న్యూఢిల్లీ : తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత అక్రమాస్తుల కేసులో కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో జయలలితను నిర్దోషిగా తీర్పు వెలువరించటాన్ని సవాల్ చేస్తూ కర్ణాటక సర్కార్ ...ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తీర్పుపై అనుమానాలు ఉన్నాయంటూ కర్ణాటక ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
కాగా అక్రమాస్తుల కేసులో జయలలితకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఆర్ కుమారస్వామి కొట్టేశారు. 18 ఏళ్లుగా సాగిన అక్రమాస్తుల కేసులో జయలలితను దోషిగా తేలుస్తూ, నాలుగేళ్ల జైలుశిక్ష, వంద కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ గతంలో ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. దాంతో ఆమె పరప్పన అగ్రహార జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తర్వాత ఆమెకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు చేసింది. తర్వాత కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఇప్పుడు మొత్తం అక్రమాస్తుల కేసునే హైకోర్టు కొట్టేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ..సుప్రీంను ఆశ్రయించింది.
జయ కేసులో సుప్రీంను ఆశ్రయించిన కర్ణాటక సర్కార్
Published Tue, Jun 23 2015 11:06 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement
Advertisement