సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ డీ. శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో, కుటుంబ సభ్యులు.. శ్రీనివాస్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
అయితే, సోమవారం ఉదయం శ్రీనివాస్‌కు ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో వైద్యులు శ్రీనివాస్‌కు చికిత్స అందిస్తున్నారు. కాగా, వైద్య పరీక్షల అనంతరం డీఎస్ ఆరోగ్యపరిస్థితిని వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. తన తండ్రి శ్రీనివాస్‌కు అనారోగ్యం నేపథ్యంలో బీజేపీ ఎంపీ అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల పాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేనని కార్యకర్తలకు మెసేజ్‌లో తెలిపారు.
మా నాన్న డి. శ్రీనివాస్ గారు తీవ్ర అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
కాబట్టి ఈ రోజు, రేపు (27,28) రెండు రోజుల పాటు నా కార్యక్రమాలన్ని రద్దు చేసుకుంటున్నాను. pic.twitter.com/Z043QOGu9f— Arvind Dharmapuri (@Arvindharmapuri) February 27, 2023
Comments
Please login to add a commentAdd a comment