‘ఆ పెన్‌డ్రైవ్‌లో నా జీవితం ఉంది’
హైదరాబాద్ : పోయిన పెన్‌డ్రైవ్ వెల గురించి కాదని, అందులో తన జీవితం ఉందని సినీ నటి, రాష్ట్రపతి అవార్డు గ్రహీత రాధా ప్రశాంతి తెలిపారు. ఆ పెన్‌డ్రైవ్‌లో తన ఫొటోలు, తన కుటుంబసభ్యుల ఫొటోలు ఉన్నాయని, వాటిని మార్ఫింగ్ చేస్తే పరిస్థితి ఏమిటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రాధాప్రశాంతి విలేకరులతో మాట్లాడుతూ ... మూడు వారాలక్రితం ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి తాను రాష్ట్రపతి అవార్డుగ్రహీతను కావడం, పలు సామాజిక కార్యక్ర మాల్లో ముందుండటం, 100కు పైగా సినిమాల్లో నటించడంతో తనకు ఒక ప్రత్యేక పేజీ రూపొందిస్తానని మాయమాటలు చెప్పి తన పెన్‌డ్రైవ్ తీసుకెళ్లాడని తెలిపారు.
ఆ పెన్‌డ్రైవ్‌లో తన కుటుంబ సభ్యుల ఫొటోలతో పాటు తాను సినిమాల్లో నటించినప్పటి ఫొటోలు, విలువైన డాక్యుమెంట్లు ఉన్నాయన్నారు. అందుకే బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు. దీనిపై పలు వార్తా పత్రికలు రకరకాలుగా రాయడం తనను తీవ్రంగా బాధిస్తోందన్నారు.