live stream
-
మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్!ఐదు రాష్ట్రాల్లో ఏ పార్టీకి మొగ్గు!
దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం ఒకే దశలో ఎన్నికలు జరగ్గా, చత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు దశల్లో పూర్తి అయ్యింది. తెలంగాణలో నవంబర్ 30 గురువారం సాయంత్రంతో పూర్తి కానున్నాయి. ఎన్నికలు పూర్తి అయిన వెంటనే ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారు అనే అంచనాలతో వాతావరణం హీటెక్కిపోతుంది. అయినా అధికారికంగా ఫలితాలు ప్రకటించక మునుపే వెల్లడించే ఈ ఎగ్జిట్ ఫలితాలు అంటే ఏంటీ? ఎవరు నిర్వహిస్తారు? దీనిలో వాస్తవం ఎంత? ఎగ్జిట్ ఫలితాలు అంటే.. ఎగ్జిట్ పోల్స్ అనేది ఒక నిర్దిష్ట ఎన్నికలలో ఓట్లు ఎలా పడ్డాయనే దాని గురించి అంచానే వేసే ప్రక్రియ. దీన్ని వార్తా సంస్థలు, ఇతర ఏజెన్సీలు నిర్వహిస్తారు. ప్రజలు ఎవరకు పట్టం కడతారు? ఏ పార్టీ గెలుస్తుందని అంచానా వేసి చెబుతారు. ముందుగా ఓటింగ్ సరళి గురించి వివరణాత్మక సమాచారాన్ని అందించి తద్వారా విజేతలను అంచనా వేయడం జరుగుతుంది. ఈ ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా కచ్చితమైనది కానప్పటికీ..ఎన్నికలకు సంబంధించిన అనేక అంశాల గురించి స్థూలమైన అంచనాను ఇస్తాయి. ఎన్నికలకు ముందు కూడా ఇలా ఓటింగ్ సర్వే చేస్తారు. దీన్ని ప్రీపోల్స్ అంటారు. ఈ ప్రీపోల్ సర్వేలు ఎన్నికల నోటిఫికేషన్ రాక మునుపు చేపట్టే ప్రక్రియ. ఇక్కడ వివిధ రాజకీయ పార్టీల పొత్తలు, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక ప్రభావం ఎలా ఉండబోతుంది అనేదాని గురించి విశ్లేషిస్తారు. ఇది పోలింగ్ తేది సమీపిస్తున్నప్పుడూ నియోజక వర్గాల వారీగా కొంతమంది ఓటర్లను కలుసుకుని సర్వే చేసి..ప్రీపోల్ సర్వే ఫలితాలను వెల్లడిస్తారు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం పోలింగ్ జరిగిన ఆ రోజే ఓటరు మనోగతం తెలుసుకుంటూ సర్వే చేసి చెబుతారు. ఎప్పుడూ ప్రకటిస్తారంటే.. నవంబర్ 30 సాయంత్రం 5 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ ఫలితాలను ప్రకటిస్తారు. ఇలానే ఎందుకంటే.. ఎన్నికల సంఘం నవంబర్ 30 వరకు ఐదు రాష్ట్రాలకు ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించడాన్ని నిషేధించింది. కచ్చితత్వం ఎంతంటే.. ఎగ్జిట్ పోల్ అంచనాలు రిజల్ట్కు దాదాపు దగ్గరగా ఉంటాయి. పోలింగ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతుంది. ఎగ్జిట్ పోల్ నిర్వాహకులు దాదాపు అన్ని వర్గాల ఓటర్లు కవర్ అయ్యేలా వేర్వేరు సమయాల్లో ఓటర్ల స్పందనను తెలుసుకుంటారు. కానీ ఈ ప్రక్రియను ఎంత ఎక్కువ మందిని పకడ్బందీగా, విస్తృతంగా సర్వే చేస్తేనే కచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎగ్జిట్ పోల్ అప్డేట్స్ని ఎలా చూడాలి.. ఈ ఐదు రాష్ట్రాల్లో ఫలితాలు నవంబర్ 30న సాయంత్రం ప్రకటించడం జరుగుతుంది. వీటి ప్రత్యక్ష ప్రసారాన్ని న్యూస్ ఛానల్స్ తోపాటు ఇతర సోషల్ మీడియాల్లో వీక్షించి తెలుసుకోవచ్చు. దీంతో ఈ ఐదు రాష్ట్రాల్లో ప్రజల ఎవరికీ పట్టం కట్టారు? ఏ పార్టీ అధికారంలోకి రానుంది? అనేదానిపై ఓ స్పష్టత రానుంది. ఓటింగ్ శాతం! 2023లో రాజస్థాన్‌లో 74.6% ఓటింగ్ నమోదవ్వగా, 2018 నాటి 74.24 % కంటే స్వల్పంగా మెరుగ్గా ఉంది. మధ్యప్రదేశ్ 2018లో 75%తో ఓటింగ్‌తో పోలిస్తే 2023లో దాదాపు 76% ఓటింగ్‌తో మెరుగ్గా ఉంది నవంబర్ 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మిజోరంలో 77.04% పోలింగ్ నమోదైంది. అదే రోజు, ఛత్తీస్‌గఢ్‌లో మొదటి దశలో పోలింగ్ జరిగిన 20 అసెంబ్లీ స్థానాల్లో 70.87 శాతం ఓటింగ్ నమోదైంది. మిగలిన 70 స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు 119 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు నిర్ణయించనున్నారు ఈ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారంలో ఉండాలని కాంగ్రెస్ భావిస్తుండగా, మధ్యప్రదేశ్‌లో బీజేపీ మరో పర్యాయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అలాగే తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది. (చదవండి: ఎగ్జిట్ పోల్స్‌పై ఈసీ కీలక ప్రకటన.. రిలీజ్ ఎప్పుడంటే?) -
Same Sex Marriage: రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పిటిషన్లపై తుది వాదనలను వినేందుకు రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది సుప్రీం కోర్టు. ఏప్రిల్ 18వ తేదీన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టనుంది. ఈ అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. సమాజంపై భారీ ప్రభావం చూపుతుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసు రాజ్యాంగ హక్కులు, ప్రత్యేక వివాహ చట్టం, ప్రత్యేక శాసన చట్టాలతో ముడిపడి ఉందని తెలిపింది. ఈ కేసుకి సంబంధించిన వాదనలు సుప్రీం కోర్టు వెబ్సైట్లో లేదా యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయని ధర్మాసనం తెలిపింది. ఇది సమాజంపై ప్రభావం చూపే కీలక అంశం కాబట్టి దీన్ని పరిగణలోని తీసుకోని సరైన తీర్పు ఇవ్వాలని చీఫ్ జస్టిస్ డీవై చంద్ర చూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. రాజ్యంగంలోని ఆర్టికల్ 145(3) ప్రకారం.. ఐగుగురు న్యాయమూర్తుల బెంచ్ ఈ సమస్యను పరిష్కరించడమే సముచితమని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇటీవల నలుగురు స్వలింగ సంపర్కులు తమ వివాహాలను గుర్తించడమే గాక తమకు నచ్చి వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కును కల్పించాలని సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఐతే దీన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. ఈ మేరకు ప్రభత్వం తరుఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్వలింగ సంపర్కుల వివాహలను గుర్తిస్తే న్యాయపరమైన సమస్యలు తలెత్తుతాయని అన్నారు. పైగా ఇద్దరు స్త్రీలు లేదా పురుషుల మధ్య జరిగిన వివాహానికి వ్యక్తిగత చట్టాలు లేదంటే రాజ్యంగబద్ధమైన చట్టాల కింద చట్టబద్ధత కల్పించడం గుర్తించడం సాధ్యం కాదని కేంద్రం తేల్చి చెప్పింది. (చదవండి: పిళ్లై ఈడీ కస్టడీ పొడిగింపు.. అదే తేదీన కవిత విచారణ) -
ముంబైలో ఆత్మహత్యాయత్నం.. ఐర్లాండ్‌లో గుర్తించి..
సాక్షి, ముంబై: ఫేస్బుక్ లైవ్ ద్వారా ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ యువకుడిని ముంబై పోలీసులు రక్షించారు. ఐర్లాండ్ ఫేస్బుక్ ప్రధాన కార్యాలయం ఆత్మహత్య ప్రయత్నాన్ని గుర్తించి అప్రమత్తం కావడంతో ఆ వ్యక్తిని స్థానిక పోలీసులు కాపాడారు. వివరాల్లోకెళ్తే.. ముంబైకి చెందిన 23 ఏళ్ల యువకుడు ఆదివారం రాత్రి 8.10 నిమిషాల సమయంలో రేజర్ బ్లేడ్‌తో ఆత్మహత్య చేసుకుంటూ ఫేస్ బుక్‌లో లైవ్ పెట్టాడు. దీంతో ఐర్లాండ్‌లోని ఫేస్బుక్ ప్రధాన కార్యాలయం ఈ విషయాన్ని గుర్తించి వెంటనే అప్రమత్తమై ముంబై పోలీసులకు సమాచారం ఇచ్చింది. చదవండి: (ఫేస్బుక్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయకపోతే చంపేస్తా..) ఐర్లాండ్‌లోని ఫేస్బుక్ ప్రధాన కార్యాలయం.. డీసీపీ రష్మి కరాండికర్కు స్క్రీన్షాట్లను కూడా పంపింది. రేజర్‌తో గొంతు కోసుకొనే ప్రయత్నంలో అతను లైవ్‌లో ఏడుస్తూ కనిపించాడు. దీంతో ముంబై సైబర్ పోలీసుల బృందం వెంటనే లోకేషన్‌ను ట్రేస్ చేసి.. 20 నిమిషాల్లోనే అతడిని గుర్తించగలిగారు. కాగా.. ముంబై పోలీసులకు ఫేస్బుక్ ప్రధాన కార్యాలయం నుంచి కాల్ వచ్చిన 50 నిమిషాల్లోనే పోలీసుల బృందం దూలేలోని బాధితుని ఇంటికి చేరుకొని అతడిని రక్షించారు. అయితే తీవ్ర రక్త స్రావం అవుతుండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా, ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. చదవండి: (భర్తను చంపి.. ఫేస్బుక్లో పోస్ట్ చేసి) -
గడ్డకట్టే చలిలో.. బికినీ ధరించి బాల్కనీలో
మాస్కో: ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత మనుషుల్లో అసాధరణ ధోరణులు కూడా ఎక్కువయ్యాయి. రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో స్టార్ అవ్వాలని భావించి చేసే పనులు ప్రాణాల మీదకు తేస్తున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి రష్యాలో చోటు చేసుకుంది. య్యూట్యూబర్ ఒకరు 1300 డాలర్లకు ఆశపడి చేసిన బుర్రతక్కువ పని వల్ల గర్భవతి అయిన అతడి గర్ల్‌ఫ్రెండ్ మరణించింది. వివరాలు.. ఒక యూజర్ ప్రాంక్ వీడియో చేస్తే 1300 డాలర్లు ఇస్తాననడంతో స్టాస్ రిఫ్లే(30) అనే యూట్యూబర్ లైవ్ స్ట్రీమ్‌లో భాగంగా తన గర్ల్‌ఫ్రెండ్ వాలెంటినా గ్రిగోరీవా మీద ప్రాంక్ వీడియో చేయాలని భావించాడు. ఇక దానిలో భాగంగా స్టాస్, గర్భవతి అయిన వాలెంటినాను బాల్కనీలో ఉంచి తాళం వేశాడు. బయట విపరీతమైన చలి... మంచు కురుస్తుంది. దారుణం ఏంటంటే ప్రాంక్ వీడియో కోసం వాలెంటినా బికినీ వేసుకుని బాల్కనీలో నిల్చుని ఉంది. దాదాపు 15 నిమిషాల పాటు గట్టకట్టుకుపోయే చలిలో ఉండటంతో వాలెంటినా మరణించింది. చలికి తట్టుకోలేక మధ్యలో డోర్ కొట్టింది కానీ స్టాస్ తలుపు తీయలేదు. దాంతో ఆమె రక్తం గడ్డకట్టుపోయి.. శ్వాస తీసుకోవడానికి కుదరక.. కడుపులో బిడ్డతో సహా మరణించింది. (గుడ్డు పగిలింది: రివేంజ్ అదిరింది) 15 నిమిషాల తర్వాత స్టాస్ ఆమెని ఇంటి లోపలికి తీసుకెళ్లి బ్లాంకెట్ కప్పాడు. కానీ అప్పటికే ఆమె మరణించింది. వాలెంటీనాను లోపలకి తీసుకువచ్చిన స్టాస్ ఆమెను లేపేందుకు ప్రయత్నించాడు. ‘వాల్య నీకు ఏమైంది.. ఎందుకు ఇలా చలనం లేకుండా పడి ఉన్నావ్.. దేవుడా నువ్వు మరణించావా ఏంటీ.. గైస్ ఆమె నాడి కోట్టుకోవడం లేదు.. శ్వాస తీసుకోవడం లేదు.. శరీరం పాలిపోయింది’ అంటూ అరవడం వీడియోలో వినిపించింది. స్టాస్ ఆమెని ఆస్పత్రికి తీసుకెళ్లాడు కానీ అప్పటికే వాలెంటినా మరణించినట్లు వైద్యులు నిర్థారించారు. ఈ మొత్తం తతంగం లైవ్ స్ట్రీమ్ కావడంతో పోలీసులు స్టాస్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోని యూట్యూబ్ డిలీట్ చేయడమే కాక ఇలాంటి దారుణాలకు పాల్పడటం నేరం అంటూ హెచ్చరించింది. -
కౌంట్‌డౌన్ స్టార్ట్
ఇంకొక్క రోజు ఆగితే కొన్ని నెలలుగా సాగుతున్న ఆసక్తికి తెర పడనుంది. ప్రపంచ సినీ ప్రియుల సినిమా పండగకు తెర లేవనుంది. ఆస్కార్.. హాలీవుడ్ చిత్రాలకు ఇచ్చుకునే అవార్డుల వేడుక. ప్రపంచం మొత్తం ఈ అవార్డుల వేడుక మనందరిదే అంటూ ఆపాదించుకున్న పాపులర్ అవార్డ్ ఫంక్షన్. అండ్ ది ఆస్కార్ గోస్ టు అంటూ... ఉత్తమ చిత్రంగా ఏ సినిమా నిలవనుంది? బెస్ట్ హీరోయిన్గా స్పీచ్‌ని ఎవరు ఇవ్వబోతారు? అనే డిస్కషన్లకు, ఊహాగానాలకు సోమవారం సమాధానం దొరకనుంది. 91వ ఆస్కార్ అవార్డుల వేడుక భారతీయ కాలమాన ప్రకారం 25 ఫిబ్రవరి సోమవారం ఉదయం ఆరున్నర గంటలకు జరగనుంది. రెడ్ కార్పెట్ పై నడిచే సెలబ్రిటీలు, లేడీ గాగా ప్రత్యేక ప్రదర్శన ఈ అవార్డు్డ వేడుకకు హైలైట్‌గా నిలవనుంది. ఏయే కేటగిరీల్లో అవార్డు ఎవరికొస్తుందో విశ్లేషించి చూసుకుంటే.. ఉత్తమ చిత్రం: ఈ ఏడాది అందరి ఆసక్తి సంపాదించిన చిత్రాలు ‘రోమా, ది ఫేవరెట్’. ఈ రెండు సినిమాలూ పదేసి నామినేషన్లు సంపాదించడమే ఒక కారణం కూడా. ఉత్తమ చిత్రాల విభాగానికి వస్తే.. బ్లాక్ అండ్ వైట్‌లో తెరకెక్కిన ‘రోమా’ ఆస్కార్ అవార్డ్స్‌లో సేఫ్ బెట్‌గా అనిపిస్తోంది. ఇటీవల జరిగిన బ్రిటీష్ ఫిల్మ్ అవార్డ్స్‌లో కూడా ‘బెస్ట్ పిక్చర్, డైరెక్టర్’ కేటగిరీల్లో విజయం సాధించింది. ఆ తర్వాత ఛాన్స్ ‘గ్రీన్ బుక్’ చిత్రానికి ఉంది. బెస్ట్ పిక్చర్‌గా గోల్డెన్ గ్లోబ్ సాధించింది ‘గ్రీన్ బుక్’. ‘రోమా’ కంటే ‘గ్రీన్‌బుక్’కు అవార్డు వచ్చే చాన్స్‌కి కారణం ఎడిటింగ్. ఎడిటింగ్ విభాగంలో స్ట్రాంగ్‌గా నిలిచిన చిత్రాలు బెస్ట్ పిక్చర్ అవార్డ్‌ను సాధించినవిగా చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత ‘ది ఫేవరెట్, బ్లాక్ల్యాన్స్మ్యాన్, బ్లాక్ ఫ్యాంథర్’ చిత్రాలకు అవకాశముంది. సూపర్ హీరో సినిమాలను పెద్దగా పట్టించుకోని ఆస్కార్ ఈ ఏడాది ‘బ్లాక్ ఫ్యాంథర్’కి నామినేషన్ ఇచ్చి ఆశ్చర్యపరిచింది. బెస్ట్ పిక్చర్‌గా నిలిస్తే సూపర్ హీరో మేజిక్ పని చేసిందనుకోవడమే. ‘ఎ స్టార్ ఈజ్ బోర్న్’ బెస్ట్ పిక్చర్ లిస్ట్‌లో ఉన్నా కూడా బెస్ట్ సాంగ్ కేటగిరీలో మాత్రమే అవార్డు కొడుతుందన్నది పలువురి అంచనా. ఉత్తమ దర్శకుడు: దర్శకుల విభాగంలో ఎవరు గెలుస్తారు అనే చర్చ కంటే స్పైక్‌లీ గెలిస్తే ఏంటి? అన్న చర్చ ప్రధానంగా మారింది. ఆస్కార్ అవార్డు నల్ల జాతీయులకు అందని ద్రాక్షే అన్నది ఆస్కార్ సత్యం. స్పైక్‌లీ ఆస్కార్‌ని సొంతం చేసుకోగలిగితే ఆస్కార్‌ని ముద్దాడబోయే తొలి నల్ల జాతీయ దర్శకుడిగా రికార్డ్ సృష్టించడం ఖాయం. ‘రోమా’ దర్శకుడు ఆల్ఫెన్స్ ఆల్రెడీ ‘గ్రావిటీ’తో ఆస్కార్‌ని అందుకోగా, ‘వైస్’ దర్శకుడు ఆడమ్ మెక్కీ ఓసారి ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్నారు. పావెల్ పావిల్కోవిస్కీ (కోల్డ్ వార్), యోర్గొస్ లాంథిమోస్ (ది ఫేవరెట్).. ఈ దర్శకుల్లో ఆస్కారం ఎవరికో? ఉత్తమ నటుడు: యాక్టర్‌గా ప్రతి పాత్రతో విభిన్నతను చూపిస్తుంటారు క్రిస్టిన్ బేల్. అయితే ఇప్పటివరకూ ఆస్కార్ అందుకోలేకపోయారాయన. ఇన్నాళ్ల ఈ వెయిటింగ్ అంతా వెయిట్‌గా మార్చి అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ డిక్ చెన్నే పాత్రలో కనిపించారు బేల్. రెండేళ్లక్రితం లియోనార్డో డికాప్రియో ఆస్కార్ కల తీరినట్టే క్రిస్టిన్ కల కూడా నెరవేరనుందా? బేల్ కంటే రమి మాలిక్ (బొహె మియన్ రాప్సోడి)కి చాన్స్ ఎక్కువ అని జరుగుతున్న చర్చలు చెబుతున్నాయి. ఆ తర్వాత ఈ రేస్‌లో ఉంది బ్రాడ్లీ కూపర్. ఈ ముగ్గురూ కాకుండా వొగ్గో మార్టిసన్, మిలిమ్ డాఫోయి గెలిస్తే కచ్చితంగా ప్రేక్షకులకు సర్ప్రైజ్లానే ఉంటుంది. ఉత్తమ నటి: బెస్ట్ యాక్ట్రస్ పోటీలో మొహమద్ గజనీ గ్లెన్ క్లోస్ (ది వైఫ్) ముందు వరుసలో ఉన్నారు. ఏడుసార్లు ఆస్కార్ నామినేషన్లో నిలిచినా ఆస్కార్ బెస్ట్ యాక్టర్ స్పీచ్ ఇవ్వడానికి ఛాన్స్ రాలేదామెకు. గ్లైన్ తర్వాత ఒలీవియా కోల్మన్ ఉన్నారు. వీరిని దాటితే లేడీ గాగా చేతిలో ఆస్కార్ పడే అవకాశముంది. మెలిసా మెక్‌కార్తీ, తొలి సినిమాతోనే ఆస్కార్ నామినేషన్ అందుకున్న యలిట్జా అపరికోయ పోటీలో ఉన్నారు. ఈ నామినీల్లో ఆస్కార్‌ని అందుకునేది ఎవరు? 30 సెకన్ల స్పీచ్ ఇచ్చేదెవరు? అనేది రేపు తెలుస్తుంది. వివాదం ఈ ఏడాది ఆస్కార్‌లో మోతాదుకి మించిన వివాదం ఏర్పడింది. హోస్ట్ లేకపోవడం. ఓ నాలుగువిభాగాలను లైవ్‌లో కాకుండా ఎడిట్ చేస్తామని పేర్కొనడంతో హాలీవుడ్ సాంకేతిక నిపుణులు, నటీనటుల నుంచి మిశ్రమ అభిప్రాయం రావడంతో ఆ ఆలోచనను వెనక్కు తీసుకుంది కమిటీ. పాపులర్ ఫిల్మ్ అనే కొత్త కేటగిరీలో ఈ ఏడాది అవార్డ్ ప్రదానం చేయాలనుకుంది. దాన్ని మళ్లీ తొలగించింది. అవార్డుల వేడుక నిడివి మించిపోతుందని బెస్ట్ సాంగ్ విభాగంలో ఎంపికైన అందరూ ఆ పాటకు వేదిక మీద పర్ఫార్మ్ చేయడం కుదరదని అకాడమీ పేర్కొంది. అందరూ ప్రదర్శించే చాన్స్ ఇవ్వకపోతే నేనూ చేయనని పేర్కొన్నారు లేడీ గాగా. ∙గతేడాది బెస్ట్ యాక్టర్ ఆస్కార్‌ని అందుకున్న నటులు కొత్తగా అవార్డులను స్వీకరించే వాళ్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. తొలుత గతేడాది అవార్డు గ్రహీతలు అవార్డు ప్రకటించకపోవచ్చని పేర్కొని, ఆ తర్వాత ఆ మాటను వెనక్కి తీసుకుంది. ఇలా ఒక నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత మార్చుకోవడంతో ‘ఈ ఆస్కార్ కమిటీకి ఏం జరిగింది? ఎందుకీ కన్ఫ్యూజన్’ అని హాలీవుడ్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. -
లైవ్‌లో ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న పోలీసులు
దుబాయ్: యూఏఈలోని షార్జాలో సోషల్ మీడియా లైవ్‌లో ఆత్మహత్యకు యత్నించి న భారత యువతిని ఆ దేశ పోలీసులు సకాలంలో అడ్డుకుని ప్రాణాల ను కాపాడారు. సోషల్ మీడియాలో స్వయంగా పోస్టు చేసిన తన చిత్రానికి ఎక్కువగా వ్యతిరేక స్పందనలు రావడంతో మనస్తాపం చెందిన యువతి బలవ న్మరణానికి యత్నించిందని పోలీసులు తెలిపారు. షార్జాలోని ఏ1 నహదా ప్రాంతంలో శుక్రవారం అర్థరాత్రి దాటాక రెండు గంటల సమయంలో సోషల్ మీడియాలో వీడియో లైవ్ పెట్టి ఆత్మహత్యకు సిద్ధం కాగా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఆమె ఉంటున్న ఇంటి వద్దకు చేరుకుని తలుపు తట్టగా...ఆ యువతి తండ్రి తలుపు తీశాడు. పోలీసులు కన్పించేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు. వెంటనే లోపలికి వెళ్లి ఆ యువతిని ఆత్మహత్యాయత్నం నుంచి కాపాడారు. ఆమెకు వైద్యులతో కౌన్సిలింగ్ ఇప్పించారు. -
ప్రత్యక్ష ప్రసారమే పరిష్కారం
న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ప్రొటెంస్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే కేజీ బోపయ్యను నియమించడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్–జేడీఎస్‌ల దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అదే సమయంలో బలపరీక్ష సందర్భంగా పాటించాల్సిన మార్గదర్శకాలపై కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ‘యడ్యూరప్ప బలనిరూపణను అన్ని చానళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయాలి. అసెంబ్లీ కార్యకలాపాలు పారదర్శకంగా కొనసాగేందుకు ఇది అత్యుత్తమ మార్గం’ అని సుప్రీంకోర్టు బెంచ్ పేర్కొంది. సభలో జరిగే కార్యకలాపాలను రికార్డు చేయాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. బోపయ్యను ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తూ గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వుల్ని కాంగ్రెస్–జేడీఎస్ కూటమి శుక్రవారం రాత్రి సుప్రీంలో సవాలుచేయడం తెల్సిందే. ఆ పిటిషన్‌పై విచారణను కొనసాగించాలంటే ప్రొటెం స్పీకర్ వాదనను వినాల్సి ఉంటుందని, దాంతో బలపరీక్ష వాయిదా పడుతుందని ధర్మాసనం స్పష్టం చేయడంతో కాంగ్రెస్–జేడీఎస్‌లు వెనక్కి తగ్గాయి. గవర్నర్‌ను ఆదేశించలేం: సుప్రీం సభలో అత్యంత సీనియర్ ఎమ్మెల్యేని ప్రొటెం స్పీకర్‌గా నియమించాలన్న సంప్రదాయాన్ని పక్కనపెట్టారని కాంగ్రెస్–జేడీఎస్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. సిక్రీ జోక్యం చేసుకుంటూ.. ‘అది సంప్రదాయం మాత్రమే. ప్రొటెం స్పీకర్‌గా అత్యంత సీనియర్‌ను నియమించమని మేం గవర్నర్‌ను ఆదేశించలేం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. -
'సర్జికల్ స్ట్రైక్స్ నేను లైవ్‌లో చూశా.. '
సాక్షి, న్యూఢిల్లీ : అసలు భారత్ సర్జికల్ దాడులు నిర్వహించిందా? నిజంగా నిర్వహిస్తే దానికి సంబంధించిన ఆధారాలు ఏవి ? అంటూ పాకిస్థాన్‌తోపాటు భారత్‌లో కూడా పలువురు కేంద్ర ప్రభుత్వాన్ని, మిలిటరీని ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే, ఆ దాడులు నిర్వహించే సమయంలో ఆర్మీ అధికారులు ఢిల్లీలో లైవ్ స్ట్రీమ్ చేశారంట. ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను హతం చేసే సమయంలో వైట్ హౌస్‌లో ఉండి నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎలా వీక్షించారో ఢిల్లీ, ఉదమ్ పూర్లోని ఆర్మీ ఉన్నతకార్యాలయంలో లైవ్ స్ట్రీమ్ ద్వారా వీక్షించారు. ఈ విషయాన్ని ఆ సమయంలో ఇన్చార్జ్గా వ్యవహరించిన డీఎస్ హుడా అనే ఆర్మీ అధికారి తెలియజేశారు. 'అవును.. మాకు లైవ్ ఛాయా చిత్రాలు వచ్చాయి. ఆ సమయంలో నేను ఉదమ్‌పూర్‌లో ఆపరేషన్ నిర్వహణ రూమ్‌లో కూర్చొని ఉన్నాను. లక్షిత ప్రాంతాలపై మన సైనికులు ఎలా దాడి చేశారో నేను లైవ్‌లో చూశాను. అదే మొత్తం లైవ్‌ను ఢిల్లీలోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌కు కూడా పంపించాం' అని చెప్పారు. అయితే, ఢిల్లీలో లైవ్‌ను ఎవరు చూశారని ప్రశ్నించగా 'ఆ లైవ్ ఫుటేజీని ఢిల్లీలో ఎవరు చూశారో నాకు తెలియదు.. మేం మాత్రం ఉదమ్‌పూర్‌లో చూశాం.. ఇందుకోసం ఏ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించారనే విషయం నేను చెప్పను.. కానీ, ఎక్కడి దాడినైనా లైవ్‌లో పంపించగల సామర్థ్యం భారత ఆర్మీకి ఉంది' అని చెప్పారు. దాడిలో పాల్గొని సైనికులు ఉదయం 6.30గంటలకు తిరిగొచ్చేశారని తెలిపారు. -
మార్కెట్ న్యూస్ కోసం ట్విట్టర్ డీల్
న్యూయార్క్ : లైవ్ స్ట్రీమ్ సర్వీసులపై మైక్రోబ్లాగింగ్ వైబ్ సైట్ ట్విట్టర, మీడియా సంస్థ బ్లూమ్ బర్గ్ మధ్య ఒప్పందం కుదిరింది. ట్విట్టర్ ప్లాట్ ఫామ్ పై వివిధ మీడియా కంపెనీల టీవీ షోలు వీక్షించే విధంగా ఈ డీల్ పై సంతకాలు జరిగాయి. "బ్లూమ్ బర్గ్ వెస్ట్", "వాట్ డూ యు మిస్?", "విత్ ఆల్ డ్యూ రెస్పెట్" వంటి షోలతో పాటు, నెట్ వర్క్స్ డైలీ స్టాక్ మార్కెట్ కవరేజ్ స్ట్రీమింగ్ హక్కులను ట్విట్టర్ పొందింది. ఈ మేరకు ఈ రెండు కంపెనీల మధ్య భాగస్వామ్యం కుదిరింది. అయితే ఈ డీల్ మొత్తం విలువను కంపెనీలు ఇంకా ప్రకటించలేదు. ఈ రెండు కంపెనీలు అడ్వర్ టైజింగ్ రెవెన్యూలను పంచుకోనున్నాయని మాత్రం టెక్నాలజీ వెబ్ సైట్ టెక్ క్రంచ్ బుధవారం నివేదించింది. బ్లూమ్ బర్గ్ భాగస్వామ్యంతో ఫైనాన్సియల్ మార్కెట్ల పనితీరును లైవ్ గా ట్విట్టర్ ప్లాట్ ఫామ్ పై చూడటానికి వీలవుతుందని, అలాగే మార్కెట్ విశ్లేషకుల కమెంటరీని కూడా లైవ్ గా వినొచ్చని ట్విట్టర్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ ఆంటోని నోటో ఓ ప్రకటనలో తెలిపారు. గ్లోబల్ బిజినెస్ లో, ఫైనాన్సియల్ మార్కెట్లో ఏం జరుగబోతుందో తెలుసుకోవడానికి ట్విట్టర్ మరింత వేగవంతమైన సాధనంగా, లైవ్ కమెంటరీకి ఇది ఓ ముఖ్యమైన సాధనంగా రూపొందనుందని నోటో పేర్కొన్నారు. ట్విట్టర్ ఈ వారంలోనే అమెరికా టెలివిజన్ నెట్ వర్క్ సీబీఎస్ తో డీల్ కుదుర్చుకుంది. ప్రజాస్వామ్య జాతీయ సమావేశాల షెడ్యూల్ ను ఈ నెల చివరి నుంచి ట్విట్టర్ లో లైవ్ గా అందించబోతోంది. 24 గంటల డిజిటల్ న్యూస్ స్ట్రీమింగ్ సర్వీసు ద్వారా సీబీఎస్ఎన్ ఫీడ్ ను ఆన్ లైన్ లో ఉచితంగా బ్రాడ్ కాస్ట్ చేయడానికి ఆమోదం లభించింది. 10ఎన్ఎఫ్ఎల్ గేమ్స్ ను ఈ ఏడాది చివరి నుంచి ట్విట్టర్ లైవ్ గా అందించనుంది. ఈ గేమ్స్ కు సీబీఎస్ పార్టనర్. గతవారమే ప్రత్యక్ష వింబుల్డన్ కవరేజ్ ను ట్విట్టర్ అందించింది. ప్రస్తుతం ఎన్ బీఏ, మేజర్ లీగ్ సాసర్, టర్నర్ వంటి వాటితో స్ట్రీమింగ్ రైట్ల కోసం ట్విట్టర్ సంప్రదింపులు కొనసాగిస్తోంది. -
బాలికపై అత్యాచారం.. ప్రత్యక్ష ప్రసారం!
తన బోయ్‌ఫ్రెండు ఓ బాలికపై అత్యాచారం చేస్తుంటే.. దాన్ని పెరిస్కోప్ అనే యాప్ ద్వారా లైవ్‌లో ప్రపంచం మొత్తానికి చూపించిందో అమ్మాయి. మారినా అలెక్సీవ్నా లోనినా అనే అమ్మాయి, ఆమె 17 ఏళ్ల స్నేహితురాలు కలిసి రేమండ్ బోయ్డ్ గేట్స్ (29) అనే వ్యక్తితో కూర్చుని మద్యం తాగుతున్నారని, ఆ మత్తులోనే అతడు 17 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. ఆ లైంగిక దాడి మొత్తాన్ని పెరిస్కోప్ యాప్ ద్వారా లోనినా లైవ్ స్ట్రీమింగ్‌లో ప్రసారం చేసింది. ఈ యాప్‌ను తమ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నవాళ్లు ఎవరైనా ఆ సమయంలో ఆ వీడియో చూడొచ్చన్నమాట. దాంతోపాటు అత్యాచారం జరగడానికి ముందురోజు రాత్రి బాధితురాలి నగ్న ఫొటోలను కూడా ఆమె తీసినట్లు ఆరోపణలున్నాయి. లోనినా స్నేహితులలో ఒకరు పెరిస్కోప్‌లో ఆ లైవ్ వీడియో చూసి, పోలీసులకు ఫిర్యాదుచేయడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. దాంతో లోనినా, గేట్స్ ఇద్దరి మీద ఒక కౌంట్ కిడ్నాప్, రెండు కౌంట్ల అత్యాచారం తదితర నేరాల కింద కేసులు పెట్టారు. నేరం రుజువైతే వారిద్దరికీ 40 ఏళ్ల వరకు జైలుశిక్ష పడుతుంది.