
సాక్షి, బెంగళూరు: బీఎస్ యడియూరప్ప, సన్నిహితులకు ఊరట దక్కింది. 2021 జూన్ 6న అవినీతి ఆరోపణల నేపథ్యంలో యడియూరప్ప, కుమారుడు బీవై విజయేంద్ర, వారి సన్నిహితులు శశిధర మరడి, విరూపాక్షప్ప, యమకన మరడి, సంజయశ్రీ, చంద్రకాంత్ రామలింగం, మంత్రి ఎస్‌టీ సోమశేఖర్, ఐఏఎస్ అధికారి జీసీ ప్రకాశ్, హోటల్ యజమాని కె.రవిలపై విచారణకు అనుమతివ్వాలని సామాజిక కార్యకర్త టీజే అబ్రహాం నగరంలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు.
అందరూ కలిసి నకిలీ కంపెనీల్లోకి ప్రభుత్వ వివిధ పథకాల నుంచి కోట్లాది రూపాయలను పెట్టుబడుల రూపంలో తరలించారని ఫిర్యాదులో ఆరోపించారు. పిటిషన్‌ను విచారించిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు.. వారి విచారణకు గవర్నర్ నుంచి అనుమతి తీసుకోనందున కొట్టివేస్తున్నట్లు తెలిపింది.