fires on cm
-
కేసీఆర్ ప్రభుత్వ బడ్జెట్ ఓ పెద్ద స్కామ్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణకు పట్టిన దరిద్రం కేసీఆర్ కుటుంబమని బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విరుచుకుపడ్డారు. నిజామాబాద్‌లో శనివారం డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని చెబుతూ అనేక హామీలు ఇచ్చిన కేసీఆర్ వాటిని నెరవేర్చకపోగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో విచ్చలవిడిగా స్కాములు నడుస్తున్నాయన్నారు. ధరణి కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పెద్ద స్కామ్, ఇక తెలంగాణ బడ్జెట్ మహా స్కామ్ అని విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. రూ.2.5 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెడుతూ అందులో రూ.ఒక లక్ష కోట్లు కూడా ఖర్చు చేయడం లేదన్నారు. గతంలో డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.23,600 కోట్లు బడ్జెట్లో పెట్టి అందులో కేవలం రూ.380 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం నిదర్శనమని విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కేవలం లిక్విడ్ డైట్ (మద్యం అమ్మకాలు, చమురుపై పన్నులు)తో నడుస్తోందన్నారు. ఇక పోలీసు శాఖను చలాన్ల శాఖగా మార్చారని ఆయన దుయ్యబట్టారు. మరోవైపు విలువైన ప్రభుత్వ భూములను అమ్ముతూ స్కాములు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యం, మద్దతు ధర, ఆయుష్మాన్ భారత్ లాంటి పథకాలతోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తోందని విశ్వేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
అవన్నీ ఫేక్ వీడియోలే : బండి సంజయ్
-
ఖాసీం రజ్వీని మించిన నియంత కేసీఆర్
సాక్షి, నయీంనగర్(వరంగల్): ఖాసీం రజ్వీని మించిన నియంత సీఎం కేసీఆర్ అని హనుమకొండ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ని భేషరతుగా విడుదల చేయాలని, ఉద్యోగుల బదిలీల జీఓ 317ను సవరించాలని రావు పద్మ ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండ కేయూ జంక్షన్లో బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను తగులబెట్టే క్రమంలో బీజేపీ నేతలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా రావు పద్మ మాట్లాడుతూ అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపినంత మాత్రాన ప్రజల పక్షాన పోరాటం ఆగదన్నారు. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని, శాశ్వతంగా టీఆర్ఎస్ అధికారంలో ఉండదనే విషయాన్ని పోలీసు అధికారులు గుర్తుంచుకోవాలన్నారు. వేల మందితో టీఆర్ఎస్ సభలు, ధర్నా నిర్వహిస్తే లేని ఇబ్బంది బీజేపీ నిర్వహిస్తే మాత్రం అరెస్టులు చేస్తారా? అని ప్రశ్నించారు. ధర్నాలో బీజేపీ నాయకులు డాక్టర్ పెసరు విజయ్‌చందర్ రెడ్డి, కొలను సంతోశ్‌రెడ్డి, చాడ శ్రీనివాస్‌రెడ్డి, కార్పొరేటర్లు గురుమూర్తి శివకుమార్, చాడ స్వాతి, రావుల కిషన్, గుజ్జా సత్యనారాయణరావు, దేషిని సదానందంగౌడ్, ఆర్.పి.జయంత్‌లాల్, కొండి జితేందర్ రెడ్డి, కందగట్ల సత్యనారాయణ, బైరి శ్రావణ్, మాచర్ల కుమార్, తోపుచర్ల అర్చన, కేతిరెడ్డి విజయలక్ష్మి, తీగల భరత్ గౌడ్, భరత్, జగన్ పాల్గొన్నారు. -
సామాన్యుడు ఓటు వేసేది నాకే: ఈటల
సాక్షి, హుజూరాబాద్ (కరీంనగర్): ‘అసలు హుజూరాబాద్‌లో జరిగే పంచాయితీ ధరల కోసం కాదు. కేసీఆర్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నిక ఇది’అని మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం హుజూరాబాద్‌లోని పలువార్డుల్లో ఈటల ప్రచారం నిర్వ హించారు. ‘ఆయన సర్వే చేయించుకుంటే ఒక్క ఇంచు కూడా టీఆర్ఎస్ గ్రాఫ్ పెరగలేదట. 5 నెలల 10 రోజులైంది. నాయకులు ఎటుపోయినా, ప్రజలు మాత్రం నాకు మద్దతుగా ఉన్నారు. అవసరం అయితే వాళ్ల జెండాలు, కండువాలు వేసుకొని ప్రచారం చేస్తాం కానీ ఓటు మాత్రం మీకే వేస్తామని అంటున్నారు’అని తెలిపారు. కాగా, సోమవారం హుజూరాబాద్‌లో ఎన్నికల నియమావళి, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి పరిమితికి మించి మీటింగ్ నిర్వహించిన మాజీమంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై కేసు నమోదు చేసినట్లు హుజూరాబాద్ టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
కేసీఆర్ నిరంకుశత్వాన్ని బొందపెడ్తాం: ఈటల
హుజూరాబాద్: సీఎం కేసీఆర్ నిరంకుశత్వాన్ని బొందపెట్టడానికి రాష్ట్రమంతా ఎదురుచూస్తోందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. సోమవారం కాట్రపల్లి గ్రామానికి చెందిన పలువురు బీజేపీలో చేరిన సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఆత్మగౌరవ బావుటా ఎగురవేశానని, గెలిస్తే ఏకుమేకవుతాననే భయంతో ఓడించాలని చూస్తున్నారని ఆరోపించారు. తనపై ప్రత్యేక నిఘా పెట్టారని, వందల మంది పోలీసులను మఫ్టీలో దిం పారని పేర్కొన్నారు. పెన్షన్లు, రేషన్‌కార్డులు రావని ప్రజలను భయపెడ్తున్నారని.. అవి ఆగవని, ఆపే శక్తి ఎవరికీ లేదని ఈటల చెప్పారు. హుజూరాబాద్‌కు వస్తున్న నాయకులు ముందు వాళ్ల నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసి చూపాలని సవాల్ చేశారు. -
తూటాకు తూటాతోనే సమాధానం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పాకిస్తాన్‌కు తాము తూటాకు తూటాతోనే సమాధానం చెప్పామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అధికారంలోకి వస్తే ఉగ్ర వాదానికి తమలా దీటైన సమాధానం చెప్పగలవా అని ప్రశ్నించారు. బుధవారం నిజామాబాద్‌లో జరిగిన ఐదు పార్లమెంట్ స్థానాల బీజేపీ క్లస్టర్‌స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విపక్షాలపై నిప్పులు చెరిగారు. విపక్షాలు క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి మద్దతు ఇవ్వాల్సిందిపోయి పరాయి దేశానికి వత్తాసు పలికేలా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. పుల్వామా దాడి ఘటన నేపథ్యంలో వాయుసేన పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి తగిన గుణపాఠం చెబితే.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మాయావతి, అఖిలేష్ యాదవ్‌లు సాక్ష్యాలు అడుగుతున్నారని మండిపడ్డారు. ఈ సర్జికల్ స్ట్రైక్‌పై పాకిస్తాన్ మీడియా, కాంగ్రెస్ మిత్రపక్షాల మాటల తీరు ఒకేలా ఉందన్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు జవాన్లకు మద్దతివ్వాల్సింది పోయి.. ఆధారాలు అడగడం ఎంత వరకు సమంజసమని షా ప్రశ్నించారు. బీజేపీ పాలనలోనే దేశం సురక్షితంగా ఉంటుందన్నారు. అమెరికా, ఇజ్రాయిల్ వంటి దేశాలు మాత్రమే కాదు, భారత్ కూడా సర్జికల్‌స్ట్రైక్‌లు చేయగలదని నిరూపితమైందన్నారు. పాకిస్తాన్‌కు సరైన గుణపాఠం చెప్పామని.. ఇది మోదీ నేతృత్వంతోనే సాధ్యమైందని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ వంటి మిత్ర పక్ష పార్టీలకు జెండా, ఎజెండాలు లేవని, సిద్ధాంతాలను పక్కన బెట్టి రాజకీయాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. తమ ఎజెండా ఏమిటో రాహుల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. మీ ప్రధాని అభ్యర్థి ఎవరు? బీజేపీ అధికారంలోకి వస్తే నరేంద్రమోదీ ప్రధాని అవుతారనే తాము ప్రకటిస్తున్నామని, మహాకూటమి అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరనేది ఎందుకు ప్రకటించడం లేదని షా ప్రశ్నించారు. రోజుకొకరు ప్రధాని అభ్యర్థి అంటూ వాట్సాప్‌లో వైరల్ అవుతోందని ఎద్దేవా చేశారు. ఇలాంటి నేతలతో దేశం సురక్షితంగా ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణా రాలేదని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌పైనా విమర్శలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరునూ అమిత్ షా ఎండగట్టారు. తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. 16+1 అంటున్న కేసీఆర్ ఓ స్థానం రజాకార్ల పార్టీ కైవసం చేసుకుంటుందని చెబుతున్నారని విమర్శించారు. హైదరాబాద్, అహ్మదాబాద్, ముంబైలలో ఉగ్రమూలాలను బయటకు తీయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ అసాంఘిక శక్తులను ఏరివేసేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నిస్తే కేసీఆర్, చంద్రబాబు, రాహుల్‌గాంధీల నుంచి సరైన సమాధానం ఆశించలేమని అన్నారు. ఈ ఎన్నికలు సీఎంను ఎన్నుకునేందుకు కావని, ప్రధానిని ఎన్నుకునేందుకు జరుగుతున్న ఎన్నికలనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ. 2.45 లక్షల కోట్ల నిధులు కేటాయించిందని అమిత్ షా వివరించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ, తెలంగాణ పార్లమెంట్ ఇన్చార్జి అరవింద్ లింబావలి, కిషన్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, ధర్మపురి అర్వింద్, మంత్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్‌లో గెలుపు అవకాశాలు: లక్ష్మణ్ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. నిజాంషుగర్స్ పునరుద్ధరణ వంటి హామీల అమలులో కేసీఆర్ సర్కారు విఫలమైందని ఆయన మండిపడ్డారు. దేశాన్ని పాలించేందుకు సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, ఆ సామర్థ్యం కేవలం మోదీకి మాత్రమే ఉందని ఉద్ఘా టించారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతోందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 16+1 అంటూ రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని, కేసీఆర్, ఒవైసీ కుటుంబాలే రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. -
గిరిజనులంటే అంత అలుసా ?
అనంతపురం సిటీ: గిరిజనులకు రాజకీయ ప్రాధాన్యం ఇస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు నేడు గిరిజనులను అలుసుగా చూస్తున్నారని గిరిజన ప్రజా సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు వడిత్యా నాయక్ విమర్శించారు. గురువారం స్థానిక జాతీయ రహదారులు, భవనాల శాఖ అథితి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలు రికార్డులకే పరిమితమయ్యాయన్నారు. బ్యాక్లాగ్ పోస్టులని వెంటనే భర్తీ చేయాలన్నారు. అలాగే టీటీడీ పాలక మండలిలో గిరిజనులకు స్థానం కల్పించాలన్నారు. గిరిజన తండాలు, ఏజెన్సీ ప్రాంతాలు, బయలు ప్రాంత వాసులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కనీస సౌకర్యాలు కూడా లేక వేలాది కుటుంబాలు నేడు దుర్భరమైన జీవితం గడుపుతున్న విషయం ఈ ప్రభుత్వాలకు తెలీదా? అని ప్రశ్నించారు. తమ హక్కులకు భంగం వాటిళ్లకుండా ప్రభుత్వం సహకరించాలని కోరారు. కాదని తన మొండి వైఖరిని అవలంభిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. త్వరలో పలు డిమాండ్లపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మళ్లికార్జున నాయక్, చిరంజీవి నాయక్, సుధాకరనాయక్, రాంప్రసా«ద్‌నాయక్, రమణా నాయక్, శ్రీనివాసనాయక్లు పాల్గొన్నారు. -
రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన ముఖ్యమంత్రి
వైఎస్సార్సీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ధ్వజం అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నిస్సిగ్గుగా, అనైతికంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని వైఎస్సార్సీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాలువ వెంకట రాముడు ఓ ప్రకటనలో విమర్శించారు. పార్టీ ఫిరాయించిన వారితో రాజీనామా చేయించకుండా వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. వైఎస్ కుటుంబాన్ని అదేపనిగా తిడుతున్నవారికి, తన అవినీతి అక్రమాలకు వంత పాడుతున్న వారికి మంత్రి వర్గంలో చోటు కల్పించారని మండిపడ్డారు. విశ్వాసఘాతకుడైన జమ్ముల మడుగు ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి, అసెంబ్లీలో చంద్రబాబు అవినీతి అక్రమాలకు వత్తాసు పలుకుతున్న చీప్ విప్ కాలువ శ్రీనివాసులుకు మంత్రి పదవులు కట్టబెట్టడం దుర్మార్గ చర్య అని ఆయన అభివర్ణించారు. -
ప్రత్యేక హోదాతోనే ఉపాధి అవకాశాలు
అనంతపురం : ‘‘ఎన్నికల ముందు బాబు వస్తే జాబు వస్తుందంటూ ఊదరగొట్టారు. ఇంటికో ఉద్యోగం.. లేదంటే రూ. 2 వేల దాకా నిరుద్యోగ భృతి కల్పిస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి గెలిచిన తర్వాత నిరుద్యోగ యువతను ముఖ్యమంత్రి చంద్రబాబు వంచించారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తనను యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా నియమించడం పట్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ముందు ఏపీకీ పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ నాయకులు అంటే...కాదు కాదు 15 ఏళ్లు ఇస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు చెప్పారన్నారు. అలాంటి వారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మాట మార్చారని మండిపడ్డారు. జిల్లా వ్యాప్తంగా పర్యటించి సమావేశాలు ఏర్పాటు చేసి చంద్రబాబు మోసాలను యువతకు తెలియజేస్తామన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి తెచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయయాదవ్ మాట్లాడుతూ యువత, విద్యార్థులంతా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉన్నారన్నారు. ఇంటికో ఉద్యోగం అన్న బాబు ఉన్న ఉద్యోగాలను పీకేశారని మండిపడ్డారు. ప్రత్యేకహోదా అనేది సంజీవనా అని చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు పరుశురాం మాట్లాడుతూ చంద్రబాబు మోసాలపై జిల్లా వ్యాప్తంగా పర్యటించి అవగాహన కల్పిస్తామన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు బి.రామ్మోహన్ రెడ్డి, నార్పల మండల కన్వీనర్ రఘనాథరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, నగర అధ్యక్షులు మారుతీనాయుడు, విద్యార్థి విభాగం జిల్లా ప్రధానకార్యదర్శి బాబాసలాం పాల్గొన్నారు.