దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం ఒకే దశలో ఎన్నికలు జరగ్గా, చత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు దశల్లో పూర్తి అయ్యింది. తెలంగాణలో నవంబర్ 30 గురువారం సాయంత్రంతో పూర్తి కానున్నాయి. ఎన్నికలు పూర్తి అయిన వెంటనే ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారు అనే అంచనాలతో వాతావరణం హీటెక్కిపోతుంది. అయినా అధికారికంగా ఫలితాలు ప్రకటించక మునుపే వెల్లడించే ఈ ఎగ్జిట్ ఫలితాలు అంటే ఏంటీ? ఎవరు నిర్వహిస్తారు? దీనిలో వాస్తవం ఎంత?
ఎగ్జిట్ ఫలితాలు అంటే..
ఎగ్జిట్ పోల్స్ అనేది ఒక నిర్దిష్ట ఎన్నికలలో ఓట్లు ఎలా పడ్డాయనే దాని గురించి అంచానే వేసే ప్రక్రియ. దీన్ని వార్తా సంస్థలు, ఇతర ఏజెన్సీలు నిర్వహిస్తారు. ప్రజలు ఎవరకు పట్టం కడతారు? ఏ పార్టీ గెలుస్తుందని అంచానా వేసి చెబుతారు. ముందుగా ఓటింగ్ సరళి గురించి వివరణాత్మక సమాచారాన్ని అందించి తద్వారా విజేతలను అంచనా వేయడం జరుగుతుంది. ఈ ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా కచ్చితమైనది కానప్పటికీ..ఎన్నికలకు సంబంధించిన అనేక అంశాల గురించి స్థూలమైన అంచనాను ఇస్తాయి.
ఎన్నికలకు ముందు కూడా ఇలా ఓటింగ్ సర్వే చేస్తారు. దీన్ని ప్రీపోల్స్ అంటారు. ఈ ప్రీపోల్ సర్వేలు ఎన్నికల నోటిఫికేషన్ రాక మునుపు చేపట్టే ప్రక్రియ. ఇక్కడ వివిధ రాజకీయ పార్టీల పొత్తలు, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక ప్రభావం ఎలా ఉండబోతుంది అనేదాని గురించి విశ్లేషిస్తారు. ఇది పోలింగ్ తేది సమీపిస్తున్నప్పుడూ నియోజక వర్గాల వారీగా కొంతమంది ఓటర్లను కలుసుకుని సర్వే చేసి..ప్రీపోల్ సర్వే ఫలితాలను వెల్లడిస్తారు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం పోలింగ్ జరిగిన ఆ రోజే ఓటరు మనోగతం తెలుసుకుంటూ సర్వే చేసి చెబుతారు.
ఎప్పుడూ ప్రకటిస్తారంటే..
నవంబర్ 30 సాయంత్రం 5 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ ఫలితాలను ప్రకటిస్తారు. ఇలానే ఎందుకంటే.. ఎన్నికల సంఘం నవంబర్ 30 వరకు ఐదు రాష్ట్రాలకు ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించడాన్ని నిషేధించింది.
కచ్చితత్వం ఎంతంటే..
ఎగ్జిట్ పోల్ అంచనాలు రిజల్ట్‌కు దాదాపు దగ్గరగా ఉంటాయి. పోలింగ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతుంది. ఎగ్జిట్ పోల్ నిర్వాహకులు దాదాపు అన్ని వర్గాల ఓటర్లు కవర్ అయ్యేలా వేర్వేరు సమయాల్లో ఓటర్ల స్పందనను తెలుసుకుంటారు. కానీ ఈ ప్రక్రియను ఎంత ఎక్కువ మందిని పకడ్బందీగా, విస్తృతంగా సర్వే చేస్తేనే కచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
ఎగ్జిట్ పోల్ అప్‌డేట్స్‌ని ఎలా చూడాలి..
ఈ ఐదు రాష్ట్రాల్లో ఫలితాలు నవంబర్ 30న సాయంత్రం ప్రకటించడం జరుగుతుంది. వీటి ప్రత్యక్ష ప్రసారాన్ని న్యూస్ ఛానల్స్ తోపాటు ఇతర సోషల్ మీడియాల్లో వీక్షించి తెలుసుకోవచ్చు. దీంతో ఈ ఐదు రాష్ట్రాల్లో ప్రజల ఎవరికీ పట్టం కట్టారు? ఏ పార్టీ అధికారంలోకి రానుంది? అనేదానిపై ఓ స్పష్టత రానుంది.
ఓటింగ్ శాతం!
- 2023లో రాజస్థాన్‌లో 74.6% ఓటింగ్ నమోదవ్వగా, 2018 నాటి 74.24 % కంటే స్వల్పంగా మెరుగ్గా ఉంది.
- మధ్యప్రదేశ్ 2018లో 75%తో ఓటింగ్‌తో పోలిస్తే 2023లో దాదాపు 76% ఓటింగ్‌తో మెరుగ్గా ఉంది
- నవంబర్ 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మిజోరంలో 77.04% పోలింగ్ నమోదైంది.
- అదే రోజు, ఛత్తీస్‌గఢ్‌లో మొదటి దశలో పోలింగ్ జరిగిన 20 అసెంబ్లీ స్థానాల్లో 70.87 శాతం ఓటింగ్ నమోదైంది. మిగలిన 70 స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరిగింది.
- ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు 119 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు నిర్ణయించనున్నారు
ఈ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారంలో ఉండాలని కాంగ్రెస్ భావిస్తుండగా, మధ్యప్రదేశ్‌లో బీజేపీ మరో పర్యాయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అలాగే తెలంగాణలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది.
(చదవండి: ఎగ్జిట్ పోల్స్‌పై ఈసీ కీలక ప్రకటన.. రిలీజ్ ఎప్పుడంటే?)
Comments
Please login to add a commentAdd a comment