సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప రాజీనామాకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. బీజేపీ అధిష్టానం నిర్ణయానికి ఆయన తల వంచినట్లు తెలుస్తోంది. కాగా సీఎం మార్పు అంశంపై యడ్డీ వ్యతిరేకులు గత కొన్ని రోజులుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో... శుక్రవారం రాత్రి సీఎం యడియూరప్ప ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో భాగంగా రాజీనామాకు యడ్డీ అంగీకరించినట్లు సమాచారం.
అయితే, కొత్త ముఖ్యమంత్రి ఎంపికలో తనకు ప్రాధాన్యత ఇవ్వాలని యడియూరప్ప కోరినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించిన యడియూరప్ప తన కుమారులకు ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇవ్వాలని షరతు విధించినట్లు రాజకీయ వర్గాల సమాచారం. దీంతో... సీఎం యడియూరప్ప రాజీనామా చేస్తారంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. కాగా ఈ విషయంపై స్పందించిన యడియూరప్ప రాజీనామా ప్రచారాన్ని ఖండించారు. కానీ, ఆయన వ్యతిరేకులు మాత్రం యడ్డీ కుర్చీ దిగే సమయం ఆసన్నమైందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment