బెంగళూరు: కర్నాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్పకు తృటిలో ముప్పు తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అంతరాయం ఏర్పడింది. చివరకు పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రమాదం తప్పింది.
వివరాల ప్రకారం.. బీఎస్ యడియూరప్ప సోమవారం హెలికాప్టర్‌లో కలుబుర్గికి బయలుదేరారు. ఈ క్రమంలో జెవారీలో హెలికాప్టర్‌ను ల్యాండింగ్ చేసే సమయంలో హెలిప్యాడ్ పక్కనే ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, దుమ్ము, కాగితాలు ఒక్కసారిగా గాల్లోకి లేచాయి. దీంతో, పైలట్‌కు హెలికాప్టర్ ల్యాండింగ్ ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో కొద్దిసేపు ల్యాండింగ్‌ను నిలిపి వేసి ఆకాశంలోనే చక్కర్లు కొట్టారు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు.. హెలిప్యాడ్ అంతా క్లియర్ చేయడంతో హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#WATCH | Kalaburagi | A helicopter, carrying former Karnataka CM and senior leader BS Yediyurappa, faced difficulty in landing after the helipad ground filled with plastic sheets and waste around. pic.twitter.com/BJTAMT1lpr
— ANI (@ANI) March 6, 2023
Comments
Please login to add a commentAdd a comment