pen drive
-
ఏ గదిలో ఏం జరిగింది?.. వీడియో కెమెరా ఎక్కడ
యశవంతపుర: అత్యాచారం, లైంగిక వీడియోల కేసులో అరెస్ట్‌యిన జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరులోని ఆయన ఇంటిలో సిట్ పోలీసులు పంచనామా చేశారు. బసవనగుడిలోని తండ్రి రేవణ్ణ ఇంటిలో పంచనామా చేస్తుండగా తల్లి భవాని అక్కడే ఉన్నా ప్రజ్వల్‌ను పలకరించలేదు. ప్రజ్వల్‌ను ప్రశ్నించడం ముగిసి కస్టడీకీ తరలించే ముందు బసవనగుడి నివాసంలో పంచనామాకు తీసుకెళ్లారు. కొడుకును తీసుకొచ్చారని తెలిసి తల్లి భవాని ప్రజ్వల్‌కు ముఖం చూపించకుండా అవతలకు వెళ్లిపోయి తులసి చెట్టుకు పూజలో మునిగిపోయారు. పంచనామాకు ఆటంకం కలిగించవద్దని భవానికి పోలీసులు అంతకుముందే విన్నవించారు. బాధిత మహిళ అపహరణ కేసులో భవాని కూడా నిందితురాలే. ఆమెను కూడా పోలీసులు విచారించారు. ప్రజ్వల్ తనను ఫలానా గదిలో వేధించారని బాధితురాలు చెప్పడంతో ఆ గదిలో పోలీసులు సోదాలు సాగించారు.వీడియో కెమెరా ఎక్కడఅశ్లీల వీడియోలలో ఉన్నది తాను కాదని ప్రజ్వల్ చెబుతున్నారు. అశ్లీల వీడియోలలో ఈ గది పోలికలు కనిపించలేదని సిట్ వర్గాలు తెలిపాయి. బాధిత మహిళ చూపించిన జాగా, అశ్లీల వీడియోలో ఉన్న స్థలం ఒక్కటే అయితే ప్రజ్వల్ కేసు బలపడుతుంది. మరో పక్క వీడియో తీసిన అసలైన ఫోన్/ వీడియో కెమెరా కోసం సిట్ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. తన మొబైల్ పోయిందని ఏడాది కిందటే హొళెనరసిపుర పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రజ్వల్ చెప్పారు. -
పెన్‌డ్రైవ్ దర్యాప్తు పరుగులు
బనశంకరి: అత్యాచార బాధిత మహిళను అపహరించిన కేసులో జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణ భార్య భవానీ రేవణ్ణ శనివారం సిట్ అధికారులు విచారణ చేపట్టారు. హాసన్ జిల్లా కేఆర్ నగరలో బాధిత మహిళ అపహరణ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు బెంగళూరులో సిట్ ఆఫీసులో భవాని హాజరయ్యారు. సిట్ అధికారులు భవానీని విచారించారు. హైకోర్టు వారంరోజుల పాటు షరతులతో కూడిన మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సీఐడీ సముదాయంలో ఉన్న సిట్ ఆఫీసుకు భవాని లాయరుతో కలిసి వచ్చారు. తాను ఏ మహిళ ను అపహరించలేదని, తనపై కుట్ర చేశారని ఆమె చెప్పారు. సుమారు 4 గంటలపాటు విచారణ చేపట్టినప్పటికీ సమాచారం లభించలేదని సమాచారం. బాధిత మహిళ తమ ఇంట్లో పనిచేస్తుందని, నేను ఆమెను అపహరించలేదని భవాని పదేపదే చెప్పారు. షరతుల ప్రకారం భవాని రోజూ మధ్యాహ్నం 1 గంట కు సిట్ విచారణకు హాజరు కావాలి. సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరపవచ్చు. ఆపై ఆమెను పంపించి వేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులోనే భర్త రేవణ్ణ అరెస్టయి విడుదలయ్యారు.సిట్ ఆఫీసులో తల్లీ తనయుడుభవాని సిట్ ఆఫీసులో విచారణకు హాజరైనప్పడు అక్కడే పక్కగదిలో విచారణలో కుమారుడు ప్రజ్వల్ ఉన్నారు. ఒకరినొకరు పలకరించుకోలేని పరిస్థితి ఏర్పడింది. గత ఏప్రిల్ 27 నుంచి ప్రజ్వల్‌తో తల్లి భవాని ముఖాముఖి మాట్లాడింది లేదు. ప్రజ్వల్, భవానీని వేర్వేరుగా విచారించారు.హైకోర్టులో రేవణ్ణ అర్జీహాసన్ జిల్లా హొళేనరసిపుర టౌన్ పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైన లైంగిక దాడికేసు రద్దుచేయాలని జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ.రేవణ్ణ హైకోర్టులో వేసిన పిటిషన్ పై సిట్ కు హైకోర్టు నోటీస్ జారీచేసింది. జడ్జి జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్ ధర్మాసనం పిటిషన్‌పై ఇరు వర్గాల వాదనలను ఆలకించింది. సిట్ వాదన తెలియజేయాలని ఆదేశిస్తూ 21 తేదీకి వాయిదా వేసింది.ప్రజ్వల్ స్నేహితునికి నోటీసులుప్రజ్వల్కు విదేశాల్లో సాయం చేసిన అతని స్నేహితున్ని విచారణకు హాజరుకావాలని సిట్ నోటీస్ జారీచేసింది. 34 రోజుల పాటు ఎవరికీ అందుబాటులోకి రాకుండా ప్రజ్వల్ జర్మనీలో మకాం వేశాడు. ఇందుకు అతని స్నేహితుడు సాయం చేసినట్లు సిట్ గుర్తించింది. దీంతో విచారణకు రావాలని నోటీసులు పంపింది.కార్తీక్ గౌడ అరెస్టుహాసన్లో నగ్నచిత్రాల పెన్‌డ్రైవ్‌లను లీక్ చేసిన కేసులో సిట్ అధికారులు శనివారం కార్తీక్‌గౌడ అనే వ్యక్తిని అరెస్ట్‌చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని నిర్బంధించారు.హాసన్‌లో నివాసాలలో తనిఖీయశవంతపుర: అత్యాచారం, లైంగిక వీడియోల కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్‌కు చెందిన హాసన్ జిల్లా హొళెనరసిపురలోని నివాసంలో సిట్ అధికారులు మహజరు చేశారు. చెన్నాంబిక అనే పేరు గల ఈ ఇంటికి ప్రజ్వల్‌ను తీసుకెళ్లారు. ముందుజాగ్రత్తగా గట్టి పోలీసు బందోబస్తు నడుమ ప్రత్యేక వాహనంలో బయటకు కనబడకుండా బెంగళూరు నుంచి ప్రజ్వల్‌ను తీసుకెళ్లారు. మొదట ఆ నివాసంలో విచారణ జరిపి, మళ్లీ హాసన్‌కు తరలించారు. -
మా పరువు కొంచెం పోయింది
మైసూరు: పెన్‌డ్రైవ్ పంపిణీ వెనుక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, డ్రైవర్ కార్తీక్, నవీన్‌గౌడ తదితరుల ముఖ్య పాత్ర ఉందని, వారిని సిట్ విచారించాలని జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు హెచ్డీ కుమారస్వామి డిమాండ్ చేశారు. బుధవారం మైసూరులో మీడియాతో ఆయన మాట్లాడుతూ తానేమీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు మద్దతుగా నిలవడం లేదన్నారు. అతడు తప్పు చేసి ఉంటే శిక్ష విధించాలని చెప్పారు. దేవరాజేగౌడ, శివరామేగౌడ, డీకే శివకుమార్‌లు పెన్‌డ్రైవ్ పంపిణీ వెనుక ఉన్నారని పేర్కొన్నారు. 8 మంది పోలీసుల రక్షణలో కార్తీక్ ఉన్నాడని, అతన్ని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఈ కేసు వల్ల మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ కుటుంబం పరువు కొంతమేర దెబ్బతిన్నట్లు చెప్పారు. దేవెగౌడ కుటుంబాన్ని నాశనం చేయకుండా వదలనని డీకే శివకుమార్ చెప్పడం బట్టి ఆయన కుట్ర ఉందనే అనుమానాలు వస్తున్నాయన్నారు. డీకే అంటే తనకు ఎలాంటి అసూయ లేదన్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో వీడియో విడుదల చేశారు. వీడియో తయారు చేసినదానికంటే దాని పంపిణీ చేయడమే పెద్ద నేరమని చెప్పారు. ప్రజ్వల్ తనతో మాట్లాడేవాడు కాదని, ఇప్పడు హెచ్డీ రేవణ్ణ కాంటాక్టులో లేడని చెప్పారు. ప్రస్తుతం తాను విదేశాలకు వెళ్లాలంటే కూడా భయంగా ఉందని, ప్రజ్వల్‌ను రక్షించేందుకు వెళ్లారని ప్రచారం చేస్తారన్నారు. విశ్వసనీయత, నైతికతను కాపాడుకునేందుకు ప్రజ్వల్ దేశానికి తిరిగి రావాలని అన్నారు. -
పెన్‌డ్రైవ్ బయటికొస్తే సీఎం రాజీనామా: కుమారస్వామి
మైసూరు: రాష్ట్రంలో అధికారుల బదిలీల దందా మొత్తం ముఖ్యమంత్రి సిద్దరామయ్య కనుసన్నల్లో జరుగుతోందని, తన పెన్ డ్రైవ్‌లో ఉన్న రహస్యం బయటకు వస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి అన్నారు. గురువారం మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంలో బదిలీలు తప్పనిసరి, కానీ ఏ కొలమానం ప్రకారం బదిలీలు చేయాలో ఆ ప్రకారంగా చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్లు డబ్బుల కోసం బదిలీలు చేస్తున్నారు, ఇదంతా ముఖ్యమంత్రి ఆదేశాలతో నడుస్తోందని దుయ్యబట్టారు. కుమారపై సీఎం భగ్గు శివాజీనగర: జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి నిరాశతో తమ సర్కారుపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని సీఎం సిద్దరామయ్య అన్నారు. విధానసౌధ ముందున్న బాబూ జగ్జీవన్‌రాం విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన తరువాత మీడియాతో మాట్లాడారు. బదిలీల దందా సాగుతోందని ఆరోపించడం సబబు కాదన్నారు. వారి కాలంలోను బదిలీలు జరిగాయి. ఆయన లంచం పుచ్చుకొన్నాడా? అని ప్రశ్నించారు. సాధారణ బదిలీలు జరుగుతున్నాయన్నారు. హిట్ అండ్ రన్ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. బదిలీలకు– తన కుమారుడు యతీంద్ర పేరును అంటగట్టడం తగదన్నారు. -
మిగతా పేపర్లు పెన్‌డ్రైవ్ దాటలేదు! ఫిబ్రవరి 27న పెన్‌డ్రైవ్‌లోకి గ్రూప్–1 పేపర్
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్ వ్యవహారంపై సాంకేతిక దర్యాప్తు చేస్తున్న సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు తమ ప్రాథమిక నివేదికను గురువారం ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) అందించారు. కేవలం అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పరీక్ష పత్రాలు మాత్రమే లీక్ అయ్యాయని, గ్రూప్–1 పేపర్లు పరీక్ష పూర్తయిన తర్వాతే ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌లోకి చేరాయని, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లకు సంబంధించినవి పెన్‌డ్రైవ్ దాటి బయటకు రాలేదని తేల్చారు. కమిషన్ కంప్యూటర్లలో అక్రమ చొరబాట్లు, నెట్వర్క్ మార్పు చేర్పులను గుర్తించడానికి ఉన్న ప్రత్యేక సాఫ్ట్వేర్ ఓపెన్ కాకపోవడంతో దర్యాప్తు ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. రాజశేఖర్ సాయంతో.. ఏఈ పరీక్షకు సంబంధించిన జనరల్ స్టడీస్, సివిల్ పేపర్లకు డిమాండ్ ఉండటంతో ముందుగా అవి కా వాలని రేణుక కోరింది. దీంతో రాజశేఖర్ సాయంతో కమిషన్ కస్టోడియన్ శంకరలక్ష్మి కంప్యూటర్లోకి చొరబడిన ప్రవీణ్ అందులోని ప్రశ్నపత్రాల ఫోల్డర్‌ను తన పెన్‌డ్రైవ్‌లోకి కాపీ చేసుకున్నాడు. ఈ పెన్‌డ్రైవ్‌ను అందులోని సమాచారం, ఆధారాలు ధ్వంసం కాకుండా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నిపుణులు ప్రత్యేక సాఫ్ట్వేర్ల సాయంతో విశ్లేషించారు. ఫోల్డర్ ఎప్పుడు క్రియేట్ అయ్యింది? ఎప్పు డు మోడిఫై అయ్యింది? చివరిసారిగా ఎప్పుడు యాక్సెస్ అయ్యింది? తదితర వివరాలు పరిశీలించారు. పెన్‌డ్రైవ్‌లో ఫిబ్రవరి 27న ఈ ‘క్వశ్చన్ పేపర్స్’ఫోల్డర్ క్రియేట్ అయినట్లు తేల్చారు. ఆ పేపర్లను ఫోల్డర్లోనే ఉంచడంతో.. ఈ ఫోల్డర్లో ఉన్న ఏఈ ప్రశ్నపత్రాల ప్రింట్ఔట్ తీసిన ప్రవీణ్ మరుసటి రోజు (ఫిబ్రవరి 28న) రేణుక, ఆమె భర్త లవడ్యావత్ డాక్యాలకు అందించాడు. అదే సమయంలో తన వద్ద టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, అసిస్టెంట్ మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ), గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన పరీక్షల పేపర్లు కూడా ఉన్నాయని, అభ్యర్థులను చూడాలని రేణుకకు చెప్పాడు. అయితే ఏఎంవీఐ, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ పరీక్షలకు తేదీ ఖరారు కాకపోవడంతో వాటిపై ఆమె ఆసక్తి చూపలేదు. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష రాసే అభ్యర్థుల కోసం తమ సామాజిక వర్గంలోనే వెతికే ప్రయత్నాల్లో ఉండగా పట్టుబడింది. మరోవైపు గ్రూప్–1 పరీక్షలు గతేడాది అక్టోబర్‌లోనే పూర్తయిపోయినా.. శంకరలక్ష్మి ఆ పేపర్లను ఫోల్డర్లోనే ఉంచడంతో అవికూడా ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌లోకి చేరాయని సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రవీణ్ పెన్‌డ్రైవ్ నుంచి ఈ ఫైల్స్ మరో కంప్యూటర్లోకి కాపీ అయినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని వారు చెప్పారు. అయితే లీకేజ్ జరిగిందనే కోణంలోనే, వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని విశ్లేషణ కొనసాగిస్తున్నామని సిట్ అధికారులకు తెలిపారు. బిట్ లాకర్ ‘కీ’ని మర్చిపోయారు.. లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుకు సంబంధించిన పరీక్షలను నిర్వహించే టీఎస్పీఎస్సీ లోని సాంకేతిక అంశాల్లో ఉన్న మరో నిర్లక్ష్యాన్ని సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు గురువారం గుర్తించారు. అక్రమ చొరబాట్లను గుర్తించడానికి కంప్యూటర్లలో సాధారణంగా బిట్ లాకర్ అనే సాఫ్ట్వేర్ పొందుపరుస్తారు. దీన్ని ఓపెన్ చేసి, సమ గ్రంగా విశ్లేషించడం ద్వారా ల్యాన్లో కనెక్ట్ అయి ఉన్న ఏఏ కంప్యూటర్లు, ఎప్పుడెప్పుడు అక్రమ చొరబాట్లకు గురయ్యాయనేది గుర్తించవచ్చు. ఈ బిట్ లాకర్‌ను విశ్లేషించడానికి తెరవాలంటే దాన్ని ఇన్స్టాల్ చేస్తున్న సమయంలో వాడిన ‘కీ’తెలిసి ఉండాలి. కానీ టీఎస్పీఎస్సీ కంప్యూటర్లలో అది ఇన్స్టాల్ అయి ఏళ్లు గడిచి పోవడం, నాటి ‘కీ’ప్రస్తుత అడ్మిన్లకు తెలియకపోవడంతో బిట్ లాకర్ ఓపెన్ కావట్లేదు. ప్రత్యామ్నాయ సాఫ్ట్వేర్ల ద్వారా దానిని తెరవడానికి ప్రయత్నిస్తుండటంతో దర్యాప్తు ఆలస్యమవుతోంది. -
పెన్‌డ్రైవ్‌లో పలు పేపర్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల లీకేజీ కేసు దర్యాప్తులో కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవçహారంలో కీలక సూత్రధారిగా ఉన్న కమిషన్ కార్యదర్శి మాజీ వ్యక్తిగత సహాయకుడు పులిదిండి ప్రవీణ్‌కుమార్ పెన్‌డ్రైవ్‌లో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ పోస్టులకు సంబంధించిన పరీక్షల పేపర్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు. మరోపక్క ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన సిట్ తన పనిలో నిమగ్నమైంది. యూజర్ ఐడీ, పాస్వర్డ్ తస్కరించి.. తన ‘సన్నిహితురాలు’లవడ్యావత్ రేణుక కోరడంతో క్వశ్చన్ పేపర్ల లీక్‌కు ప్రవీణ్‌కుమార్ తెగించాడు. నెట్వర్క్ అడ్మిన్ రాజశేఖర్ సహాయంతో రంగంలోకి దిగాడు. పేపర్లన్నీ కమిషన్ కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లోని కంప్యూటర్లో ఉంటాయి. యూజర్ ఐడీ, పాస్వర్డ్ కస్టోడియన్ శంకరలక్ష్మి వద్ద ఉన్నాయి. వీటిని ఆమె తాను నిత్యం వినియోగించే నోట్ పుస్తకం ఆఖరు పేజీలో రాసి పెట్టుకున్నారు. గత నెల ఆఖరి వారంలో ఆమె కార్యదర్శి పేషీకి వచ్చినప్పుడు దృష్టి మళ్లించడం ద్వారా వాటిని నమోదు చేసుకున్నాడు. టీఎస్పీఎస్సీలోని అన్ని కంప్యూటర్లు ల్యాన్ నెట్‌వర్క్‌తో కనెక్ట్ అయి ఉంటాయి. ఈ విషయం తెలిసిన రాజశేఖర్.. ప్రవీణ్ కంప్యూటర్ నుంచే శంకరలక్ష్మి యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అయ్యేలా సహకరించాడు. క్షణాల్లో పని కానిచ్చేయాలని భావించిన ప్రవీణ్ క్వశ్చన్ పేపర్లకు సంబంధించిన ఫోల్డర్ మొత్తం తన పెన్‌డ్రైవ్‌లోకి కాపీ చేసుకున్నాడు. ఫోన్ల విశ్లేషణతోనే పూర్తి స్పష్టత ప్రాథమిక దర్యాప్తు నేపథ్యంలో పోలీసులు ఏఈ పరీక్ష పత్రం మాత్రమే లీక్ అయిందని, ప్రవీణ్ ఫోల్డర్లో ఉన్న మిగిలిన ప్రశ్న పత్రాలు బయటకు రాలేదని తేల్చారు. దీన్ని సాంకేతికంగా నిర్థారించుకోవాలని నిర్ణయించారు. దీనికోసమే నిందితులతో పాటు అనుమానితుల నుంచి స్వాధీనం చేసుకున్న 16 ఫోన్లు, ల్యాప్టాప్స్, పెన్‌డ్రైవ్స్‌లను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. వాటిలో ఏఏ క్వశ్చన్ పేపర్ల షేరింగ్ జరిగింది? ఎవరి నుంచి ఎవరికి వెళ్లాయి? వేటిని కాపీ చేశారు? అంశాలను తేల్చనున్నారు. యువతుల వ్యవహారం పరిగణనలోకి.. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సిట్ బృందం బుధవారం కమిషనర్ సీవీ ఆనంద్‌తో సమావేశమైంది. ప్రాథమికంగా ఈ కేసును సీసీఎస్‌లో రీ–రిజిస్టర్ చేశారు. అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ కమిషన్ కార్యాలయానికి వెళ్లి కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌తో పాటు ప్రశ్న పత్రాలు భద్రపరిచే విధానం తదితరాలను పరిశీలించారు. కస్టోడియన్ శంకరలక్ష్మి వాంగ్మూలం నమోదు చేశారు. ప్రవీణ్‌తో సన్నిహితంగా ఉన్న 46 మంది మహిళలు, యువతుల వ్యవహారాన్నీ పోలీసులు పరిగణనలోకి తీసుకున్నారు. వీరి వ్యవహారాల్లోనూ ఏవైనా లీకేజీలు, ఇతరత్రా కోణాలు ఉన్నాయా? అనేది తేల్చనున్నారు. అవసరమైన వారిని పిలిచి విచారించాలని నిర్ణయించారు. రెండో ప్రయత్నంలో విషయం లీక్.. ఈ ఫోల్డర్లో అప్పటికే జరిగిపోయిన, జరగాల్సిన పరీక్షలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్లు ఉండటాన్ని గుర్తించిన ప్రవీణ్ పెన్డ్రైవ్కు లాక్ సెట్ చేశాడు. గత నెల ఆఖరి వారంలోనే రేణుక కోరిన పరీక్ష పత్రం అందజేశాడు. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష (ఈ నెల 12న జరగాల్సిన పరీక్ష), ఇంకా తేదీలు ఖరారు కాని అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ పోస్టుల పేపర్లను అదును చూసుకుని విక్రయించాలని భావించాడు. ఏఈ పేపర్‌ను రేణుక తదితరులు నీలేష్ , గోపాల్‌లకు రూ.10 లక్షల చొప్పున విక్రయించారు. టౌన్ ప్లానింగ్ పరీక్ష పత్రం విషయాన్నీ రేణుక వీరికి చెప్పింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉంటే తనకు తెలపాలని కోరింది. ఇలా ఈ పరీక్ష రాసే అభ్యర్థుల కోసం వెతుకుతుండగానే విషయం బయట పడింది. -
పెన్ డ్రైవ్‌లో ప్రైవేట్ ఫోటోలు.. 5లక్షలు ఇవ్వాలంటూ
తమ ప్రైవేట్ ఫోటోలను, వీడియోలను మొబైల్లో బంధించడం ఇటీవల కాలంలో ఎక్కువైపోయింది. జ్ఞాపకంగా ఉంచుకోవడం కోసం లవర్స్ అలా చేస్తుంటారు. కానీ అది ఎంత ప్రమాదకరమో మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటననే నిదర్శనం. ఓ ప్రేమ జంట తమ జ్ఞాపకార్థం ప్రైవేట్ ఫోటోలు దిగి పెన్ డ్రైవ్‌లో బంధించుకుంది. అది కాస్త మరో వ్యక్తి చేతిలో పడింది. దీంతో అతడు ఆ లవర్స్‌కు ఫోన్ చేసి ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడు. అలా చేయకుండా ఉండాలంటే రూ.5 లక్షలు ఇవ్వాలని వారిని బ్లాక్మెయిల్ చేశాడు. అతని వేధింపులు తాళలేక ఆ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భోపాల్‌కి చెందిన ఓ లా స్టూడెంట్(21),ఆమె బాయ్‌ఫ్రెండ్ కలిసి ఇటీవల తమ సహచర లా స్టూడెంట్స్‌తో కలిసి ఢిల్లీ టూర్ వెళ్లారు. అక్కడినుంచి తిరిగొస్తున్న క్రమంలో మథుర హైవే పక్కనున్న ఓ హోటల్ వద్ద భోజనం చేసేందుకు ఆగారు. ఆ సమయంలో తమ లగేజీని ఓ టేబుల్ పక్కన పెట్టారు. తిరుగు ప్రయాణంలో బ్యాగ్‌లో ఉన్న పెన్‌డ్రైవ్ అక్కడే పడిపోయింది. అది ఓ వ్యక్తికి దొరికింది. అందులో లవర్స్ ప్రైవేట్ ఫోటోలు ఉండటంతో వారిని బ్లాక్ మెయిల్ చేయాలని భావించాడు. ఫొటోల స్క్రీన్‌షాట్‌పై యువతి మొబైల్ నంబర్ ఉండగా ఈ నెల 15న తొలుత ఆమెకు ఫోన్ చేసి రూ.5 లక్షల కోసం బ్లాక్మెయిల్ చేశాడు. ఆ యువతిని బెదిరించి ప్రియుడి మొబైల్ నంబర్ సేకరించాడు. అతడికి కూడా ఫోన్ చేసి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకపోతే వారిద్దరు కలిసి దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. రోజు రోజుకి అతని వేధింపులు ఎక్కువ అవడంతో ఆ జంట పోలీసులను ఆశ్రయించింది. ప్రేమ జంట ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతని ఆచూకీ తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. -
‘ఆ పెన్‌డ్రైవ్‌లో నా జీవితం ఉంది’
హైదరాబాద్ : పోయిన పెన్‌డ్రైవ్ వెల గురించి కాదని, అందులో తన జీవితం ఉందని సినీ నటి, రాష్ట్రపతి అవార్డు గ్రహీత రాధా ప్రశాంతి తెలిపారు. ఆ పెన్‌డ్రైవ్‌లో తన ఫొటోలు, తన కుటుంబసభ్యుల ఫొటోలు ఉన్నాయని, వాటిని మార్ఫింగ్ చేస్తే పరిస్థితి ఏమిటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రాధాప్రశాంతి విలేకరులతో మాట్లాడుతూ ... మూడు వారాలక్రితం ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి తాను రాష్ట్రపతి అవార్డుగ్రహీతను కావడం, పలు సామాజిక కార్యక్ర మాల్లో ముందుండటం, 100కు పైగా సినిమాల్లో నటించడంతో తనకు ఒక ప్రత్యేక పేజీ రూపొందిస్తానని మాయమాటలు చెప్పి తన పెన్‌డ్రైవ్ తీసుకెళ్లాడని తెలిపారు. ఆ పెన్‌డ్రైవ్‌లో తన కుటుంబ సభ్యుల ఫొటోలతో పాటు తాను సినిమాల్లో నటించినప్పటి ఫొటోలు, విలువైన డాక్యుమెంట్లు ఉన్నాయన్నారు. అందుకే బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు. దీనిపై పలు వార్తా పత్రికలు రకరకాలుగా రాయడం తనను తీవ్రంగా బాధిస్తోందన్నారు. -
సినీ నటి పెన్ డ్రైవ్ పోయింది...
కాల్‌డేటాను సేకరించారు.. అడ్రస్ కోసం గాలించారు.. ప్రత్యేకంగా ఓ బృందాన్ని నియమించారు... పోలీసు పెట్రోవాహనంలో నలుగురు క్రైం పోలీసులు దిల్ షుక్నగర్కు పరుగులుతీసి ఎట్టకేలకు కావాల్సిన వ్యక్తిని అరెస్టు చేశారు. ఇంతకు అతడు దొంగిలించింది ఏంటో తెలుసా..? వింటే ఆశ్చర్యపోతారు. అవును మరి ఆయన దొంగిలించింది పెన్‌డ్రైవ్. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. దిల్‌షుక్‌నగర్‌లో నివసించే జగదీష్ అనే వ్యక్తి ఆక్యుపంక్షర్ థెరపిస్టుగా పనిచేస్తున్నాడు. రెండు వారాల క్రితం ఫిలింనగర్లో నివసించే సినీ నటి రాధా ప్రశాంతికి పరిచయం అయ్యాడు. ఈ నేపథ్యంలో వారం రోజుల నుంచి జగదీష్ ఆమెతో ఫోన్లో అందుబాటులో లేకుండా పోయాడు. అయితే తన ఇంట్లో పెన్‌డ్రైవ్ చోరీకి గురైందని అది జగదీష్ చోరీ చేశాడంటూ ఆమె మూడు రోజుల క్రితం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు జగదీష్ కోసం గాలింపు చేపట్టారు. మూడు రోజులు అతని ఇంటి వద్ద మాటువేశారు. రేయింబవళ్లు అతడి కోసం వెతికేందుకు పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. తీరా జగదీష్‌ను విచారిస్తే ఆ పెన్‌డ్రైవ్ తాను తీయలేదని తెలిపాడు. పెన్‌డ్రైవ్ పోయిందని సినీనటి ఇచ్చిన ఫిర్యాదు మీద పోలీసులు చేసి హడావుడికి అవాక్కయ్యారు. ఇటీవల బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయిదు ఖరీదైన కార్లు చోరీకి గురయ్యాయి. ఇందులో ఫార్చునర్లాంటి ఖరీదైన కారు కూడా ఉంది. వీటి కోసం గాలించాల్సిన పోలీసులు ఓ పెన్‌డ్రైవ్ దొంగ కోసం మూడు రోజులుగా వేట సాగించారని తెలిసి.. జనం ముక్కున వేలేసుకున్నారు.