హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మెజార్టీ సర్వేలు తమ ఎగ్జిట్ పోల్స్‌లో స్పష్టం చేయగా, ఒకటి రెండు సర్వేలు మాత్రం బీఆర్‌ఎస్‌కు గెలిచే అవకాశాలున్నాయి పేర్కొన్నాయి. ఆరా మస్తాన్ సర్వే(ప్రీపోల్ సర్వే) కాంగ్రెస్ 58 నుంచి 67 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక బీఆర్‌ఎస్ 41-49 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని, అదే సమయంలో బీజేపీ 5 నుంచి 7, ఎంఐఎం, ఇతరులు కలుపుకుని 7 నుంచి 9 స్థానాల్లో విజయం సాధిస్తారని ఆరా మస్తాన్ తన ప్రీపోల్ సర్వేను బయటపెట్టింది.
ఇక ఆరా మస్తాన్ సర్వేలోని కొన్ని హైలెట్స్‌ను చూస్తే తెలంగాణలో ఐదుగురు మంత్రులు తీవ్రమైన పోటీ ఎదుర్కోబోతున్నట్లు పేర్కొంది. ఇక రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ట్రెండింగ్‌లో నిలిచిన బర్రెలక్క(అలియాస్ శిరీష) కూడా తన ఖాతాలో భారీ ఓట్లను వేసుకోబోతున్నట్లు సదరు సర్వే తెలిపింది. కొల్లాపూర్‌లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన బర్రెలక్క 10 వేలకు పైగా ఓట్లు సాధించే అవకాశం ఉందని తెలిపింది.
ఆరా మస్తాన్ సర్వే హైలెట్స్ ఇలా..
- 5 గురు మంత్రులు తీవ్రమైన పోటీ ఎదుర్కుంటున్నారు
- నిర్మల్లో మంత్రి అవుట్ అయ్యి ఛాన్స్
- ముధోల్, కామారెడ్డిలలో బీజేపీ గెలిచే ఛాన్స్
- బాల్కొండలో మంత్రి ప్రశాంత్ రెడ్డి గెలిచే అవకాశం
- కరీంనగర్ లో మంత్రి గంగుల గెలిచే ఛాన్స్
- సిరిసిల్లలో కేటీఆర్ మంచి మెజారిటీతో గెలిచే ఛాన్స్
- సిద్దిపేటలో అత్యధిక మెజారిటీతో(70 వేలు) హరీష్ గెలిచే ఛాన్స్
- దామోదర రాజ నర్సింహ గెలిచే ఛాన్స్
- తక్కువ మెజారిటీ తో కేసీఆర్ గెలిచే ఛాన్స్
- మహేశ్వరంలో స్వల్ప ఆధిక్యంతో సబిత గెలిచే ఛాన్స్
- అంబర్ పేటలో కారుకే ఛాన్స్
- తలసాని మంచి మెజారిటీతో గెలుస్తారు
- వనపర్తిలో మంత్రి నిరంజన్ ఓడిపోయే ఛాన్స్
- కొడంగల్ లో రేవంత్ గెలిచే ఛాన్స్
- బర్రెలక్క కి 10 వేల ఓట్లు
- ఉత్తమ్, పద్మావతి గెలుస్తారు
- కోమటి రెడ్డి బ్రదర్స్ గెలుస్తారు
- హుజూరాబాద్ లో 50 50 ఛాన్స్
- మంత్రి దయాకర్ రావు ఓడిపోయే ఛాన్స్
- ఖమ్మలో పువ్వాడ ఓడిపోయే ఛాన్స్
- పాలేరు, మధిర కాంగ్రెస్ గెలుస్తుంది
- కొత్తగూడెంలో సీపీఐ గెలుస్తుంది
Comments
Please login to add a commentAdd a comment