హైదరాబాద్ : ప్రజా సమస్యలపై తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ డీ.శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. శాసనమండలిలో బుధవారం డిప్యూటీ సీఎం రాజయ్య బడ్జెట్ ప్రసంగం చదువుతున్న సందర్భంగా డీఎస్ జోక్యం చేసుకున్నారు. ప్రభుత్వ తీరుపై ఆయన ఈ సందర్భంగా విమర్శనాస్త్రాలు సంధించారు.
రైతులు, విద్యార్థులు సహా వివిధ వర్గాలు పలు సమస్యలతో సతమతం అవుతున్నా... వాటిపై ప్రభుత్వం కనీసం ఓ ప్రకటన కూడా చేయకపోవటం శోచనీయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తుందే కానీ...ప్రతిపక్షాలను సంప్రదించాలన్న కనీస గౌరవాన్ని కూడా పాటించటం లేదని డీఎస్ మండిపడ్డారు.
సర్కార్ తీరుపై డీఎస్ విమర్శనాస్త్రాలు
Published Wed, Nov 5 2014 12:33 PM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM
Advertisement
Advertisement