మైసూరు: రాష్ట్రంలో అధికారుల బదిలీల దందా మొత్తం ముఖ్యమంత్రి సిద్దరామయ్య కనుసన్నల్లో జరుగుతోందని, తన పెన్ డ్రైవ్‌లో ఉన్న రహస్యం బయటకు వస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి అన్నారు. గురువారం మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంలో బదిలీలు తప్పనిసరి, కానీ ఏ కొలమానం ప్రకారం బదిలీలు చేయాలో ఆ ప్రకారంగా చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్లు డబ్బుల కోసం బదిలీలు చేస్తున్నారు, ఇదంతా ముఖ్యమంత్రి ఆదేశాలతో నడుస్తోందని దుయ్యబట్టారు.
కుమారపై సీఎం భగ్గు
శివాజీనగర: జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి నిరాశతో తమ సర్కారుపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని సీఎం సిద్దరామయ్య అన్నారు. విధానసౌధ ముందున్న బాబూ జగ్జీవన్‌రాం విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన తరువాత మీడియాతో మాట్లాడారు. బదిలీల దందా సాగుతోందని ఆరోపించడం సబబు కాదన్నారు. వారి కాలంలోను బదిలీలు జరిగాయి. ఆయన లంచం పుచ్చుకొన్నాడా? అని ప్రశ్నించారు. సాధారణ బదిలీలు జరుగుతున్నాయన్నారు. హిట్ అండ్ రన్ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. బదిలీలకు– తన కుమారుడు యతీంద్ర పేరును అంటగట్టడం తగదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment