కీలకమైన పొలిటికల్ సెమీఫైనల్స్‌లో విజేత బీజేపీయేనని ఎగ్జిట్ పోల్స్ ముక్తకంఠంతో ప్రకటించాయి. దేశమంతా ఆత్రుతగా, ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ హవాయే నడిచిందని తేల్చాయి. లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావించే కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో మళ్లీ బీజేపీయే అధికారంలోకి రాబోతోందని సర్వేలన్నీ స్పష్టం చేశాయి. ఉత్తరాఖండ్‌లోనూ మళ్లీ బీజేపీ ప్రభుత్వమే కొలువుదీరవచ్చని పలు సర్వేలు వెల్లడించాయి. ఒకట్రెండు సర్వేలు కాంగ్రెస్‌కు ఓటేశాయి. మణిపూర్‌లోనూ బీజేపీకే అధిక సీట్లు కట్టబెట్టాయి.
అతి పెద్ద పార్టీగా మెజారిటీకి దగ్గరగా వెళ్తుందని అంచనా వేశాయి. పంజాబ్‌ను మాత్రం కేజ్రీవాల్ కరిష్మా కమ్మేసిందని, కాంగ్రెస్‌ను కంగుతినిపించి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు స్పష్టం చేశాయి. అత్యధిక సర్వేలు ఆప్‌కు మెజారిటీ సీట్లు కట్టబెట్టడం విశేషం. మణిపూర్, గోవాల్లోనూ ఆప్ ఉనికి చాటుకుంటుందని అంచనా వేశాయి.
ఇక గోవాలో ఓటరు తీర్పు హంగ్ దిశగా సాగిందని సర్వేలు తేల్చాయి. కొన్ని బీజేపీకి, మరికొన్ని కాంగ్రెస్‌కు అధిక సీట్లు కట్టబెట్టాయి. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల పోరు సోమవారం యూపీలో చివరిదైన ఏడో విడత పోలింగ్‌తో ముగిసింది. సాయంత్రం పోలింగ్ ముగిసీ ముగియగానే ఎగ్జిట్ పోల్స్, సర్వేల ఫలితాలు ఒకటి తర్వాత ఒకటి వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టీ ఓట్ల లెక్కింపు జరిగి అసలు ఫలితాలు వెల్లడి కానున్న గురువారం మీదే నెలకొని ఉంది!
ఇక్కడ చదవండి: ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఎగ్జిట్‌పోల్స్ ఏం చెబుతున్నాయంటే?
Comments
Please login to add a commentAdd a comment