
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని హత్యచేసేందుకు మావోయిస్టులు కుట్రపన్నారని ఇటీవల లేఖలు లభ్యమైన నేపథ్యంలో ప్రధాని భద్రతను మరింత కట్టుదిట్టం చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో జాతీయ భద్రతాసలహాదారు అజిత్ దోవల్, హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) డైరెక్టర్ రాజీవ్ జైన్‌లు సోమవారం ఢిల్లీలో సమావేశమై ప్రధాని భద్రతను సమీక్షించినట్లు వెల్లడించింది. అన్ని సంస్థలతో సంప్రదించి ప్రధాని భద్రతను కట్టుదిట్టం చేయాలని రాజ్‌నాథ్ అధికారుల్ని ఆదేశించినట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సోమవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. నిషేధించబడిన సీపీఐ(మావోయిస్టు)తో సంబం«ధాలు కొనసాగిస్తున్న వ్యక్తుల ఇళ్లలో ఇటీవల నిర్వహించిన సోదాల్లో ప్రధాని హత్యకు కుట్ర పన్నిన లేఖలు లభ్యమయ్యాయని పుణె పోలీసులు కోర్టుకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment