beer battle
-
తాగకపోయినా... తాగినట్టే మత్తుగా ఉంటుందా? ఆ జబ్బేంటో తెలుసా?
ఒకవేళ ఎవరికైనా ఈ జబ్బు ఉందంటే... పొరబాటున వారు వాహనం నడిపేటప్పుడు పోలీస్ చెకింగ్ గానీ జరిగిందంటే... అది వారి పాలిట సమస్యే అవుతుంది. నిజానికి వారు మద్యం తాగకపోయినప్పటికీ... బ్రెత్ అనలైజర్‌తో పరీక్ష చేశారంటే మద్యం తాగితే వచ్చే ఫలితమే కనిపిస్తుంది. అందుకే దీన్ని ‘‘డ్రంకెన్నెస్ డిసీజ్’’ అంటారు. ఎందుకు జరుగుతుందంటే...? ఈ జబ్బు ఉన్నవారిలో వాళ్లు తిన్న కార్బోహైడ్రేట్లు (పిండిపదార్థాలు) ఎప్పటికప్పుడు ఆల్కహాల్‌గా మారిపోతుంటాయి. అందుకే ఈ వైద్య సమస్యను ‘బీర్ గట్’ (బీరుతో నిండిన కడుపు / కడుపు నిండా బీరు) లేదా గట్ ఫర్మెంటేషన్ సిండ్రోమ్ / ఆటో బ్రూవరీ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఈ పరిస్థితి కారణంగా తాగక పోయినా మత్తు వచ్చేస్తుంది. అవాంఛితమైన ఆ మత్తు కారణంగా ప్రమాదాలూ జరగవచ్చు. బాధితులలో భౌతికంగా కూడా చాలా సమస్యలూ వస్తుంటాయి. ఉదాహరణకు మద్యం తాగినప్పుడు చాలామందిలో కనిపించే లక్షణమైన నోరంతా ఎండిపోవడంతో పాటు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, దీర్ఘకాలికంగా నిస్సత్తువ ఉండటం వంటివెన్నో కనిపిస్తాయి. దాని వల్ల డిప్రెషన్లోకి కూడా జారిపోవచ్చు. వాళ్ల జీర్ణకోశంలో ఉండే ‘శాకరోమైసిస్ సెరివిసీ’ అనేఒక రకమైన సూక్ష్మజీవి వల్ల ఇలా జరుగుతుంది. చికిత్స ఏమిటి? పిండిపదార్థాలను పూర్తిగా నివారించడం, అలాగే బాధితులకు ఎప్పుడూ హై ప్రోటీన్ ఆహారాన్ని ఇవ్వడంలాంటి ‘డైట్ థెరపీ’తో డాక్టర్లు ఈ సమస్యకు చికిత్స అందిస్తారు. కొందరికి యాంటీ ఫంగల్ / యాంటీ బ్యాక్టీరియల్ మందుల చికిత్స అవసరమవుతుంది. శాకరోమైసిస్ సెరివిసీ అనేది ఈస్ట్ లాంటి మైక్రోబ్ వల్ల ఈ జబ్బు వస్తుంది కాబట్టి డాక్టర్లు యాంటీఫంగల్ మందులతో, సూక్ష్మజీవులను అరికట్టే యాంటీ బయాటిక్స్తోనూ ఈ సమస్యను అదుపు చేసే ప్రయత్నం చేస్తారు. -
హుజురాబాద్ ఉప ఎన్నిక: 2 రోజులు..రూ.3 కోట్ల కిక్కు
సాక్షి, కరీంనగర్: దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక గడువు సమీపిస్తుండడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఉప పోరు సందర్భంగా నియోజకవర్గంలో మూడునెలల నుంచి మద్యం ఏరులై పారినట్లు మద్యం అమ్మకాల తీరును చూస్తే అర్థమవుతోంది. రెండురోజుల నుంచి బుధవారం ఎన్నికల ప్రచారం ముగిసే వరకు రూ.3 కోట్ల మద్యం కేవలం ఉప ఎన్నిక జరుగుతున్న ప్రాంతానికి తరలినట్లు తెలిసింది. ఎవరి కంటా పడకుండా ఓటర్లకు మద్యం పంపిణీ చేయాలని పలువురు ప్రయత్నాలు సాగిస్తున్నారు. కానీ, పోలీసు అధికారులు 10 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు 3,000 మందితో పటిష్ట నిఘా పెడుతూ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. తనిఖీల్లో భాగంగా సుమారు 6.5 లక్షల విలువగల 940 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నారు. చదవండి: టీఆర్ఎస్, బీజేపీలకు ఓటేస్తే ఒరిగేదేమీ లేదు: రేవంత్ రోజుకు కోటిన్నర ‘నిషా’.. ఉపపోరు సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మద్యం నిల్వలు హుజూరాబాద్‌కు తరలడం చూసి అధికారులే అవాక్కవుతున్నారు. నెల రోజుల నుంచి నియోజకవర్గంలో రోజుకు రూ.కోటికి పైగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. దసరా పండుగ ఎన్నికల మధ్యే రావడంతో పెద్ద ఎత్తున అమ్మకాలు సాగాయి. చదవండి: Huzurabad Bypoll: 100 కోట్లు దాటిన బెట్టింగ్..? 48 గంటలు వైన్స్‌లు, బార్లు బంద్ ఉప ఎన్నిక సందర్భంగా ఈనెల 28 సాయంత్రం 7 గంటల నుంచి 30 సాయంత్రం 7 గంటల వరకు నియోజకవర్గం పరిధిలో వైన్స్‌లు, బార్లు మూసేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాలు జారీచేయడంతో ఎక్సైజ్ అధికారులు సన్నద్ధమవుతున్నారు. వచ్చే నెల 2వ తేదీన కౌంటింగ్ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి ప్రక్రియ ముగిసేవరకు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని వైన్స్‌లు, బార్లు మూసివేయాలని ఆదేశించారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి రెండురోజుల నుంచి తరలిన మద్యం వివరాలు.. ప్రాంతం బీర్ల కేసులు మద్యం కేసులు విలువ కోట్లలో హుజూరాబాద్ 1,447 1,236 1.21 జమ్మికుంట 948 2,047 1.92 మొత్తం 2,395 3,283 3.13 -
బిడ్డకు బీరు తాగించిన తండ్రి, తల్లి ఫిర్యాదుతో జైలుపాలు
తిరువనంతపురం: కేరళలో ఒక ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. పిల్లలు బాధ్యత తల్లిదండ్రలది. వాళ్లు ఎటువంటి చెడు వ్యసనాలకు గురి కాకుండా చూడాల్సింది కన్నవారే. సాధరణంగా పిల్లలు మద్యానికి బానిస అయితే తల్లిదండ్రలు ఆగ్రహానికి గురై వారిని మందలిస్తారు. అయితే కేరళలో మాత్రం దీనికి కాస్త భిన్నమైన ఘటన ఒకటి వెలుగుచూసింది. ఉత్తర కేరళలోని హోస్‌దుర్గ్‌లో ఓ తండ్రి తన ఎనిమిదేళ్ల కూమార్తెకు బీరు తాగించాడు. అనంతరం పనిమీద బయటకు వెళ్లాడు. అయితే, బాలిక ఉన్నట్టుండి వాంతులు చేసుకోవడం మొదలు పెట్టింది. బిడ్డకు ఏమైందోనని కంగారు పడ్డ.. ఆమెను హుటహుటిన స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లింది. దీంతో వైద్యలు మద్యం బాలిక మద్యం సేవించడం వల్ల వాంతులు చేసుకుందని, ఇప్పుడు బాగానే ఉందని తెలిపారు. భర్త నిర్వాకాన్ని సహించని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల బాలిక వాంగ్మూలం సేకరించి.. ఆమె తండ్రిపై కేసు నమోదు చేశారు. అతన్ని అరెస్టు చేసి రెండు వారాలు రిమాండ్‌కు తరలించారు. చదవండి:18 ఏళ్లకే భర్త వదిలేస్తే.. ఐస్ క్రీం అమ్మకం నుంచి నేడు ఎస్సై -
ఫేస్బుక్లో పరిచయం.. నగలు మాయం
బనశంకరి : ఫేస్బుక్లో పరిచయమైన గుర్తుతెలియని వ్యక్తి ప్రైవేటు కంపెనీ ఉద్యోగికి బీర్లో మత్తుమందు కలిపి ఇచ్చి రూ.5 లక్షల విలువైన బంగారుఆభరణాలు దోచుకెళ్లాడు. బనశంకరి మూడవస్టేజ్ భువనేశ్వరినగర నివాసి రమేశ్ నగరంలో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం నిర్వహిస్తున్నాడు. నెలన్నరక్రితం ఫేస్బుక్లో గుర్తుతెలియని వ్యక్తి రిక్వెస్ట్ పెట్టాడు. ఈక్రమంలో వారిద్దరి మధ్య పరిచయం పెరిగి వ్యక్తిగత వివరాలు పంచుకునేవరకు వెళ్లింది. ఇన్సూరెన్స్ కంపెనీలో పెట్టుబడి పెడతానని రమేష్‌ను నమ్మించాడు. ఈనెల 20న రమేశ్‌కు ఫోన్ చేసి తనకు వివాహం నిశ్చయమైందని, స్నేహితులు ఎవరూలేరని, పెళ్లి బట్టలు కొనేందుకు సహకరించాలని కోరాడు. దీంతో రమేశ్ అతన్ని కత్రిగుప్పెలో కలిశాడు. తర్వాత బీర్, బిరియాని పార్శిల్ కట్టించుకుని ఆ వ్యక్తిని రమేష్ తన వెంట ఇంటికి తీసుకెళ్లాడు. ఇద్దరూ కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. తాగునీరు తెచ్చేందుకు రమేశ్ వంటగదిలోకి వెళ్లిన సమయంలో బీర్ బాటిల్లో మత్తుమందు కలిపాడు. అనంతరం రమేష్‌కు బీర్ గ్లాస్ చేతికి ఇవ్వగా తాగగానే స్పృహకోల్పోయాడు. మరుసటి రోజు ఉదయం స్పృహలోకి వచ్చిన రమేష్‌కు గుర్తుతెలియని వ్యక్తి కనబడలేదు. అనుమానంతో కప్బోర్డు పరిశీలించగా 20 గ్రాముల బ్రాస్లేట్, 28 గ్రాముల బంగారుచైన్, 60 గ్రాములు బంగారుచైన్, రెండు ఉంగరాలు, వెండివస్తువులు, సెల్‌ఫోన్ కనిపించలేదు. దీంతో రమేశ్ గుర్తుతెలియని వ్యక్తికి ఫోన్ చేయగా స్విచ్చాప్ వచ్చింది. మోసపోయినట్లు గుర్తించిన రమేష్ చెన్నమ్మకెరె అచ్చుకట్టు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు రమేశ్ ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించినా గుర్తు తెలియని వ్యక్తి ఆచూకీ లభించలేదు. ఘటనపై కేసు నమోదు చేసి వంచకుడి కోసం గాలింపు చేపట్టారు. -
మహిళపై కానిస్టేబుల్ వీరంగం
అనంతపురం: అనంతపురం జిల్లా ధర్మవరంలో ఓ కానిస్టేబుల్ రౌడీలా వీరంగం చేశాడు. బీర్ బాటిల్‌తో ఓ మహిళ తలను పగలకొట్టాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ధర్మవరంలోని సిద్దయ్యగుట్ట కాలనీలో వినాయకుని మండపం తొలగించాలని సుశీల అనే మహిళ కానిస్టేబుల్ చంద్రశేఖర్ ను కోరింది. ఈ విషయంపై ఆగ్రహం చెందిన కానిస్టేబుల్ బీర్ బాటిల్ తీసుకుని సుశీల తల పగిలేలా కొట్టాడు. సుశీల తల పగిలి తీవ్ర రక్తస్రావమైంది. బాధ్యత గల కానిస్టేబుల్ ఇలా ప్రవర్తించడం దారుణమని బాధితురాలి బంధువులు వాపోయారు. మహిళపై దాడి చేసిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
మహిళపై కానిస్టేబుల్ వీరంగం