ఢిల్లీ/ జైపూర్: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. ఇక, ఐదు రాష్ట్రాలకు ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ మూడో తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై ఎగ్జిల్ పోల్స్ వివరాలను వెల్లడిస్తున్నాయి. రాజస్థాన్‌లో 199 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మ్యాజిక్ నెంబర్ 100 మార్క్ దాటితే ప్రభుత్వ ఏర్పాటు చేసుకోవచ్చు.
అయితే, ప్రతీ ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారే సంప్రదాయం రాజస్థాన్‌లో కొనసాగుతోంది. దీంతో, ఈసారి ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని కాషాయ పార్టీ నేతలు, కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారు. మరోవైపు.. అధికార కాంగ్రెస్‌కు మరోసారి పట్టం కడాతరని చెబుతున్నారు. దీంతో, ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారాయి. తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలే తమను గెలిపిస్తాయని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది.
ఇక, ఎగ్జిట్ పోల్స్‌పై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా గెహ్లాట్ మీడియాతో మాట్లాడుతూ.. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా మాకు అనవసరం. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాష్ట్రంలో బీజేపీ గెలిచే ఛాన్స్ లేదు. రాజస్థాన్ సహా ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు.
ఎగ్జిట్‌పోల్స్ వివరాలు ఇలా..
పీపుల్స్ పల్స్ సర్వే..
BJP.. 95-115
Congress.. 73-95
Others.. 8-11.
ఇండియా టుడే..
BJP.. 55-72
Congress.. 119-141
Others.. 4-11
News Nation
BJP.. 89-93
Congress.. 99-103
Others.. 05-09
News18..
BJP.. 111
Congress.. 74
Others.. 14
Republic TV..
BJP.. 118-130
Congress.. 97-107
Others.. 0-2.
Jankibaat
BJP.. 100-122
Congress.. 62-85
Others.. 14-15.
TV9 Bhararvarsh Polstrat..
BJP.. 100-120
Congress.. 90-100.
Times Now-ETG..
BJP.. 108-128
Congress.. 56-72.
Times Now-ETG Rajasthan Election #ExitPolls2023: BJP Set To Get Majority With 108-128 Seats, Congress To Bag 56-72 #ExitPolls #ElectionsWithMirrorNow #RajasthanElections
— Mirror Now (@MirrorNow) November 30, 2023
Comments
Please login to add a commentAdd a comment