‘హింసను వీడి దేశాన్నిబలోపేతం చేయండి’
భవనాథ్‌పూర్: హింసాకాండకు స్వస్తిపలికి జనజీవన స్రవంతిలోకి రావాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మావోయిస్టులకు పిలుపునిచ్చారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన పలు బహిరంగసభల్లో ప్రసంగించారు. రాష్ట్రంలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీరావడానికి హింసనుమాని దేశాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయాలని నక్సల్స్‌ను కోరారు. రాష్ట్రాన్ని త్వరగా అభివృద్ధి చేసేందుకు, కేంద్రప్రభుత్వంతో కలసిమెలసి పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన రాష్ట్రప్రజలకు పిలుపునిచ్చారు. సరిహద్దులో కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధిచెప్పాలని, ఇకపై తెల్లజెండాలు ఎగురవేయాల్సిన పనిలేదని బీఎస్‌ఎఫ్‌ను ఆదేశించినట్టు ఆయన తెలిపారు.