయడానికేనని విమర్శలు చేస్తున్నారు. వారు న్యాయస్థానాల్లో ఆ తీర్పును సవాలు చేయవచ్చు. ఇంకో రెండేళ్లు కాలయాపన చేయడానికి ఫిరాయింపు ఎంపీలు, ఎమ్మెల్యేలు కోర్టులను స్వార్థానికి వాడుకోకుండా చూసుకోకపోతే ప్రయోజనం ఉండదు. ఫిరాయింపు తప్పుకు పాల్పడిన వారు స్పీకర్ తప్పుతో పదవిలో కొనసాగి, కోర్టు ఆలస్యాలతో పదవీకాలాన్ని ముగించుకుంటే రాజ్యాంగంతో పాటు సభాపతి స్థానం, ఉన్నత న్యాయస్థానం కూడా ప్రహసనాలుగా మిగిలిపోతాయి. మూడునాలుగేళ్లపాటు అనర్హత పిటిషన్లపై తేల్చకపోతే క్షమించడానికి వీల్లేదు. ఫిరాయించిన ఆర్నెల్లలో పిటిషన్ రావడం, సభాపతి విచారించడం, కోర్టు సమీక్షించడం అన్నీ ముగిసిపోయే విధంగా మార్పులు చేయాలి. స్వపక్షానికి లాభం చేకూర్చడానికో, పరపక్షానికి హాని చేయడానికో కాకుండా నిష్పాక్షికంగా ఫిరాయింపుల నిరోధచట్టాన్ని అమలు చేసి చిత్తశుధ్దితో న్యాయం చేయగల వాడే రాజ్యాంగ విలువలను కాపాడినవాడవుతాడు. ఫిరాయింపుల విషయంలో రాజ్యాంగాన్ని అమలుచేయని ప్రతి నాయకుడు రాజ్యాంగ పీఠాన్ని అధివసించినందుకు సంతోషించినా, సంవిధానం ప్రకారం వ్యవహరిస్తానని చేసిన ప్రతిజ్ఞను కాలరాసినట్టే. వందరూపాయల మోసం చేస్తే జైల్లో వేస్తారు. రాజ్యాంగాన్నీ, న్యాయాన్నీ సభాపతి స్థానం ద్వారా, కోర్టుల ద్వారా మోసం చేస్తే ఆ నేరాలకు చర్యలు ఉండవా? వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ professorsridhar@gmail.com -
‘స్పీకర్‌ది తప్పు.. సీఎంను మార్చాలన్నారంతే..’
-
‘స్పీకర్‌ది తప్పు.. సీఎంను మార్చాలన్నారంతే..’
మద్రాస్ : పద్దెనిమిదిమంది ఎమ్మెల్యేలపై తమిళనాడు స్పీకర్ అనర్హత వేటు వేయడం సహజ న్యాయానికి విరుద్ధం అని అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్ తరుపు న్యాయవాది దుష్యంత్ దవే బుధవారం మద్రాస్ హైకోర్టుకు విన్నవించారు. ఎమ్మెల్యేలు పార్టీకి విరుద్ధంగా ఏమీ చేయలేదని, వారు కేవలం నాయకత్వ మార్పును మాత్రమే కోరుకున్నారని, అవినీతిపరుడైన పళనీస్వామిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని అడిగారని, ఇది పార్టీ ఫిరాయింపుల చట్టం పరిధిలోకి రాదని చెప్పారు. దినకరన్ వైపు ఉండిపోయిన అన్నాడీఎంకేకు చెందిన 18మంది ఎమ్మెల్యేలపై తమిళనాడు స్పీకర్ వేలు వేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తొలుత దినకరన్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. కోర్టుకు ఆయన ఏం చెప్పారంటే.. ‘18మంది ఎమ్మెల్యేలపై వేలు వేస్తు తమిళనాడు స్పీకర్ నిర్ణయం తీసుకోవడం సహజ న్యాయానికి విరుద్థం. పార్టీకి విరుద్ధంగా ఎమ్మెల్యేలు ఏం చేయలేదు. వాళ్లు నాయకుడిని మాత్రమే మార్చాలని కోరారు. వారు వేరే పార్టీలోకి వెళ్లలేదు.. దీని ప్రకారం వారి చర్య పార్టీ ఫిరాయింపు పరిధిలోకి రాదు. గవర్నర్‌కు వారు ఇచ్చిన లేఖలో కూడా ముఖ్యమంత్రిని మార్చాలనే అడిగారు. ఆ పద్దెనిమంది ఎమ్మెల్యేలకు కనీసం సమయం కూడా ఇవ్వలేదు. మూడు వారాల్లో త్వరత్వరగా మొత్తం కానిచ్చేశారు. ఎమ్మెల్యేలపై వేటు వేశారు’ అని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం స్పీకర్ తరుపు న్యాయవాది వాదనలు చేస్తూ స్పీకర్ నిర్ణయం సరైనదే అన్నారు. చట్టప్రకారమే ఆయన వ్యవహరించారని తెలిపారు. -
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి
రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ ఫిరాయింపుల చట్టాన్ని సవరించాలి మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి లాంటి ప్రత్యేక హోదాను మంజూరు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఉభయ సభల నుద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో సోమవారం జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర విభజన సమ యం లో ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా, ఇతర హామీల ప్రస్తావన రాష్ట్రçపతి ప్రసంగంలో లేనందువల్ల తాను ధన్యవాద తీర్మానానికి కొన్ని సవరణలను ప్రతిపాదించానని చెప్పారు. 2014 ఫిబ్రవరిలో రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పన్నుల్లో వాటానే ప్యాకేజీగా... ప్రత్యేక హోదా సిఫార్సు చేయలేదని, భవిష్యత్తులో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేయవద్దని 14 వ ఆర్థిక సంఘం నివేదికలో ఎక్కడ ఉందని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. పైగా ఆర్థిక సంఘం నివేదిక కేవలం సిఫార్సు మాత్రమేనని, తప్పనిసరి కాదని గుర్తు చేశారు. కేంద్ర కేబినెట్ నిర్ణయం అమలు కాకపోతే చట్టపరమైన సహాయం ఏమిటని నిలదీశారు. ప్రత్యేక ప్యాకేజిని రాష్ట్రంలో ఎవరు కోరారని ప్రశ్నించారు. రానున్న ఐదేళ్లలో కేంద్ర పన్నులలో రాష్ట్రానికి వచ్చే వాటాను ప్యాకేజిగా చెబుతున్నారని తెలిపారు. ఫిరాయింపుల చట్టంలో ఉన్న లొసుగులను అధికారంలో ఉన్న పార్టీలు అదునుగా తీసుకుంటున్నాయని చెప్పారు. అనర్హత పిటీషన్లపై నియమిత కాలవ్యవధిలో స్పీకర్లు నిర్ణయం తీసుకునే విధంగా ఫిరాయింపుల చట్టాన్ని సవరించాలని సూచించారు. మహిళల సాధికారత కోసం చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి, అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఫిరాయింపు రాజకీయాలు అనైతికం
మనసులో మాట కొమ్మినేని శ్రీనివాసరావుతో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సామాన్యులలో సామాన్యుడిగా పుట్టి ఎదిగివచ్చినందుకే జనంలో తిరగడం, జనంతో ఉండటం తనకెంతో ఇష్టమంటున్నారు కేంద్ర కార్మికమంత్రి బండారు దత్తాత్రేయ. ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్‌లోని నిరుపేద ప్రాంతం గౌలిగూడలో రెండు గదుల ఇంటిలోనే చాలా కాలం గడిపిన దత్తాత్రేయ తన తల్లిదం డ్రుల సంస్కారం, ఆర్ఎస్ఎస్ సంఘ జీవితం తనను ఇంత స్థాయికి తీసుకొచ్చిం దని అంటున్నారు. ఫిరాయింపులు అనైతికం అనీ బీజేపీ వాటిని సమర్థించదని చెప్పారు. రాజకీయ లబ్ధికోసం చేసిన సందర్భాల్లో కూడా అది అనైతికమే అంటున్న బండారు దత్తాత్రేయ మనసులో మాటలో చెప్పిన అభిప్రాయాలు.. వారి మాటల్లోనే మీ బాల్యం, కుటుంబ నేపథ్యం ఏమిటి? పేదకుటుంబంలో జన్మించాను. తల్లితండ్రులు ఈశ్వరమ్మ, అంజయ్య. హైదరా బాద్‌లో గౌలిగూడ అనే పేదల బస్తీలో పెరిగాను. నాన్న చిన్నప్పుడే చనిపోవడం. ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో మా అమ్మ ఉస్మాన్ గంజ్ అనే ప్రాంతానికి వెళ్లి రోడ్డు మీద ఉల్లిపాయలు అమ్ముకుని బతికి మమ్మల్ని సాకింది. నేను ఎదగడానికి ప్రధాన కారణం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం. ఎంపీ అయిన తర్వాత కూడా గౌలిగూడలోనే ఉన్నారు కదా? కేంద్ర మంత్రి అయిన తర్వాత కూడా నేను గౌలిగూడలోనే ఉన్నాను. నేనూ, నా భార్యా, పిల్లలూ ఒకే గదిలో నివసించేవాళ్లం. అమ్మ ఒక గదిలో ఉండేది. నాకు బాగా గుర్తు. ముఖ్యమంత్రి విజయభాస్కర రెడ్డి ఒకసారి కష్టం మీద మా ఇంటికి వచ్చి చూశారు. ‘ఎంిపీగా ఉండి కూడా ఇంత చిన్న ఇంట్లో ఉన్నావు. చాలా సంతోషం. మీ అమ్మ మీకు ఆదర్శం’ అన్నారు. ఆర్ఎస్ఎస్తో ఎలా పరిచయమైంది? పదో తరగతి చదువుతున్నప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖ సమావేశానికి రమ్మని మనోజ్ అనే డాక్టర్ ఆహ్వానించారు. అమ్మ ఒత్తిడి వల్ల ఒకసారి వెళ్లాను. అదే నా జీవితంలో మలుపు. 1968లో డిగ్రీపూర్తి చేశాను. సంఘం లోకి వెళ్లిన తర్వాతే దేశభక్తికి సంబంధించిన అనేక భావాలు ఏర్పడుతూ వచ్చాయి. ప్రచారక్‌గా వెళతానని చెబితే అమ్మ ఒప్పుకుంది. నిజామాబాద్‌లో ప్రచారక్‌గా తొలి బాధ్యత. 1975 వరకు ఇలా పనిచేశాను. రాజకీయాల్లోకి ఎలా ప్రవేశించారు? రాజకీయాల్లోకి వస్తానని ఊహించ లేదు. కానీ ఎమర్జెన్సీ కాలంలో బెల్లం పల్లిలో అరెస్టై ఒకటిన్నరేళ్లు జైల్లో ఉన్నాను. వరవరరావు, చెరబండరాజు, ఎంటీ ఖాన్, మరొకవైపు సోషలిస్టు నాయకులు నాయని నరసింహారెడ్డి, శ్రీధర్ సింగ్ లష్కర్, గౌతు లచ్చన్న, వి. రామారావు, గౌతు లచ్చన్న వంటి వారితో అక్కడ పరిచయమైంది. అక్కడే చదువుకోవడం మొదలెట్టాను. కాస్త ఆలోచన పెరిగింది. 1977లో జైలు నుంచి విడుదలైన తర్వాత దివిసీమలో ఉప్పెన వచ్చింది. ఆర్ఎస్ఎస్ తుపాను బాధితుల కమిటీలో జాయింట్ సెక్రటరీగా పనిచేశాను. అక్కడ సేవాభావంతో పొందిన గుర్తింపే చివరకు రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. టీడీపీతో పొత్తు లేదని మీ నేతలే అంటున్నారు? పొత్తు అనేది ఎన్నికలకు సంబంధించింది. ఎన్నికలు లేవు కాబట్టి పొత్తుల అవ సరం ఇప్పుడు లేదు. అలాగని భవిష్యత్తును ఎవరూ చెప్పలేరు. రాజకీయాల్లో ఇవ్వాళ మిత్రులుగా ఉన్నవారు రేపు ప్రత్యర్థి కావచ్చు. ఇవ్వాల్టి ప్రత్యర్థి రేపు మిత్రుడు కావచ్చు. ఓటుకు కోట్లు కేసు వంటి అంశాలపై మీరు ఎందుకు మాట్లాడటం లేదు? ఇది రాజ్యాంగపరమైన విషయం. దీంట్లో చట్టం, నైతికత అనే రెండు విషయా లున్నారుు. నైతికత, చట్టం విషయంలో ఎవరు తప్పు చేసినా తప్పే. చంద్రబాబు తప్పు చేసినట్లా చేయనట్లా? బాబు, కేసీఆర్ రాజీపడ్డారా? చట్టం తన పని చేస్తోంది కదా ఇప్పుడు.. వారిమధ్య రాజీ మేం కుదర్చలేదు. కేసీఆర్ షరతు పెట్టడం వల్లే బాబు విజయవాడ వెళ్లిపోయారనడంలో వాస్తవం లేదు. బాబు, కేసీఆర్ ఓటుకు కోట్లు, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లోంచి బయటపడ్డట్లేనా? అది రాజకీయ వ్యవహారం. వారి పద్ధతిలో వారు వెళుతున్నారు. ఫిరాయింపులపై మీ అభిప్రాయం? ఒక్కమాటలో చెప్పాలంటే ఫిరాయింపులు అనైతికం. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీకైనా, వ్యవస్థకైనా ఫిరాయింపులు మంచివి కాదు. రాజకీయ లబ్ధికోసం చేయ వచ్చునేమో కానీ ఇది తప్పకుండా అనైతికం. మరి మీ అభిప్రాయం కేసీఆర్‌కి, చంద్రబాబుకు చెప్పారా? వాళ్ల వాళ్ల పద్ధతిలో వాళ్లు రాజకీయం చేస్తున్నారు. నా సలహా కోరలేదు. మీరు కాని వెంకయ్య కాని ఫిరాయింపులు తప్పని వారికి చెప్పలేదా? వ్యక్తులకు చెప్పడం అని కాదు కానీ... జాతీయ స్థారుులోనే ఫిరాయింపులకు వ్యతిరేకంగా మేం వ్యవహరించాం. వెంకయ్యనాయుడు ఫిరాయింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కి, చంద్రబాబుకు మీరిచ్చే సలహా ఏమిటి? రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మధ్య పరస్పర సహకారం ఎంత ఎక్కువగా ఉంటే అభివృద్ధి అంత ఎక్కువగా జరుగుతుంది. కేంద్రమంత్రిగా మీరు సాధించిన విజయాలు ఏవి? దేశంలోని కార్మికులందరికీ కనీస వేతనం గతంలో రోజుకు రూ. 160 ఉంటే ఇప్పుడు రూ.350లు పెంచడం కార్మికమంత్రిగా నాకెంతో సంతోషం కలిగిం చింది. అలాగే మహిళా కార్మికులందరికీ మెటర్నిటీ లబ్ధిని 12 వారాలనుంచి 26 వారాలకు పెంచాను. ఇక బోనస్ రూ. 3,500 ఉంటే దాన్ని రూ. 7 వేలకు పెంచాను. బీమా కవరేజ్ పది వేలు ఉంటే రూ. 21 వేలకు పెంచాను. ఈఎస్ఐ రూ.15 వేలకు ఉంటే దాన్ని 21 వేలకు చేశాను. ఉమ్మడి రాష్ట్ర సీఎంలపై మీ అభిప్రాయం? పాత ముఖ్యమంత్రులలో వెంగళరా వును చూశాను. మాట తక్కువ పని ఎక్కువ. వెంగళరావు, చెన్నారెడ్డి, విజయ భాస్కరరెడ్డి, ఎన్టీఆర్ వీరందరిలో విశేషం ఏమంటే, పాలనలో చాలా దృఢంగా ఉండేవారు. ఎన్టీఆర్ ప్రజాకర్షణలో సాటిలేని వ్యక్తి. కాంగ్రెస్ తప్పులను ఏమాత్రం క్షమించే వాడు కాదు. తర్వాతి వారిపై కూడా ఆయన ముద్రవేసి వెళ్లాడు. విజయ భాస్కరరెడ్డి నీతి నిజాయితీగల నాయకుడు. చాలా గౌరవించే నాయకుడాయన. వైఎస్ రాజశేఖరరెడ్డి పనితీరుపై మీ అభిప్రాయం? ప్రజలతో మమేకమై పనిచేశారు. ఆరోగ్యశ్రీ, పిల్లలకు స్కాలర్ షిప్‌లు ఇలాంటి అంశాల్లో మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్లారు. ప్రజలపట్ల గౌరవం అపారం. కేసీఆర్, చంద్రబాబు ప్రభుత్వాలపై ప్రజా వ్యతిరేకత ఏమేరకు ఉంది? దీనిపై మరికొన్నాళ్లు వేచి చూడాలి. ఇద్దరూ వేగంగా సాగుతున్నారు కాబట్టి ప్రజలు అంత వేగంగా వారిని అర్థం చేసుకుంటారా అన్నది చూడాలి. తెలుగు ప్రజలకు మీరిచ్చే సందేశం? ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు కష్టపడి పనిచేసేవారు. రెండు ప్రాంతాల ప్రజలు పరస్పరం గౌరవించుకుని ఆత్మీయంగా మెలిగే పరిస్థితులు ఉండాలి. విద్వే షాలకు ఎక్కడా తావుండకూడదు. అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. భవి ష్యత్తులో విద్యా, వైద్యం, ఉపాధి ఈ మూడింటికి తెలుగు రాష్ట్రాలు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి. ఇంటర్వ్యూ పూర్తి పాఠాన్ని కింది లింకులో చూడండి https://www.youtube.com/watch?v=_VHA3x2nw-0 -
'నేను మంత్రి పదవి ఆశించడం లేదు'
హైదరాబాద్ : తాను మంత్రి పదవి ఆశించడం లేదని ఇటీవలే టీఆర్ఎస్ పార్టీలో చేరిన నేత డీ శ్రీనివాస్ అన్నారు. నగరంలోని మీడియాతో ఆయన గురువారం మాట్లాడారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం బాధాకర అంశమని ఆయన అన్నారు. మొదటి నుంచి నేను ఫిరాయింపులకు వ్యతిరేకమేనని డీఎస్ చెప్పారు. యాంటీ డిఫెక్షన్ చట్టమున్నా వ్యవస్థలో చాలా లోపాలున్నాయని, అందుకే వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నా సేవలను ఏ రకంగా ఉపయోగించుకున్నా తనకు ఓకేనని ఆయన అన్నారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడు సమైక్యవాదినే, కానీ ఈ తర్వాతే తాను వేర్పాటువాదిగా మారినట్లు ఈ సందర్భంగా డీఎస్ వివరించారు. -
పార్టీ మారితే అనర్హత వేటు: సంపత్
న్యూఢిల్లీ: రాజకీయపార్టీ గుర్తింపుతో సంబంధం లేకుండా అనర్హత వేటు వర్తిస్తుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సంపత్ స్పష్టం చేశారు. ఒక రాజకీయ పార్టీ గుర్తుతో గెలిచి పార్టీ మారితే అనర్హత వేటు వర్తిస్తుందన్నారు. రాజకీయ పార్టీకి గుర్తింపు ఉందా, లేదా అనే అంశంతో సంబంధంలేకుండా అనర్హత వేటు పడుతుందని ఆయన అన్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఒక గుర్తుపై గెలిచి మరొక పార్టీలోకి వెళ్తే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వర్తిస్తుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సంపత్ తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి టీడీపీలో చేరిన నేపథ్యంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సంపత్ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.