బిహార్‌ ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాల వెల్లడి | Bihar Exit Polls 2020 People Pulse PSG Survey Key Points | Sakshi
Sakshi News home page

బిహార్‌ ఎగ్జిట్‌ పోల్స్‌: జేడీయూకి భారీ షాక్‌!

Published Sat, Nov 7 2020 6:24 PM | Last Updated on Sat, Nov 7 2020 11:28 PM

Bihar Exit Polls 2020 People Pulse PSG Survey Key Points - Sakshi

పట్నా: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ నేటితో ముగిసింది. ఇందుకు సంబంధించిన ఎగ్జిట్‌ పోల్స్‌ తాజాగా విడుదలయ్యాయి. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల సమరంలో మహాగట్‌ బంధన్‌ (కాంగ్రెస్-ఆర్జేడీ-వామపక్ష కూటమి)కే స్వల్ప ఆధిక్యత లభించే అవకాశం ఉన్నట్లు పీపుల్స్ పల్స్- పీఎస్జీ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. బిహార్‌లోని మొత్తం 243 సీట్లకు జరిగిన మూడు విడతల్లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీకి 85- 95 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 15- 20, ఎల్‌జేపీ 3-5, వామపక్షాలు 3-5 సీట్లు సాధిస్తాయని సర్వే పేర్కొంది. ఇక అధికార ఎన్డీయే కూటమిలోని బీజేపీకి 65-75 సీట్లు దక్కే అవకాశం ఉండగా, జేడీ(యూ) 25-35 సీట్లకే పరిమితం కానున్నట్లు వెల్లడించింది.

కాగా ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ సర్కారుపై ఉన్న వ్యతిరేకత చాపకింద నీరులా మారితే మహాగట్ బంధన్ మరిన్ని ఎక్కువ సీట్లు సాధించే అవకాశమున్నట్లు సర్వేలో వెల్లడైంది. పట్నా,నలందాతోపాటు వాయువ్య భోజ్‌పురి, బజ్జికా, మైథిలి, ఆంజిక మాట్లాడే ప్రాంతాల్లో జేడీయూకి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉందని తేలింది. ఇక దివంగత రాంవిలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదని సర్వేలో వెల్లడైంది. అంతిమంగా చిరాగ్ పాశ్వాన్ ప్రచారం ‘మహాగట్ బంధన్’ కే ఎక్కువగా లాభించిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాగా మొత్తం 61 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 305 పోలింగ్ స్టేషన్లలో పీపుల్స్ పల్స్ – పీఎస్జీ సంయుక్తంగా ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించింది. ఇక బిహార్ లోని మొత్తం అసెంబ్లీ స్థానాల్లో ఈ సంఖ్య 25 శాతం. లింగ నిష్పత్తితోపాటు కుల,మత, వయస్సుల వారీ  సమాన ప్రాతిపదికన ఈ సర్వే నిర్వహించింది.(చదవండి: జేడీ(యూ)కి ఓటేసినందుకు చితకబాదారు)

పీపుల్స్ పల్స్- పీఎస్జీ సర్వే: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్-2020 ముఖ్యాంశాలు

  • బిహార్ తదుపరి ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ వైపు 36 శాతం,  నితీష్ కుమార్ వైపు 34 శాతం మంది ఓటర్లు మొగ్గు చూపారు
  • ఎన్నికల్లో అత్యధిక ప్రభావం చూపిన సమస్యలు నిరుద్యోగం (31%), ధరల పెరుగుదల (28%), వలసలు (19%), వరదలు (12%), ఎంఎస్‌పీ (9%) మరియు ఇతర సమస్యలు (1%)
  • తేజస్వి యాదవ్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు ఓటర్లను బాగా ప్రభావితం చేశాయి. 10 లక్షల ఉద్యోగాల భర్తీ హామీ యువతను ఆకట్టుకుంది. 
  • ముస్లిం, యాదవ సామాజికవర్గాల్లో అత్యధిక ఓటర్లు ఆర్జేడీ వైపే మొగ్గు చూపారు.
  • భూమిహార్ల సామాజికవర్గంసహా ఉన్నత కులాల ఓటర్లు సైతం గణనీయమైన సంఖ్యలో జేడీ (యూ)కి దూరమయ్యారు.
  • ఈ ఎన్నికల్లో పెద్దగా పని చేయని దివంగత రాం విలాస్ పాశ్వాన్ తనయుడు  చిరాగ్ పాశ్వాన్ ప్రభావం. అంతిమంగా చిరాగ్ పాశ్వాన్ ప్రచారం ‘మహాగట్ బంధన్’ కే ఎక్కువగా లాభించింది.
  • పాట్నా, నలందాతోపాటు వాయువ్య భోజ్‌పురి, బజ్జికా, మైథిలి, ఆంజిక మాట్లాడే ప్రాంతాల్లో జేడీయూకి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం. 
  • పలు చోట్ల ఎన్డీయే కూటమి ఓట్లకు గండి కొట్టిన తిరుగుబాటు, స్వతంత్ర్య అభ్యర్ధులు.

బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు- ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు
పీపుల్స్ పల్స్‌: మహాగట్ బంధన్‌కు స్వల్ప ఆధిక్యత లభించే అవకాశం

  • పీపుల్స్‌ పల్స్: జేడీయూ+ 90-110
  • ఆర్జేడీ+ 100-115
  • ఎల్‌జేపీ 3-5
  • ఇతరులు 8-18

టైమ్స్‌ నౌ - సీ ఓటర్‌ : ఆర్జేడీ కూటమికే మొగ్గు

  • ఎన్డీఏ 116
  • మహాకూటమి 120
  • ఎల్జేపీ 1
  • ఇతరులు 0

ఇండియా టుడే సర్వే: మధ్యప్రదేశ్‌ ఉపఎన్నికలు

  • మధ్యప్రదేశ్‌: బీజేపీ 16-18, కాంగ్రెస్‌ 10-12, బీఎస్పీ 0-1
  • మధ్యప్రదేశ్‌ ఉపఎన్నికల్లో బీజేపీకి 46శాతం సీట్లు
  • కాంగ్రెస్‌కు 43 శాతం, బీఎస్పీకి 6 శాతం సీట్లు
  • ఉత్తరప్రదేశ్‌ ఉపఎన్నికల్లో 7 స్థానాలకు- బీజేపీ 5-6, ఎస్పీ 0-1, బీఎస్పీ 0-1

బిహార్‌ 2015 ఫలితాలు

  • ఆర్జేడీ- 80, జేడీయూ- 71, బీజేపీ- 53
  • 2015లో అధికారంలోకి ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌ కూటమి
  • ఏడాదిన్నర తర్వాత కూటమి నుంచి బయటికొచ్చిన నితీష్


ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement