
సాక్షి, హుజూరాబాద్ (కరీంనగర్): ‘అసలు హుజూరాబాద్‌లో జరిగే పంచాయితీ ధరల కోసం కాదు. కేసీఆర్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నిక ఇది’అని మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం హుజూరాబాద్‌లోని పలువార్డుల్లో ఈటల ప్రచారం నిర్వ హించారు. ‘ఆయన సర్వే చేయించుకుంటే ఒక్క ఇంచు కూడా టీఆర్‌ఎస్ గ్రాఫ్ పెరగలేదట. 5 నెలల 10 రోజులైంది.
నాయకులు ఎటుపోయినా, ప్రజలు మాత్రం నాకు మద్దతుగా ఉన్నారు. అవసరం అయితే వాళ్ల జెండాలు, కండువాలు వేసుకొని ప్రచారం చేస్తాం కానీ ఓటు మాత్రం మీకే వేస్తామని అంటున్నారు’అని తెలిపారు. కాగా, సోమవారం హుజూరాబాద్‌లో ఎన్నికల నియమావళి, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి పరిమితికి మించి మీటింగ్ నిర్వహించిన మాజీమంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై కేసు నమోదు చేసినట్లు హుజూరాబాద్ టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment