కన్నడ ఎగ్జిట్‌ పోల్స్‌.. వారికి నిరాశే! | Karnataka Bye Elections Exit Polls | Sakshi
Sakshi News home page

కన్నడ ఎగ్జిట్‌ పోల్స్‌.. వారికి నిరాశే!

Published Thu, Dec 5 2019 8:01 PM | Last Updated on Fri, Dec 6 2019 1:40 PM

Karnataka Bye Elections Exit Polls - Sakshi

బెంగళూరు : కర్ణాటకలోని 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. బీజేపీకి అగ్ని పరీక్షగా మారిన ఈ ఉప ఎన్నికలపై పలు మీడియా సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువరించాయి. బీజేపీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఈ ఎన్నికల్లో జేడీఎస్‌, కాంగ్రెస్‌లకు పరాభవం తప్పదనేలా ఎగ్జిట్‌ పోల్స్‌ ట్రెండ్స్‌ ఉన్నాయి. బీజేపీ 8-10, కాంగ్రెస్‌ 3-5, జేడీఎస్‌ 1-2, ఇతరులు 1 స్థానాల్లో గెలుపొందుతాయని కన్నడ పబ్లిక్‌ టీవీ సర్వే తెలిపింది. 

బీటీవీ వెలువరించిన ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం బీజేపీ 9, కాంగ్రెస్‌ 2, జేడీఎస్‌ 2, ఇతరులు 1 స్థానంలో విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. పవర్‌ టీవీ కూడా బీజేపీ 8-12, కాంగ్రెస్‌కు 3-6, జేడీఎస్‌ 0-2, ఇతరులు 1 స్థానాల్లో గెలుపొందుతుందని తెలిపింది. ప్రసుత్తం వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌ బట్టి చూస్తే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిలేదని స్పష్టమవుతోంది. బీజేపీ అధికారం కాపాడుకోవాలనుకుంటే కనీసం 6 స్థానాల్లో తప్పకుండా విజయం సాధించాల్సిన సంగతి తెలిసిందే.  

కాగా, గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉప ఎన్నికల పోలింగ్‌ కొనసాగింది. మొత్తంగా 66.25 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఈసీ తెలిపింది. డిసెంబర్‌ 9న ఈ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement