
బెంగళూరు: కోవిడ్ తర్వాత తలెత్తుతున్న బ్లాక్ ఫంగస్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలపై బ్లాక్ ఫంగస్ మరింత భారాన్ని పమోపుతుంది. ఈ క్రమంలో ఏపీలో బ్లాక్ ఫంగస్‌ని ఆరోగ్యశ్రీలో చేర్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి మరో రాష్ట్రం చేరింది. బ్లాక్ ఫంగస్ రోగులకు ప్రభుత్వ జిల్లా దవాఖానల్లో ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించినట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తెలిపారు. అంతేకాక రాష్ట్రంలో కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ను జూన్ 7 వరకూ పొడిగించినట్టు ఆయన వెల్లడించారు.
మంత్రులు, సీనియర్ అధికారులతో శుక్రవారం జరిగిన సమావేశం అనంతరం యడియూరప్ప ఈ నిర్ణయాలు ప్రకటించారు. నిపుణుల అభిప్రాయం తీసుకున్న మీదట కఠిన నియంత్రణలను జూన్ ఏడు వరకూ కొనసాగించాలని నిర్ణయించామని అన్నారు. మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రజలు సహకరించాలని, అనవసరంగా ఇంటి నుంచి బయటకు రావద్దని కోరారు.
చదవండి: ఆరునూరైనా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: వైఎస్ షర్మిల
Comments
Please login to add a commentAdd a comment