
'కాంగ్రెస్ పార్టీ నాకేం ఇచ్చింది'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా డీ శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ను పొగడ్తల్లో ముంచెత్తారు.
కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న నాయకుడని డీఎస్ అన్నారు. బంగారు తెలంగాణ సాధించేవరకూ కేసీఆర్ రిటైర్కారని చెప్పారు. తన ప్రతిభను గుర్తించే కేసీఆర్ బాధ్యతలు అప్పగించారని తెలిపారు. బంగారు తెలంగాణ బ్యాచ్ (బీటీ) కొత్తది కాదని, ముందు నుంచీ ఉందని డీఎస్ పేర్కొన్నారు. టీఆర్ఎస్లోకి వెళ్లినందుకు తనపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని, రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తనకేం ఇచ్చిందని డీఎస్ ప్రశ్నించారు. అంతర్రాష్ట్రాల మధ్య ఉన్న నదీజలాల వివాదాల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.