కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తప్ప మరో నాయకత్వం లేదని సీనియర్ నేత డీ శ్రీనివాస్ అన్నారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తప్ప మరో నాయకత్వం లేదని సీనియర్ నేత డీ శ్రీనివాస్ అన్నారు. గాంధీభవన్లో బుధవారం జరిగిన తెలంగాణ యూత్ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో డీఎస్తో పాటు పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సోనియా తర్వాత కాంగ్రెస్ భావి నేత రాహుల్ గాంధీయేనని డీఎస్ అన్నారు. పొన్నాల మాట్లాడుతూ.. తెలంగాణ కోసం అమరులైన కుటుంబాలన్నింటినీ ఆదుకోనందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్పై ప్రజలకు భ్రమలు తొలగిపోతున్నాయని, అందువల్లే ప్రభుత్వ తీరుకు నిరసనలు తెలుపుతున్నారని చెప్పారు.