సాక్షి, కరీంనగర్: టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించి, 20 ఏళ్లయింది. ఇన్నేళ్లలో ఆ పార్టీ మూడు గుర్తులతో ఎన్నికల బరిలోకి దిగింది. పార్టీ ఆవిర్భావం జరిగాక సిద్దిపేట ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పదవులకు సీఎం కేసీఆర్ రాజీనామా చేశారు. దీంతో సిద్దిపేట ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు బస్సు గుర్తు కేటాయించారు. వెనువెంటనే వచ్చిన స్థానిక సంస్థల(2001) ఎన్నికల్లో రైతు నాగలి గుర్తు, 2004లో జరిగిన అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో కారు గుర్తు కేటాయించారు. తదనంతరం కారు గుర్తే టీఆర్‌ఎస్‌కు సొంతమైంది.
చదవండి: హుజురాబాద్ ఉప ఎన్నిక: కండువా కప్పుకుంటే ఎంతిస్తావ్?
పోలింగ్‌కు ముందు నమూనా పోలింగ్
కరీంనగర్: పోలింగ్ ప్రారంభానికి ముందు ఏజెంట్ల సమక్షంలో నమూనా పోలింగ్ నిర్వహిస్తారు. సీయూ (కంట్రోల్ యూనిట్), బీయూ (బ్యాలెట్ యూనిట్), వీవీప్యాట్లకు కనెక్షన్లు ఇచ్చిన తర్వాత స్విచ్ ఆన్ చేస్తారు. డిస్‌ప్లేలో జీరో, స్టార్ట్ అని కనిపిస్తుంది. తర్వాత ఏజెంట్లను పోలింగ్ కేంద్రంలోనికి అనుమతిస్తారు. వారి ఎదుట బీయూ బటన్ నొక్కగానే వెలుగుతుంది. సీయూలో ఆకుపచ్చ లైట్ వెలుగుతుంది. అనంతరం ఏజెంట్ల ద్వారా పోటీ చేసే అభ్యర్థులతోపాటు నోటాకు ఓటు వేయమని చెబుతారు. వేసిన ఓట్లు ఎవరెవరికీ ఎన్ని వచ్చాయి? వేసిన ఓట్ల లెక్క సరిపోయిందా లేదా? అనే విషయాలను పరిశీలిస్తారు. తర్వాత అందరి ఆమోదంతో క్లియర్ బటన్ నొక్కి పోలింగ్ ప్రారంభిస్తారు.
చదవండి: టీఎస్‌ఆర్టీసీ మరో ముందడుగు.. ప్రయాణికులకు సజ్జనార్ గుడ్‌న్యూస్
Comments
Please login to add a commentAdd a comment