
సాక్షి బెంగళూరు: డెల్టా ప్లస్ వేరియంట్ కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చేవారికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలను తప్పనిసరి చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప అధికారులకు సూచించారు. డెల్టాప్లస్‌ను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సి ముందస్తు చర్యలపై శుక్రవారం సాయంత్రం సీఎం తన నివాసంలో మంత్రులు, అధికారులతో చర్చించారు.
ప్రస్తుతానికి డెల్టా వైరస్ ప్రభావం ఎక్కువగా లేకున్నప్పటికీ దానిపై గట్టి నిఘా ఉంచాలని సీఎం సూచించారు. పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలపై దృష్టిసారించి వారికి అవసరమైన ఆహారాన్ని అందించాలని తెలిపారు. కల్యాణ మంటపాలు, హోటల్స్, పార్టీ హాల్స్, రిసార్టుల్లో 40 మందికి మించకుండా అనుమతులు మంజూరు చేయాలని సూచించారు.
చదవండి: పోలీస్ బాహుబలి!
Comments
Please login to add a commentAdd a comment