టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా రేవంత్, పొన్నం | AICC Appoints 9 Congress Committees in TPCC For Early Elections in Telagana | Sakshi
Sakshi News home page

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా రేవంత్, పొన్నం

Published Thu, Sep 20 2018 4:22 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

AICC Appoints 9 Congress Committees in TPCC For Early Elections in Telagana - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టీపీసీసీ నూతన వర్కింగ్‌ ప్రెసిడెం ట్లుగా రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లను కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నియమించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 10 కమిటీలను ఏర్పా టు చేస్తూ నియామక ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఇప్పటివరకు ఉన్న మల్లు భట్టి విక్రమార్కతో పాటు తాజాగా పొన్నం ప్రభాకర్‌ను, రేవంత్‌రెడ్డిని వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా నియమించారు. ప్రచా ర కమిటీ చైర్మన్‌గా భట్టి విక్రమార్కను, కో–చైర్‌పర్సన్‌గా డీకే అరుణను నియమించారు.

మేనిఫెస్టో కమిటీకి చైర్మన్‌గా దామోదర రాజనర్సింహను, కో– చైర్మన్‌గా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నియమించారు. స్ట్రాటజీ అండ్‌ ప్లానింగ్‌ కమిటీ చైర్మన్‌గా వి.హనుమంతరావు, క్రమశిక్షణ చర్యల కమిటీ చైర్మన్‌గా ఎం.కోదండరెడ్డి, ఎల్డీఎమ్మార్సీ కమిటీ చైర్మన్‌గా ఆరేపల్లి మోహన్, ఎన్నికల సంఘం కో–ఆర్డినేషన్‌ కమిటీ చైర్మన్‌గా మర్రి శశిధర్‌రెడ్డి, పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియమితులయ్యా రు. సినీనటి విజయశాంతి స్టార్‌ క్యాంపెయినర్‌గా, ఎన్నికల కమిటీకి సలహాదారుగా వ్యవహరిస్తారు. ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డిని పలు కమిటీల్లో సభ్యుడిగా నియమిస్తూ ప్రకట నలు వెలువడినా ఆ తర్వాత కొన్ని ప్రకటనల్లో ఆయ న పేరును తొలగిస్తూ ప్రకటనలు జారీచేశారు.

కోర్‌ కమిటీలో 15 మంది
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా, పార్టీ వ్యవహారాల పర్యవేక్షక ఏఐసీసీ కార్యదర్శులు ఎన్‌.ఎస్‌.బోస్‌రాజు, శ్రీనివాసన్‌ కృష్ణన్, సలీం అహ్మ ద్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క, సీఎల్పీ నేతలు జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, పీసీసీ మాజీ అధ్యక్షులు వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శులు మధుయాష్కీగౌడ్, జి.చిన్నారెడ్డి, ఎ.సంపత్‌కుమార్, సీహెచ్‌.వంశీచంద్‌రెడ్డి సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు నూతన వర్కింగ్‌ ప్రెసిడెంట్లు సభ్యులుగా ఉంటారని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.

ఎలక్షన్‌ కమిటీ ఇలా..
ఈ కమిటీలో ఉత్తమ్, భట్టి, జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, జి.చిన్నారెడ్డి, మధుయాష్కీ, ఎస్‌.ఎ.సంపత్‌కుమార్, సీహెచ్‌ వంశీచంద్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఎస్‌.జైపాల్‌రెడ్డి, రేణుకాచౌదరి, పి.బలరాంనాయక్, సర్వే సత్యనారాయణ, మర్రి శశిధర్‌రెడ్డి, నంది ఎల్లయ్య, ఎంఏ ఖాన్, గీతారెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, డీకే అరుణ, జీవన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్‌ యాదవ్, రవీందర్‌నాయక్, ఆర్‌.దామోదర్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, సంభాని చంద్రశేఖర్, పి.సుదర్శన్‌రెడ్డి, డి.సుధీర్‌రెడ్డి, సీతక్క, టి.నాగయ్య, అబీద్‌ రసూల్‌ ఖాన్, జెట్టి కుసుమ్‌కుమార్, బి.మహేశ్‌కుమార్‌గౌడ్, ఎ.మహేశ్వర్‌రెడ్డి, కె.మృత్యుంజయం, పి.వినయ్‌కుమార్‌ సభ్యులుగా ఉన్నారు. అనుబంధ సంఘాల అధ్యక్షులు 11 మంది కూడా సభ్యులుగా వ్యవహరిస్తారు.

ప్రచార కమిటీ చైర్మన్‌గా భట్టి విక్రమార్క
ప్రచార కమిటీని 17 మంది సభ్యులతో ఏర్పాటు చేశారు. దీనికి మల్లు భట్టి విక్రమార్క చైర్మన్‌గా, డీకే అరుణ కో–చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. దాసోజు శ్రవణ్‌కుమార్‌ కన్వీనర్‌గా ఉంటారు. సభ్యులుగా టి.జగ్గారెడ్డి, అనిల్‌ యాదవ్‌ (యువజన కాంగ్రెస్‌), వెంకటేశ్‌ (ఎన్‌ఎస్‌యూఐ), ఎన్‌.శారద (మహిళా కాంగ్రెస్‌), అబ్దుల్లా సొహైల్, బిల్యా నాయక్, కృష్ణారెడ్డి, కిరణ్‌రెడ్డి, మానవతా రాయ్‌ (ఓయూ), విజ య్‌కుమార్‌ (ఓయూ), కార్తీక్‌రెడ్డి, ప్రేమ్‌లాల్, కుమార్‌రావు, హెచ్‌.వేణుగోపాల్‌ సభ్యులుగా ఉన్నారు.

మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా దామోదర్‌
ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను, కో–చైర్మ న్‌గా మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, కన్వీనర్‌గా బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌ను నియమించా రు. ఈ కమిటీలో 35 మంది సభ్యులను నియమిం చారు. పొన్నాల లక్ష్మయ్య, టి.జీవన్‌రెడ్డి, ఎన్‌.పద్మావతిరెడ్డి, దొంతి మాధవరెడ్డి, సురేశ్‌కుమార్‌ షెట్కర్, టి.జగ్గారెడ్డి, కె.లక్ష్మారెడ్డి, అబీద్‌ రసూల్‌ ఖాన్, టి.నాగయ్య, ఎం.రంగారెడ్డి, పి.వినయ్‌కుమార్, అజ్మతు ల్లా హుస్సేని, వినోద్‌కుమార్, ఎం.జైపాల్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, గీట్ల సవితారెడ్డి, మహ్మద్‌ సిరాజుద్దీన్, కె.ప్రేమ్‌సాగర్‌రావు, ఎ.మహేశ్వర్‌రెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, తాహెర్‌ బిన్‌ హమ్దాన్, హెచ్‌.వేణుగోపాల్‌రావు, అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, మానవతారాయ్, విజయ్‌కుమా ర్, కోమటి రాజేశ్వర్‌రావు, సీహెచ్‌ కిరణ్‌రెడ్డి, ఎ.జాన య్య, ఎ.రెడ్డి (వేమన వర్సిటీ మాజీ వైస్‌చాన్స్‌లర్‌) సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు కుంతియా, ఉత్తమ్, పర్యవేక్షక బాధ్యతలు చూస్తున్న ఏఐసీసీ కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. అలాగే పబ్లిసిటీ కమిటీని నలుగురు సభ్యులతో నియమించారు. దీనికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చైర్మన్‌గా, ఎస్‌.గంగారాం కో–చైర్మన్‌గా వ్యవహరిస్తారు. దాసోజు శ్రవణ్, కూన శ్రీశైలంగౌడ్‌ సభ్యులుగా వ్యవహరిస్తారు.

స్ట్రాటజీ అండ్‌ ప్లానింగ్‌ కమిటీ..
కమిటీ చైర్మన్‌గా వి.హనుమంతరావు, కో–చైర్మన్లుగా సర్వే సత్యనారాయణ, మధుయాష్కీగౌడ్, శ్రీధర్‌బాబు, కన్వీనర్‌గా పొంగులేటి సుధాకర్‌రెడ్డి వ్యవహరిస్తారు. సభ్యులుగా ఎస్‌.జైపాల్‌రెడ్డి, టి.జీవ న్‌రెడ్డి, జి.చిన్నారెడ్డి, ఎంఏ ఖాన్, రాపోలు ఆనంద్‌ భాస్కర్, రేణుకాచౌదరి, టి.సంతోష్‌కుమార్, క్యామా మల్లేశ్, మల్లు రవి, గడ్డం ప్రసాద్‌కుమార్, నాగం జనార్దన్‌రెడ్డి, కె.దయాసాగర్‌రావు, సీహెచ్‌ విజయ రమణారావు, ప్రేమ్‌లాల్, నగేశ్‌ ముదిరాజ్‌ సభ్యులుగా నియమితులయ్యారు.

ముగ్గురితో ఎల్డీఎమ్మార్సీ కమిటీ..
ముగ్గురు సభ్యులతో కూడిన లీడర్‌షిప్‌ డెవలప్‌మెం ట్‌ మిషన్‌ ఇన్‌ రిజర్వ్‌ కాన్‌స్టిట్యుయెన్సీస్‌(ఎల్డీఎమ్మార్సీ) కమిటీకి చైర్మన్‌గా ఆరెపల్లి మోహన్, కో–చైర్‌పర్సన్‌గా డి.రవీందర్‌నాయక్, కన్వీనర్‌గా హెచ్‌.వేణుగోపాలరావు నియమితులయ్యారు.

ఎలక్షన్‌ కమిషన్‌ కోఆర్డినేషన్‌ కమిటీ..
ఈ కమిటీ చైర్మన్‌గా మర్రి శశిధర్‌రెడ్డి, కో–చైర్మన్‌గా బి.కమలాకర్‌రావు, కన్వీనర్‌గా జి.నిరంజన్, సభ్యులుగా ఎ.శ్యాంమోహన్, అబీద్‌ రసూల్‌ ఖాన్, ఎం.ఆర్‌.జి.వినోద్‌రెడ్డి, ప్రేమలత అగర్వాల్, టి.నరేందర్‌రావు, టి.రాజేశ్వర్‌రావు వ్యవహరిస్తారు. ఇక క్రమశిక్షణ చర్యల కమిటీ చైర్మన్‌గా ఎం.కోదండరెడ్డి, కో–చైర్‌పర్సన్‌గా ఎ.శ్యాంమోహన్, కన్వీనర్‌గా బి.కమలాకర్‌రావు నియమితులయ్యారు. సభ్యులుగా నంది ఎల్లయ్య, సంబాని చంద్రశేఖర్, బి.బలరాం నాయక్, సీజే శ్రీనివాస్‌రావు నియమితులయ్యారు.

53 మంది సభ్యులతో కోఆర్డినేషన్‌ కమిటీ
ఈ కమిటీ చైర్మన్‌గా ఆర్‌సీ కుంతియా, కన్వీనర్‌గా ఉత్తమ్‌ వ్యవహరిస్తారు. సభ్యులుగా ఎన్‌.ఎస్‌.బోస్‌రాజు, శ్రీనివాసన్‌ కృష్ణన్, సలీం అహ్మద్, భట్టి విక్రమార్క, కె.జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, మధుయాష్కీగౌడ్, జి.చిన్నారెడ్డి, ఎ.సంపత్‌కుమార్, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ఎ.రేవంత్‌రెడ్డి, జె.గీతారెడ్డి, నంది ఎల్లయ్య, ఎంఏ ఖాన్, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టి.జీవన్‌రెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి, పి.సుధాకర్‌రెడ్డి, ఆకుల లలిత, పి.బలరాంనాయక్, ఎస్‌.జైపాల్‌రెడ్డి, రేణుకా చౌదరి, సర్వే సత్యనారాయణ, మర్రి శశిధర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఆర్‌.దామోదర్‌రెడ్డి, పి.సుదర్శన్‌రెడ్డి, సంభాని చంద్రశేఖర్, రవీందర్‌ నాయక్, డి.శ్రీధర్‌బాబు, ఎం.అంజన్‌కుమార్‌ యాదవ్, రాపోలు ఆనంద్‌భాస్కర్, మల్లు రవి, గండ్ర వెంకట రమణారెడ్డి, టి.జగ్గారెడ్డి, ఎం.భిక్షపతి యాదవ్, రేగా కాంతారావు, పి.విష్ణువర్ధన్‌రెడ్డి, మాగం రంగారెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, సి.రాంచంద్రారెడ్డి, ఎండీ సిరాజుద్దీన్, వేం నరేందర్‌రెడ్డి, కె.గౌరీశంకర్, టి.నిరంజన్, జి.నిరంజన్‌ నియమితులయ్యారు. వీరితో పాటు అన్ని కమిటీల చైర్‌పర్సన్లు ఈ కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తారని ఏఐసీసీ తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement