Yediyurappa Grand Daughter Soundarya Neeraj Found Dead At Bengaluru, Details Inside - Sakshi
Sakshi News home page

యడియూరప్ప మనవరాలు ఆత్మహత్య!

Published Fri, Jan 28 2022 3:33 PM | Last Updated on Sat, Jan 29 2022 6:53 AM

Yediyurappas Grand daughter Found Dead At Bengaluru Apartment - Sakshi

బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప మనవరాలు సౌందర్య మృతి చెందింది ఈ రోజు (జనవరి 28 శుక్రవారం) ఉదయం 10 గంటలకి బెంగుళూరులోని ఓ అపార్ట్ మెంట్‌లో ఆమె మృతి చెందిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఈ కేసును అనుమానాస్పద మృతిగా పోలీసులు రిజస్టర్‌ చేసుకున్నారు. కాగా, ఆమె ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. 

ఆమె వయసు 30 సంవత్సరాలు. యాడియూరప్ప పెద్ద కూతురు పద్మ కుమార్తె సౌందర్య. రెండేళ్ల క్రితం ఆమెకు వివాహమైంది. డాక్టర్‌ నీరజ్‌తో ఆమెకు వివాహం జరగ్గా, నాలుగు నెలల పాప కూడా ఉంది.  వృతిరిత్యా సౌందర్య డాక్టర్.. ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో ఆమె పనిచేస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బౌరింగ్‌ ఆస్పత్రికి తరలించారు. సౌందర్య మృతదేహాన్ని బెంగళూరు ఉత్తర అబ్బిగెరె నీరజ్‌ఫామ్‌ హౌజ్‌కు తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement