చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితకు సంబంధించిన సీబీఐ అధికారులు సీజ్ చేసిన లక్షలాది రూపాయల ఆస్తులను వేలం వేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, కర్ణాటక హైకోర్టు సీజేకు బెంగళూరుకు చెందిన ఆర్టీఐ కార్యకర్త నరసింహ మూర్తి లేఖలు రాశారు.
2016లో జయలలిత మరణించగా, అంతకుముందు 1996లోనే అక్రమ ఆస్తుల ఆరోపణలకు సంబంధించి సీబీఐ అధికారులు చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని అత్యంత ఖరీదైన గృహోపకరణాలు, ఫర్నిచర్, దుస్తులను సీజ్ చేసినట్లు గుర్తు చేశారు. వీటిని కర్ణాటక విధాన సౌధలోని ప్రభుత్వ ట్రెజరీలో ఉంచారని తెలిపారు. 26 ఏళ్లుగా ట్రెజరీలో ఉన్న ఈ ఆస్తులను వేలం వేసి, ఆ సొమ్మును ప్రజా సంక్షేమానికి వినియోగించాలని విన్నవించారు.
చదవండి: (Maharashtra Crisis: అప్పుడు కుక్కలు, పందులు.. ఇప్పుడు రమ్మని అడుగుతున్నారా?)
Comments
Please login to add a commentAdd a comment