భారీ వర్షాలతో కొడగు జిల్లా అంతా అతలాకుతలంగా మారిపోయింది. దీంతో ఎనిమిదో తరగతి చదువుతున్న కలేరా ఫతే అనే పిల్లాడు.. బడ్జెట్‌లో తమ(కొడగు) ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెడుతూ ఓ వీడియో చేశాడు. ‘కావేరీ జన్మస్థలం కొడగు. భారీ వర్షాలు పడితే కావేరీ జలాలతో మాండ్యా, మైసూర్, చివరకు మద్రాస్ సహా అన్నీ ప్రాంతాలు లాభపడతాయి. అలాంటిది కొడగునే మీరు(కుమాస్వామిని ఉద్దేశించి..) అనాథలా వదిలేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఇక్కడ పంటలు నీట మునిగాయి. ఏనుగులు అడవులు దాటి పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. రోడ్లు చిధ్రం అయిపోయాయి. కానీ, మీరు చేసింది మాములు మోసం కాదు. బడ్జెట్‌లో ఎలాంటి గ్రాంట్లు ఇవ్వలేదు. ఇది మమల్ని దారుణంగా నిరాశపరిచింది’ అంటూ వీడియోను రూపొందించాడు.