అనంతపురం జిల్లా ధర్మవరంలో ఓ కానిస్టేబుల్ రౌడీలా వీరంగం చేశాడు. బీర్ బాటిల్‌తో ఓ మహిళ తలను పగలకొట్టాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ధర్మవరంలోని సిద్దయ్యగుట్ట కాలనీలో వినాయకుని మండపం తొలగించాలని సుశీల అనే మహిళ కానిస్టేబుల్ చంద్రశేఖర్ ను కోరింది. ఈ విషయంపై ఆగ్రహం చెందిన కానిస్టేబుల్ బీర్ బాటిల్ తీసుకుని సుశీల తల పగిలేలా కొట్టాడు. సుశీల తల పగిలి తీవ్ర రక్తస్రావమైంది. బాధ్యత గల కానిస్టేబుల్ ఇలా ప్రవర్తించడం దారుణమని బాధితురాలి బంధువులు వాపోయారు. మహిళపై దాడి చేసిన కానిస్టేబుల్ను సస్పెండ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.