
'ఈనెల 8న టీఆర్ఎస్ లో చేరుతున్నా'
నిజామాద్:ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడిన మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ త్వరలో టీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన టీఆర్ఎస్ లో చేరబోతున్న విషయాన్ని శనివారం సాయంత్రం వెల్లడించారు. ఈ నెల 8 వ తేదీన తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు. పదవులు ఆశించి టీఆర్ఎస్ లోకి వెళ్లడం లేదని పేర్కొన్నారు. తాను సీఎం పదవి మినహా అన్ని పదవులు పొందానన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అయితే కార్యకర్తలను తనతో రావాలని బలవంతం చేయడం లేదని డీఎస్ తెలిపారు. తెలంగాణ ఇచ్చింది ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అయితే.. రాష్ట్ర సాధనకు నాయకత్వం వహించింది కేసీఆరేనని మరోసారి పేర్కొన్నారు.