
బెంగళూరు: కావేరి నదిపై తాము నిర్మించే మేకెదాటు ప్రాజెక్టును అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదని కర్ణాటక సీఎం యడియూరప్ప స్పష్టం చేశారు. విధానసౌధ ఆవరణలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మేకెదాటు ప్రాజెక్టును నిర్మించితీరుతాం. దీనిని ఎవరూ అడ్డుకోలేరు’అని పరోక్షంగా తమిళనాడును ఉద్దేశించి అన్నారు. ‘ఈ విషయంలో సామరస్యంగా సాగిపోదామని తమిళనాడు సీఎం స్టాలిన్‌కు లేఖ రాశాను. అందుకు సరైన స్పందన లభించలేదు. ఏదేమైనా ప్రాజెక్టును కొనసాగిస్తాం. ఈ పథకంతో కర్ణాటక, తమిళనాడు రెండు రాష్ట్రాలకూ లబ్ధి కలుగుతుంది’అని సీఎం చెప్పారు. చట్ట పరిధిలోనే ప్రాజెక్ట్‌ను నిర్మిస్తాం, ఈ విషయంలో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి అనుమానం అవసరం లేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment