Huzurabad By Elections 2021: తెలుగు రాష్ట్రాలు అత్యంత ఉత్కంఠతో ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి ఈటల రాజేందర్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కమలాపూర్ 262 పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడుతూ.. అధికార దుర్వినియోగంతో ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు ధర్మం, న్యాయం వైపు ఉన్నారు. ఈటల అసెంబ్లీ లో అడుగు పెట్టవద్దు, బొంద పెట్టాలని సీఎం కేసిఆర్ కుట్ర పన్నారు.
భావోద్వేగంతో ప్రజలకు అప్పీల్ చేశాను. చంపుకుంటారో, సాదుకుంటారో ప్రజలు ఆలోచించాలని కోరుకుంటున్నా. వందల కోట్లు డబ్బులు పంచినా, మద్యం ఏరులై పారించినా ప్రజలు తమ వైపే ఉన్నారు. చరిత్రలో ఇలాంటి ఎన్నికను ఎప్పుడు చూడలేదు. ఐదు నెలలుగా జనంలో ఉన్నా, కానీ ప్రలోబాలతో మూడు రోజుల్లోనే మార్చేశారు. ఇంత నీచంగా, ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు హత్య చేసిన పరిస్థితి చూడలేదు' అని ఈటల అన్నారు.
చదవండి: (Huzurabad Bypoll: కౌశిక్‌రెడ్డి, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ)
Comments
Please login to add a commentAdd a comment