సాక్షి, ముంబై: ఫేస్‌బుక్ లైవ్ ద్వారా ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ యువకుడిని ముంబై పోలీసులు రక్షించారు. ఐర్లాండ్ ఫేస్‌బుక్ ప్రధాన కార్యాలయం ఆత్మహత్య ప్రయత్నాన్ని గుర్తించి అప్రమత్తం కావడంతో ఆ వ్యక్తిని స్థానిక పోలీసులు కాపాడారు. వివరాల్లోకెళ్తే.. ముంబైకి చెందిన 23 ఏళ్ల యువకుడు ఆదివారం రాత్రి 8.10 నిమిషాల సమయంలో రేజర్ బ్లేడ్‌తో ఆత్మహత్య చేసుకుంటూ ఫేస్ బుక్‌లో లైవ్ పెట్టాడు. దీంతో ఐర్లాండ్‌లోని ఫేస్‌బుక్ ప్రధాన కార్యాలయం ఈ విషయాన్ని గుర్తించి వెంటనే అప్రమత్తమై ముంబై పోలీసులకు సమాచారం ఇచ్చింది. చదవండి: (ఫేస్‌బుక్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయకపోతే చంపేస్తా..)
ఐర్లాండ్‌లోని ఫేస్‌బుక్ ప్రధాన కార్యాలయం.. డీసీపీ రష్మి కరాండికర్‌కు స్క్రీన్‌షాట్‌లను కూడా పంపింది. రేజర్‌తో గొంతు కోసుకొనే ప్రయత్నంలో అతను లైవ్‌లో ఏడుస్తూ కనిపించాడు. దీంతో ముంబై సైబర్ పోలీసుల బృందం వెంటనే లోకేషన్‌ను ట్రేస్ చేసి.. 20 నిమిషాల్లోనే అతడిని గుర్తించగలిగారు. కాగా.. ముంబై పోలీసులకు ఫేస్‌బుక్ ప్రధాన కార్యాలయం నుంచి కాల్ వచ్చిన 50 నిమిషాల్లోనే పోలీసుల బృందం దూలేలోని బాధితుని ఇంటికి చేరుకొని అతడిని రక్షించారు. అయితే తీవ్ర రక్త స్రావం అవుతుండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా, ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. చదవండి: (భర్తను చంపి.. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి)
Comments
Please login to add a commentAdd a comment