డీఎస్ మాకు చేసిందేమీ లేదు: లలిత
నిజామాబాద్: పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తమకు చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆకుల లలిత అన్నారు. తనకు ఎమ్మెల్సీ టికెట్ పీసీసీ అధ్యక్షుడు ఇప్పించారని తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... బలహీన వర్గాలకు న్యాయం చేశామంటున్న డీఎస్ ఇప్పటివరకు ఎంతమందిని పైకి తీసుకొచ్చారని ప్రశ్నించారు.
తనకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేసినా, ఆయన శిష్యురాలిని కాబట్టి ఊరుకున్నానని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర కారణంగానే ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు.