సాక్షి, శివాజీనగర్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి పెచ్చరిల్లుతున్నందున త్వరలో అఖిల పక్ష సమావేశం నిర్వహించి లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటామని సీఎం యెడియూరప్ప తెలిపారు. సోమవారం బీదర్‌లో విలేకరులతో మాట్లాడిన ముఖ్యమంత్రి బెంగళూరుతో పాటు పలు జిల్లాల్లో వైరస్ వేగంగా విస్తరిస్తోందన్నారు. ప్రజలు అనివార్యమైతేనే ఇంటినుంచి బయటకి రావాలన్నారు.
కరోనా నియమాలను పాటించాలని, రద్దీ ఉండరాదు అని కోరారు. వైరస్ పెరుగుతున్న జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ విధించడమైనది, ప్రజలు సహకరించాలి. లేకపోతే లాక్‌డౌన్‌తో పాటు మరిన్ని కఠిన చర్యలు అవసరమవుతాయి అని హెచ్చరించారు. ఈ నెల 17న జరిగే ఉప ఎన్నికల తరువాత కరోనా వైరస్ కట్టడికి మరిన్ని కఠిన నియమాలను అమలు చేయనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment