సాక్షి, కరీంనగర్: దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక గడువు సమీపిస్తుండడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఉప పోరు సందర్భంగా నియోజకవర్గంలో మూడునెలల నుంచి మద్యం ఏరులై పారినట్లు మద్యం అమ్మకాల తీరును చూస్తే అర్థమవుతోంది. రెండురోజుల నుంచి బుధవారం ఎన్నికల ప్రచారం ముగిసే వరకు రూ.3 కోట్ల మద్యం కేవలం ఉప ఎన్నిక జరుగుతున్న ప్రాంతానికి తరలినట్లు తెలిసింది. ఎవరి కంటా పడకుండా ఓటర్లకు మద్యం పంపిణీ చేయాలని పలువురు ప్రయత్నాలు సాగిస్తున్నారు. కానీ, పోలీసు అధికారులు 10 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు 3,000 మందితో పటిష్ట నిఘా పెడుతూ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. తనిఖీల్లో భాగంగా సుమారు 6.5 లక్షల విలువగల 940 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నారు.
చదవండి: టీఆర్‌ఎస్, బీజేపీలకు ఓటేస్తే ఒరిగేదేమీ లేదు: రేవంత్
రోజుకు కోటిన్నర ‘నిషా’..
ఉపపోరు సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మద్యం నిల్వలు హుజూరాబాద్‌కు తరలడం చూసి అధికారులే అవాక్కవుతున్నారు. నెల రోజుల నుంచి నియోజకవర్గంలో రోజుకు రూ.కోటికి పైగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. దసరా పండుగ ఎన్నికల మధ్యే రావడంతో పెద్ద ఎత్తున అమ్మకాలు సాగాయి.
చదవండి: Huzurabad Bypoll: 100 కోట్లు దాటిన బెట్టింగ్..?
48 గంటలు వైన్స్‌లు, బార్లు బంద్
ఉప ఎన్నిక సందర్భంగా ఈనెల 28 సాయంత్రం 7 గంటల నుంచి 30 సాయంత్రం 7 గంటల వరకు నియోజకవర్గం పరిధిలో వైన్స్‌లు, బార్లు మూసేయాలని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ ఆదేశాలు జారీచేయడంతో ఎక్సైజ్ అధికారులు సన్నద్ధమవుతున్నారు. వచ్చే నెల 2వ తేదీన కౌంటింగ్ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి ప్రక్రియ ముగిసేవరకు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని వైన్స్‌లు, బార్లు మూసివేయాలని ఆదేశించారు.
హుజూరాబాద్ నియోజకవర్గానికి రెండురోజుల నుంచి తరలిన మద్యం వివరాలు..
ప్రాంతం | బీర్ల కేసులు | మద్యం కేసులు | విలువ కోట్లలో |
హుజూరాబాద్ | 1,447 | 1,236 | 1.21 |
జమ్మికుంట | 948 | 2,047 | 1.92 |
మొత్తం | 2,395 | 3,283 | 3.13 |
Comments
Please login to add a commentAdd a comment