తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతు ఆత్మహత్యలు, ఎండిపోయిన పంటల ప్రస్తావన లేకపోవటాన్ని నిరసిస్తున్నట్లు...
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతు ఆత్మహత్యలు, ఎండిపోయిన పంటల ప్రస్తావన లేకపోవటాన్ని నిరసిస్తున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలిపారు. పార్టీ ఫిరాయింపులకు నిరసనగానే సభ నుంచి వాకౌట్ చేసినట్లు వారు తెలిపారు. కాగా అంతకు ముందు ఈటెల బడ్జెట్ ప్రసంగం పూర్తి కాకుండానే ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వెళ్లిపోయారు.