తిరువనంతపురం: కేరళలో ఒక ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. పిల్లలు బాధ్యత తల్లిదండ్రలది. వాళ్లు ఎటువంటి చెడు వ్యసనాలకు గురి కాకుండా చూడాల్సింది కన్నవారే. సాధరణంగా పిల్లలు మద్యానికి బానిస అయితే తల్లిదండ్రలు ఆగ్రహానికి గురై వారిని మందలిస్తారు. అయితే కేరళలో మాత్రం దీనికి కాస్త భిన్నమైన ఘటన ఒకటి వెలుగుచూసింది. ఉత్తర కేరళలోని హోస్‌దుర్గ్‌లో ఓ తండ్రి తన ఎనిమిదేళ్ల కూమార్తెకు బీరు తాగించాడు. అనంతరం పనిమీద బయటకు వెళ్లాడు. అయితే, బాలిక ఉన్నట్టుండి వాంతులు చేసుకోవడం మొదలు పెట్టింది. బిడ్డకు ఏమైందోనని కంగారు పడ్డ.. ఆమెను హుటహుటిన స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లింది.
దీంతో వైద్యలు మద్యం బాలిక మద్యం సేవించడం వల్ల వాంతులు చేసుకుందని, ఇప్పుడు బాగానే ఉందని తెలిపారు. భర్త నిర్వాకాన్ని సహించని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల బాలిక వాంగ్మూలం సేకరించి.. ఆమె తండ్రిపై కేసు నమోదు చేశారు. అతన్ని అరెస్టు చేసి రెండు వారాలు రిమాండ్‌కు తరలించారు.
చదవండి:18 ఏళ్లకే భర్త వదిలేస్తే.. ఐస్ క్రీం అమ్మకం నుంచి నేడు ఎస్సై
Comments
Please login to add a commentAdd a comment